ఎన్.ఎస్.రాజారామ్
నవరత్న శ్రీనివాస రాజారామ్ (1943 సెప్టెంబరు 22 - 2019 డిసెంబరు 11) ఒక విద్యావేత్త, గణిత వేత్త.[1] వాయిస్ ఆఫ్ ఇండియా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ప్రచురణలకు అతను ప్రసిద్ది చెందాడు. " స్వదేశీ ఆర్యుల " పరికల్పనను అతను ముందుకు తీసుకువచ్చాడు. శాస్త్రీయ దృక్కోణం పరంగా వేద కాలం చాలా అభివృద్ధి చెందిందని అతను నొక్కిచెప్పాడు. సింధు లిపిని తాను అర్థంచేసుకున్నానని రాజారాం పేర్కొన్నాడు. అయితే కొందరు పండితులు దాన్ని తిరస్కరించారు. [2]
వ్యక్తిగత జీవితం
మార్చురాజారాం 1943 సెప్టెంబరు 22 న మైసూరు లోని దేశస్థ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తాత నవరత్న రామారావు ఒక వలస పాలనకు చెందిన పండితుడు. ప్రాంతీయంగా కీర్తి గడించిన స్థానిక భాషా రచయిత. [3]
రాజారాం ఇండియానా విశ్వవిద్యాలయం నుండి గణితంలో పిహెచ్.డి. డిగ్రీ పొందాడు. కెంట్ స్టేట్ యూనివర్శిటీ, లాక్హీడ్ కార్పొరేషన్లలో పనిచేసాడు. అనేక అమెరికా విశ్వవిద్యాలయాల్లో 20 సంవత్సరాల పాటు బోధించాడు. [4] అతను భారతదేశంలో ఇంజనీర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.
అతను 2019 డిసెంబరు 11 న మరణించాడు. [5]
ఇండాలజీ
మార్చుపురాతన భారతీయ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రానికి సంబంధించిన అంశాలపై రాజారాం విస్తృతంగా రచనలు చేసాడు. ఇండాలజీ, సంస్కృత పాండిత్యానికి సంబంధించిన విషయాల్లోఐరోపా దృష్టికోణ పక్షపాతం ఉందని ఆరోపించాడు. "స్వదేశీ ఆర్యన్లు" సిద్ధాంతం తరపున వాదించాడు. [6]
19 వ శతాబ్దపు ఐరోపా పక్షపాత "ఇండాలజిస్టులు / మిషనరీలు" వారి అనేక నిర్ణయాలకు వచ్చిన పద్ధతిని ఆయన విమర్శించాడు. చరిత్ర గురించి చర్చించేందుకు భాషా శాస్త్రాన్ని సాధనంగా వాడూకోవడాన్ని విమర్శించాడు. [7] 19 వ శతాబ్దపు యూరోపియన్ మతప్రచారక "ఇండోలాజిస్టులు/ ప్రచారకుల"లో చాలామంది, సంస్కృతంతో సహా భారతీయ భాషల్లో "క్రియాత్మకంగా నిరక్షరాస్యులు" అని పేర్కొంటూ అలాంటి వారు భారతీయ చరిత్రపై పరికల్పనలను అధ్యయనం చేయడం, అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమని రాజారామ్ ప్రశ్నించాడు. రాజారాం ఇలా అన్నాడు:
- "పురాతన భారతీయ చరిత్రను ఒక సమగ్రమైన పునర్విమర్శ చెయ్యాల్సిన సమయం వచ్చింది [...] ప్రశ్నార్థకమైన భాషా సిద్ధాంతాలతో అల్లిన సాలెగూడులను తొలగించడంతో ఈ పని మొదలుపెట్టవచ్చు, [...] పురావస్తు శాస్త్రం నుండి కంప్యూటర్ సైన్స్ వరకు అందుబాటులో ఉన్న ప్రతి ఆధునిక సాధనాన్నీ ఇందుకు ఉపయోగించుకోవాలి." [8]
అతను స్వదేశీ ఆర్య పరికల్పనను సమర్థించాడు. ఇండో-ఆర్య వలస సిద్ధాంతాన్ని క్రైస్తవ మతప్రచాకరులు వలసవాద ప్రయోజనాల కోసం కల్పించిన చరిత్ర అని, ఆ తరువాత వామపక్ష-ఉదారవాదులు, మార్క్సిస్టులు దాన్ని సమర్ధించారనీ చెబుతూ అతడు దాన్ని తిరస్కరించాడు. [9] [10] వేదాలు సామాన్యశక పూర్వం 7000 నాటివి అని చెబుతూ, హరప్పా నాగరికత వేద యుగపు చివరి దశ కాలానికి చెందినదని, అందువల్ల ఇది వేద యుగంలో ఒక భాగమనీ అతడు ఊహించాడు.
