ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి
ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి (1941, అక్టోబరు 20 - 2011, డిసెంబరు 19 ) ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు.
ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి | |
---|---|
8వ లోక్ సభ [[చిత్తూరు (ఎస్సీ) ( లోక్‌సభ నియోజకవర్గం)] సభ్యురాలు, చిత్తూరు]] | |
అంతకు ముందు వారు | పి.రాజగోపాల్ నాయుడు |
తరువాత వారు | ఎం.జ్ఞానేంద్ర రెడ్డి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1941 అక్టోబరు 20
మరణం | 2011 డిసెంబరు 19 హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | (వయసు 70)
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవితం తొలి దశలో
మార్చుఝాన్సీ లక్ష్మి 1941 అక్టోబరు 20న విశాఖపట్నంలో సి.కె.చౌదరి కుటుంబంలో జన్మించింది. ఆమె మెట్రిక్యులేషన్ వరకు విద్యాభ్యాసం చేసింది.[1]
కెరీర్
మార్చుకొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా, ఝాన్సీ లక్ష్మి 1983 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.పి.వెంకటేశ్వర చౌదరిని 16,434 ఓట్ల తేడాతో ఓడించింది.[2]
ఆ మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నుంచి 8వ లోక్ సభకు పోటీ చేసి 3,32,543 ఓట్లు సాధించారు. మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల ప్రాంతీయ ఆర్గనైజర్ గా, కస్తూర్బా శతజయంతి కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. లక్ష్మి తన పదవీకాలాన్ని పూర్తి చేయకుండా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.[3][4]
వ్యక్తిగత జీవితం
మార్చుఝాన్సీ లక్ష్మి 1956 డిసెంబరు 9 న ఎన్.పి.వీరరాఘవులు నాయుడును వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమె 2011 డిసెంబరు 19 న హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. పది రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆమెను అక్కడ చేర్పించారు.[5]
మూలాలు
మార్చు- ↑ "Members Bioprofile: Jhansi Lakshmi, Smt. N. P." Lok Sabha. Retrieved 27 November 2017.
- ↑ "Statistical Report on General Election, 1983 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). Election Commission of India. p. 159. Retrieved 27 November 2017.
- ↑ "Statistical Report on the General Elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 25. Retrieved 27 November 2017.
- ↑ Jai, Janak Raj (2003). Presidents of India, 1950-2003. Regency Publications. p. 210. ISBN 978-81-87498-65-0.
- ↑ "Former MLA Dies". The Hindu. 21 December 2011. Retrieved 27 November 2017.