లోక్‌సభ సభ్యుల కాలానుగుణ జాబితాలు

భారత లోక్‌సభ సభ్యుల జాబితాలు
(లోక్‌సభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)

లోక్‌సభ భారత పార్లమెంటు లోని దిగువ సభ. భారతదేశ ఓటర్లనుండి దీని సభ్యులను ఎన్నుకోవటానిక ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీనికి ఎన్నికైన సభ్యులను లోక్‌సభ సభ్యులు అని పిలుస్తారు. ఈ కథనంలో 1952 నుండి లోక్‌సభ సభ్యుల జాబితాలు , లోక్‌సభ ఉనికిలో ఉన్న కాలపరిమితి నిడివి వివరాలు తెలుపుతాయి.[1][2][3][4]

న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ హాలు దృశ్య చిత్రం

భారతదేశంలో పార్లమెంటు అత్యున్నత శాసనమండలి. భారత పార్లమెంటులో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి. మొదటిది రాజ్యసభ (రాష్ట్రాల మండలి), రెండవది లోక్‌సభ (ప్రజల సభ). పార్లమెంటు సభను పిలిపించి, వాయిదా వేయడానికి లేదా లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. భారత రాజ్యాంగం 1950న జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి.[5]

మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్‌సభ ఉనికిలోకి వచ్చింది. అప్పటినుండి 2024 ఏప్రిల్ 19 నుండి 2024 జూన్ 1 వరకు ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు వరకు 18 లోక్‌సభలు ఏర్పడ్డాయి. వాటి వివరాలు క్రింద వివరించబడ్డాయి.[6]

జాబితా

మార్చు
లోక్‌సభ సంఖ్య నియోజకవర్గాల సంఖ్య సభ్యల జాబితాల వివరం ప్రారంభం ముగింపు లోక్‌సభ ఉనికిలో ఉన్న కాలం నిడివి మూలం
1వ లోక్‌సభ 488 1వ లోక్‌సభ సభ్యుల జాబితా 1952 మే 15 1956 ఫిబ్రవరి 27 4 సంవత్సరాలు, 352 రోజులు [7][8]
2వ లోక్‌సభ 494 2వ లోక్‌సభ సభ్యుల జాబితా 1956 ఫిబ్రవరి 27 1962 ఏప్రిల్ 16 4 సంవత్సరాలు, 360 రోజులు [9][10][11]
3వ లోక్‌సభ 494 3వ లోక్‌సభ సభ్యుల జాబితా 1962 ఏప్రిల్ 17 1967 మార్చి 16 4 సంవత్సరాలు, 335 రోజులు [12]
4వ లోక్‌సభ 520 4వ లోక్‌సభ సభ్యుల జాబితా 1967 మార్చి 17 1969 మార్చి 17 3 సంవత్సరాలు, 298 రోజులు [13]
5వ లోక్‌సభ 518 5వ లోక్‌సభ సభ్యుల జాబితా 1971 మార్చి 15 1977 జనవరి 15 5 సంవత్సరాలు, 306 రోజులు
6వ లోక్‌సభ 542 6వ లోక్‌సభ సభ్యుల జాబితా 1977 మార్చి 25 1979 ఆగస్టు 22 2 సంవత్సరాలు, 150 రోజులు
7వ లోక్‌సభ 542 7వ లోక్‌సభ సభ్యుల జాబితా 1980 జనవరి 18 1984 డిసెంబరు 31 4 సంవత్సరాలు, 348 రోజులు
8వ లోక్‌సభ 541 8వ లోక్‌సభ సభ్యుల జాబితా 1984 డిసెంబరు 31 1989 నవంబరు 27 4 సంవత్సరాలు, 331 రోజులు
9వ లోక్‌సభ 529 9వ లోక్‌సభ సభ్యుల జాబితా 1989 డిసెంబరు 02 1991 మార్చి 13 1 సంవత్సరం, 101 రోజులు [14]
10వ లోక్‌సభ 534 10వ లోక్‌సభ సభ్యుల జాబితా 1991 జూన్ 20 1996 మే 10 4 సంవత్సరాలు, 325 రోజులు
11వ లోక్‌సభ 543 11వ లోక్‌సభ సభ్యుల జాబితా 1996 ఏప్రిల్ 27 1997 మే 07 1 సంవత్సరం, 10 రోజులు
12వ లోక్‌సభ 543 12వ లోక్‌సభ సభ్యుల జాబితా 1998 మార్చి 23 1999 ఏప్రిల్ 26 1 సంవత్సరం, 34 రోజులు
13వ లోక్‌సభ 543 13వ లోక్‌సభ సభ్యుల జాబితా 1999 అక్టోబరు 20 2004 ఫిబ్రవరి 06 4 సంవత్సరాలు, 109 రోజులు
14వ లోక్‌సభ 543 14వ లోక్‌సభ సభ్యుల జాబితా 2004 జూన్ 02 2009 మే 18 4 సంవత్సరాలు, 350 రోజులు
15వ లోక్‌సభ 543 15వ లోక్‌సభ సభ్యుల జాబితా 2009 మే 13 2014 మే 18 5 సంవత్సరాలు, 5 రోజులు [4]
16వ లోక్‌సభ 543 16వ లోక్‌సభ సభ్యుల జాబితా 2014 ఏప్రిల్ 07 2019 మే 12 5 సంవత్సరాలు, 35 రోజులు [2]
17వ లోక్‌సభ 543 17వ లోక్‌సభ సభ్యుల జాబితా 2019 ఏప్రిల్ 11 2024 మే 19 5 సంవత్సరాలు, 38 రోజులు
18వ లోక్‌సభ 543 18వ లోక్‌సభ సభ్యుల జాబితా 2024 జూన్ 24 ఉనికిలో ఉంది [15]