"వేద భారతీయులు" ఈజిప్టులోని ఫారోలకు పిరమిడ్లను నిర్మించడం నేర్పించారని ఇండియన్ ఆర్కియాలజికల్ సొసైటీ వారి పత్రిక పురాతత్వ లో పేర్కొన్నాడు. [11] లౌకికవాదం అనే భావన బహుళత్వ రాజ్య భావనలో అసంబద్ధం అని ఆయన నొక్కిచెబుతూ, ప్రాచీన హిందూ భారతదేశం లౌకిక రాజ్యం అని పేర్కొన్నాడు. [12]
తాను సింధు లిపిని అర్థంచేసుకున్నానని, దానిని చివరి వేద సంస్కృతంతో సమానమనీ చెప్పాడు; అయితే ఆ తరువాత ఈ రెండూ తిరస్కరణకు గురయ్యాయి. [13]
విమర్శ
మార్చుభౌతిక శాస్త్రవేత్త, సంశయవాది అలన్ సోకల్, రాజారామ్ రచనలను సూడోసైన్స్ [14] గా వర్ణించాడు. ఇతర సమీక్షకులు "చెత్త" అని, "ముతక" అనీ "అర్ధంలేని" ప్రచారం అనీ విమర్శించారు . [15] సుదేష్ణా గుహా అతన్ని సెక్టారియన్ అపండితుడని పేర్కొంది. [16]
రాజారామ్ రచించిన పాలిటిక్స్ ఆఫ్ హిస్టరీని ఒక వివాదాస్పద రచనగా సింథియా ఆన్ హ్యూమ్స్ విమర్శించింది [17] సూరజ్ భన్ దీనిని చారిత్రక రివిజనిజానికి నిదర్శనమని చెప్పాడు. [18] మైఖేల్ విట్జెల్ అతన్ని ఒక స్థానిక రచయితగా వర్ణించాడు. అతని పుస్తకాలు చరిత్రను పౌరాణికతతో తిరగరాసినవి, 21 వ శతాబ్దపు ప్రవాస భారతీయుల కోసం రాసినవి అని విమర్శించాడు. ఈ ప్రవాసులు "తాము కోల్పోయిన ఊహాత్మకమైన, అద్భుతాలతో కూడుకున్న, సుదూర గతాన్ని" తిరిగి పొందాలని కోరుకుంటారు అని విమర్శించాడు.
ఇవి కూడా చూడండి
మార్చు- స్వదేశీ ఆర్యులు
- ఇండో-ఆర్యన్ వలస
మూలాలు
మార్చు- ↑ Koertge, Noretta (2005). Scientific Values and Civic Virtues (in ఇంగ్లీష్). Oxford University Press. p. 229. ISBN 978-0-19-803846-7. Retrieved 11 December 2019.
- ↑ Chadha, Ashish (April 2010). "Cryptographic imagination: Indus script and the project of scientific decipherment". The Indian Economic & Social History Review. 47 (2): 141–177. doi:10.1177/001946461004700201. ISSN 0019-4646.
- ↑ Rajaram 2019, p. 300.
- ↑ Kurien, Prema A. (2007). A place at the multicultural table the development of an American Hinduism. Rutgers University Press. pp. 255. ISBN 9780813540559. OCLC 703221465.
- ↑ "Former NASA Scientist N.S. Rajaram of 'Navarathna' family passes away". Star of Mysore. 12 December 2019. Retrieved 20 September 2020.
- ↑ Chadha, Ashish (February 2011). "Conjuring a river, imagining civilisation: Saraswati, archaeology and science in India". Contributions to Indian Sociology (in ఇంగ్లీష్). 45 (1): 55–83. doi:10.1177/006996671004500103. ISSN 0069-9667.
- ↑ Bryant, Edwin (March 2004). The Quest for the Origins of Vedic Culture : The Indo-Aryan Migration Debate. Oxford University Press. pp. 347, 82. ISBN 9780195169478. OCLC 697790495.
- ↑ Rajaram 1995, page 230, (cited in Bryant 2001 page 74
- ↑ Bryant, Edwin (March 2004). The Quest for the Origins of Vedic Culture : The Indo-Aryan Migration Debate. Oxford University Press. p. 281. ISBN 9780195169478. OCLC 697790495.
- ↑ Bryant, Edwin (March 2004). The Quest for the Origins of Vedic Culture : The Indo-Aryan Migration Debate. Oxford University Press. pp. 287, 280. ISBN 9780195169478. OCLC 697790495.
- ↑ "The Rewriting Of History..." Outlook (India).
- ↑ Nanda, Meera (2004). Prophets Facing Backward : Postmodern Critiques of Science and Hindu Nationalism in India. Rutgers University Press. pp. 53, 54, 103. ISBN 9780813536347. OCLC 1059017715.
- ↑ Kurien, Prema A. (2007). A place at the multicultural table the development of an American Hinduism. Rutgers University Press. pp. 168. ISBN 9780813540559. OCLC 703221465.
- ↑ Rajaram's claim that Many of the questions arising in Quantum Physics today had been anticipated by Swami Vivekananda heads the chapter on Hindu nationalism in Alan Sokal's 2004 essay on Pseudoscience and Postmodernism
- ↑ A. Parpola, Of Rajaram's 'Horses', 'decipherment' and civilisational issues, Frontline, November 2000 .
- ↑ Guha, Sudeshna (2005). "Negotiating Evidence: History, Archaeology and the Indus Civilisation". Modern Asian Studies. 39 (2): 399–426. doi:10.1017/S0026749X04001611. ISSN 0026-749X. JSTOR 3876625.
- ↑ Humes, Cynthia Ann (2012). "Hindutva, Mythistory, and Pseudoarchaeology". Numen. 59 (2/3): 178–201. doi:10.1163/156852712X630770. ISSN 0029-5973. JSTOR 23244958.
- ↑ Bhan, Suraj (1997). "Recent Trends in Indian Archaeology". Social Scientist. 25 (1/2): 3–15. doi:10.2307/3517757. ISSN 0970-0293. JSTOR 3517757.