ఎబాదత్ హుస్సేన్
ఎబాదత్ హుస్సేన్ చౌధురి ( జననం 1994 జనవరి 7), బంగ్లాదేశ్ క్రికెటరు. అతను 2019 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[3] అతని వేగం, నైపుణ్యాల కారణంగా అతనికి 'సిల్హెట్ రాకెట్' అనే పేరు వచ్చింది.[4] అతను బంగ్లాదేశ్ వైమానిక దళంలో సైనికుడు కూడా.[5]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎబాదత్ హుస్సేన్ చౌధురి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బార్లేఖా, బంగ్లాదేశ్ | 1994 జనవరి 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Sylhet Rocket[1]t | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (180 cమీ.)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | Right handed | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 95) | 2019 ఫిబ్రవరి 28 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూన్ 14 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 139) | 2022 ఆగస్టు 10 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 23 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 58 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 77) | 2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 6 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 58 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 11 March 2023 |
జీవితం తొలి దశలో
మార్చుఎబాదత్ హుస్సేన్ చౌధురి 1994 జనవరి 7న మౌల్విబజార్ జిల్లాలోని బార్లేఖాలోని కథల్తాలి గ్రామంలో చౌదరీలకు చెందిన సిల్హెటి ముస్లిం కుటుంబంలో జన్మించారు. [6] నిజాముద్దీన్ చౌదరి, సమియా బేగంల ఆరుగురు పిల్లలలో అతను రెండవవాడు. [7]
2012లో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో వాలీబాల్ ప్లేయర్‌గా ఎబాదత్ హుస్సేన్ చేరాడు. [8] 2016లో, అతను ఆకిబ్ జావేద్ పర్యవేక్షణలో BCB నిర్వహించిన పేసర్ హంట్ పోటీకి హాజరయ్యాడు. BCB హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ కోసం ఎబాదత్‌ను ఆకిబ్ ఎంచుకున్నాడు. దాంతో, ఎబాదత్ వాలీబాల్ ఆటగాడి నుండి క్రికెటరుగా మారాడు.[9]
దేశీయ కెరీర్
మార్చు2016 సెప్టెంబరు 25న 2016–17 నేషనల్ క్రికెట్ లీగ్‌లో సిల్హెట్ డివిజన్‌కు ఎబాదత్ ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [10] 2017 మే 8న 2016–17 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ తరఫున తన తొలి లిస్టు Aమ్యాచ్ ఆడాడు.[11] 2017–18 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2017 నవంబరు 6న రంగ్‌పూర్ రైడర్స్ తరపున ట్వంటీ20 ల్లోకి అడుగుపెట్టాడు.[12] ఎబాదత్ 2017–18 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో సెంట్రల్ జోన్ తరపున ఆరు మ్యాచ్‌లలో పదమూడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[13]
2018 అక్టోబరులో ఎబాదత్, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ జట్టులో చేరాడు. [14] మరుసటి నెలలో, 2018–19 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో నార్త్ జోన్ తరపున బౌలింగ్ చేస్తూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను తన తొలి పది వికెట్ల పంట సాధించాడు. [15] 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో చేర్చిన 35 మంది క్రికెటర్లలో అతనొకడు. [16]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2016 నవంబరులో, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందేందుకు 22 మంది ఆటగాళ్ళ సన్నాహక బృందంలో ఎబాదత్ ఎంపికయ్యాడు. [17]
2019 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ టెస్టు జట్టులోకి ఎబాదత్‌ను తీసుకున్నారు. [18] అతను 2019 ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ తరపున టెస్టు రంగప్రవేశం చేసాడు. అతని మొదటి టెస్టు వికెట్ నీల్ వాగ్నర్. [19]
2022 జనవరిలో, సిరీస్‌లోని మొదటి టెస్టులో బే ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో అతను తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. [20] అతని 6/46, బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌పై మొదటి విజయం సాధించడంలోను, న్యూజిలాండ్‌పై వారి మొదటి టెస్టు విజయాన్ని సాధించడంలోనూ సహాయపడింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ఎబాదత్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. [21] [22]
2022 ఫిబ్రవరిలో, అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [23] 2022 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [24] 2022 మేలో, ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం అతన్ని జట్టు లోకి తీసుకున్నారు. [25] 2022 ఆగష్టులో, జింబాబ్వే పర్యటన కోసం వన్‌డే జట్టులో ఎంపికయ్యాడు. [26] 2022 ఆగస్టు 10న జింబాబ్వేపై తన తొలి వన్‌డే ఆడాడు.[27] అదే నెలలో, 2022 ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ T20I జట్టులో ఎంపికయ్యాడు. [28] 2022 సెప్టెంబరు 1న శ్రీలంకపై తన తొలి T20I ఆడాడు. [29]
మూలాలు
మార్చు- ↑ [https://www.tbsnews.net/sports/sylhet-rocket-ebadot-gets-new-nickname-allan-donald-603830 'The Sylhet Rocket' - Ebadot gets new nickname from Allan Donald on TBSnews
- ↑ Ebadot Hossain’s profile on Sportskeeda
- ↑ "Ebadot Hossain". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
- ↑ "'Sylhet Rocket' Ebadot impresses Donald with his white-ball start". Daily-Sun (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-03-23.
