ఉత్తర రైల్వే

(ఎన్‌ఆర్ నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర రైల్వే 16 మండలాలు, భారతీయ రైల్వేలులో ఉత్తర జోన్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం బరోడా హౌస్, న్యూఢిల్లీ రైల్వే స్టేషను వద్ద ఢిల్లీలో ఉంది. ఉత్తర రైల్వే భారతీయ రైల్వేలు తొమ్మిది పాత మండలాలులో ఒకటి, నెట్వర్క్ పరంగా కూడా అతి పెద్ద 6807 కిలోమీటర్ల రైలు మార్గం కలిగి ఉంది.[1] ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాలను వర్తిస్తుంది. రైల్వే జోన్ 1952 ఏప్రిల్ 14 న, జోధ్‌పూర్ రైల్వే, బికానెర్ రైల్వే, తూర్పు పంజాబ్ రైల్వే, మొఘల్సరాయ్ (ఉత్తర ప్రదేశ్) ఈస్ట్ ఇండియన్ రైల్వే వాయువ్య మూడు విభాగాలు విలీనం ద్వారా, సృష్టించబడింది.

Northern Railway
1-Northern Railway
ఆపరేషన్ తేదీలు14 April 1952–
ట్రాక్ గేజ్Mixed
ప్రధానకార్యాలయంNew Delhi Railway Station
జాలగూడు (వెబ్సైట్)http://www.nr.indianrail.gov.in/

ఇది ఉత్తర భారతదేశంలో 1859 మార్చి 3 న అలహాబాద్, కాన్పూర్ నుండి ప్రారంభించిన మొదటి ప్రయాణీకుల రైలు మార్గమును కలిగి ఉంది.[2] ఉత్తర రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు బరోడా హౌస్, న్యూ ఢిల్లీ, విభాగపుల ప్రధానకేంద్రంగా అంబాలా (హర్యానా), ఢిల్లీ, ఫిరోజ్పూర్ (పంజాబ్), లక్నో (ఉత్తరప్రదేశ్), మోరాడాబాద్ (ఉత్తర ప్రదేశ్) వద్ద ఉన్నాయి.

చరిత్ర

ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము 1859 మార్చి 3 న అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది. ఈ మార్గము ఢిల్లీ-అంబాలా-కాల్కా రైలు మార్గము ద్వారా 1889 సం.లో అనుసరించబడింది. ఉత్తర భారతదేశం మందు అత్యంత అధికంగా విస్తరించియున్న ఉత్తర రైల్వేలో గతంలో ఎనిమిది డివిజనల్ మండలాలు అయిన అలహాబాద్ బికానెర్, జోధ్పూర్, ఢిల్లీ, మోరాడాబాద్, ఫిరోజ్‌పూర్, అంబాలా,, లక్నో ఉన్నాయి. భారతీయ రైల్వేలు మండలాలు తిరిగి వ్యవస్థీకరణ చేయడం ద్వారా ఉత్తర రైల్వే జోన్ 1952 ఏప్రిల్ 14 నాటి దాని ప్రస్తుత రూపంలో వచ్చింది, ఈ జోన్ లో ఇప్పుడు ఐదు డివిజనలు ఉన్నాయి.

విలాసవంతమైన రైళ్ళు

ప్రయాణీకుల రైళ్లు

హింసాగర్ ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-జబల్పూర్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, కాశీ విశ్వనాధ్ ఎక్స్‌ప్రెస్, బారెల్లీ-న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, షాన్-ఇ-పంజాబ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-అమృత్సర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్., జమ్మూ మెయిల్., షాలిమార్ ఎక్స్‌ప్రెస్., స్వర్ణ దేవాలయం మెయిల్., సంగం ఎక్స్‌ప్రెస్., నౌచాందీ ఎక్స్‌ప్రెస్., రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. iloveindia.com. "Northern Indian Railway".
  2. Asiatradehub.com.com. "India – Infrastructure Railways". Archived from the original on 2008-10-16. Retrieved 2015-03-01.

RRC Northern Railway Group D Admit Card 2014

బయటి లింకులు

మూసలు , వర్గాలు