ఎమ్మిగనూరు పురపాలక సంఘం
ఎమ్మిగనూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని, ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
ఎమ్మిగనూరు | |
స్థాపన | 1965 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుఎమ్మిగనూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 400 కి.మీ దూరంలో ఉంది.1965 లో ఈ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 95,149 జనాభా ఉండగా అందులో పురుషులు 47,456, మహిళలు 47,693 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 73.05%, ఉండగా స్త్రీ జనాభాలో 53.06% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8224 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 19619 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా యస్. సరస్వతి, [2] వైస్ చైర్మన్‌గా వై.పి.యం.కె చౌదరి పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
- షిర్డీ సాయి దేవాలయం
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఎమ్మిగనూరుకు 22 కి.మీ.దూరంలో ఉంది.
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 14.50 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.18 రెవెన్యూ వార్డులు,33 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో 45 మురికివాడలు ఉన్నాయి.1 ప్రభుత్వ ఆసుపత్రి,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Yemmiganur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.