- ↑ "Ebadat Hossain: The future fast bowler of Bangladesh". kalerkantho. Retrieved 29 October 2020.
- ↑ "বিমানবাহিনী থেকে ক্রিকেটের রঙিন মঞ্চে এবাদত". Roar Media (in Bengali). 11 February 2019.
- ↑ "এবাদতের গ্রামের বাড়িতে বইছে আনন্দের বন্যা". Samakal (in Bengali). Archived from the original on 7 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ "From volleyball to cricket: the journey of Ebadot Hossain". ESPN CricInfo. Retrieved 5 August 2016.
- ↑ "Ebadot's 'long story' from volleyball to Bangladesh cricket hero". France 24 (in ఇంగ్లీష్). 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ "National Cricket League, Tier 2: Rajshahi Division v Sylhet Division at Rajshahi, Sep 25-28, 2016". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
- ↑ "Dhaka Premier Division Cricket League, Abahani Limited v Mohammedan Sporting Club at Savar (4), May 8, 2017". ESPN Cricinfo. Retrieved 8 May 2017.
- ↑ "41st match, Bangladesh Premier League at Dhaka, Dec 6 2017". ESPN Cricinfo. Retrieved 6 November 2017.
- ↑ "Bangladesh Cricket League 2017/18, Central Zone: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 27 April 2018.
- ↑ "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
- ↑ "Pacers exploit green top; South recover slowly". The Daily Star (Bangladesh). Retrieved 30 November 2018.
- ↑ "Mohammad Naim, Yeasin Arafat, Saif Hassan - A look into Bangladesh's future". ESPN Cricinfo. Retrieved 17 August 2019.
- ↑ "Bangladesh include Mustafizur in preparatory squad". ESPN Cricinfo. Retrieved 4 November 2016.
- ↑ "Shafiul, Ebadot replace injured Taskin in ODI, Test squads". ESPN Cricinfo. Retrieved 5 February 2019.
- ↑ "1st Test, Bangladesh tour of New Zealand at Hamilton, Feb 28 - Mar 4 2019". ESPN Cricinfo. Retrieved 27 February 2019.
- ↑ "Ebadot takes six as Bangladesh clinch historic first Test win over New Zealand". Hindustan Times. Retrieved 5 January 2022.
- ↑ "Ebadot Hossain headlines Bangladesh's historic Test win". CricBuzz. Retrieved 5 January 2022.
- ↑ "Black Caps humbled in heavy first test defeat by Bangladesh at Bay Oval". Stuff. Retrieved 5 January 2021.
- ↑ "Ebadot gets ODI call-up as Bangladesh name four uncapped players for Afghanistan series". ESPN Cricinfo. Retrieved 14 February 2022.
- ↑ "Shakib Al Hasan, Tamim Iqbal back in Bangladesh Test squad". ESPN Cricinfo. Retrieved 3 March 2022.
- ↑ "Anamul Haque recalled for WI white-ball series; Mustafizur Rahman back in Test squad". ESPN Cricinfo. Retrieved 22 May 2022.
- ↑ "Mahmudullah 'rested' for Zimbabwe T20Is as Sohan named captain". TBS News. Retrieved 22 July 2022.
- ↑ "3rd ODI, Harare, August 10, 2022, Bangladesh tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 10 August 2022.
- ↑ "Shakib Al Hasan named Bangladesh captain for Asia Cup and T20 World Cup". ESPN Cricinfo. Retrieved 13 August 2022.
- ↑ "5th Match, Group B (N), Dubai (DSC), September 01, 2022, Asia Cup". ESPN Cricinfo. Retrieved 1 September 2022.