మూలాలు

మార్చు
  1. "https://www.eci.gov.in/term-of-the-houses". www.eci.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2025-02-21. {{cite web}}: External link in |title= (help)
  2. 2.0 2.1 "Cabinet approves dissolution of the Sixteenth Lok Sabha". pib.gov.in. Retrieved 2025-02-21.
  3. "Cabinet approves dissolution of the Sixteenth Lok Sabha". web.archive.org. 2025-02-21. Archived from the original on 2025-02-21. Retrieved 2025-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 "History of Lok Sabha elections". www.smetimes.in. Retrieved 2025-02-21.
  5. "Indian Parliament| National Portal of India". web.archive.org. 2024-08-10. Archived from the original on 2024-08-10. Retrieved 2024-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "18 Lok Sabha Elections: How India voted since Independence (1952-2024)". web.archive.org. 2025-02-28. Archived from the original on 2025-02-28. Retrieved 2025-02-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Lok Sabha Elections since Independence (1952-2024): Relive all the previous 17 Lok Sabha elections and how India voted: A retrospective". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2025-02-23.
  8. "BIOGRAPHICAL SKETCH OF FIRST LOK SABHA". web.archive.org. 2014-01-03. Archived from the original on 2014-01-03. Retrieved 2024-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Lok Sabha Elections since Independence (1952-2024): Relive all the previous 17 Lok Sabha elections and how India voted: A retrospective". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2025-02-23.
  10. https://web.archive.org/web/20120320181548/http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1957/Vol_I_57_LS.pdf
  11. https://web.archive.org/web/20110703132924/http://164.100.47.132/LssNew/Members/Alphabaticallist.aspx
  12. "Lok Sabha Elections since Independence (1952-2024): Relive all the previous 17 Lok Sabha elections and how India voted: A retrospective". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2025-02-23.
  13. "Lok Sabha Elections since Independence (1952-2024): Relive all the previous 17 Lok Sabha elections and how India voted: A retrospective". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2025-02-23.
  14. www.thehindu.com https://www.thehindu.com/infographics/2024-04-17/previous-lok-sabha-elections-since-independence/assets-v7/files/lok9.html. Retrieved 2025-02-21. {{cite web}}: Missing or empty |title= (help)
  15. "18 Lok Sabha Elections: How India voted since Independence (1952-2024)". web.archive.org. 2025-02-21. Archived from the original on 2025-02-21. Retrieved 2025-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు