ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 518360. ఎమ్మిగనూరు మంత్రాలయము నుండి 22 కిమీ దూరములో ఉంది. ఎమ్మిగనూరు కర్నాటక సరిహద్దులో ఉంటుంది.
ఎమ్మిగనూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°44′00″N 77°29′00″E / 15.7333°N 77.4833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | ఎమ్మిగనూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518323 |
ఎస్.టి.డి కోడ్ |
మండల గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,69,344 - పురుషులు 84,390 - స్త్రీలు 84,954
- అక్షరాస్యత (2011) - మొత్తం 46.00% - పురుషులు 58.98% - స్త్రీలు 32.98%
పరిచయంసవరించు
ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలను అప్పట్లో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. మాచాని సోమప్ప ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.
ఊరి పేరు వెనుక కథసవరించు
ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష కన్నడ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము (గేదె) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
రవాణాసవరించు
ఎమ్మిగనూరు నుండి కర్నూలు,హైదరాబాదు,విజయవాడ,ఒంగోలు తిరుపతి,కాకినాడ,బెంగళూర్, చెన్నై,నగరాలకు బస్సు సౌకర్యం కలదు.ఈ పట్టణానికి 30 కి.మీ. దూరంలో ఆదోని రైల్వే స్టేషన్ కలదు.
దర్శనీయ స్థలాలుసవరించు
1.నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 2.షిర్డీ సాయి దేవాలయం 3.ఎమ్మిగనూరుకు 22 కి.మీ.దూరంలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కలదు.
సినిమాసవరించు
1.శివ సినీ కాంప్లెక్స్ 2.శ్రీనివాస సినీ కాంప్లెక్స్ 3.రాఘవేంద్ర 4.అబ్బాస్ 5.లక్ష్మణ్
విద్యా సంస్థలుసవరించు
పారిశ్రామిక శిక్షణా సంస్థలు శ్రీ నీలకంఠేశ్వర ఐ.టి.ఐ.
- పాఠశాలలు
- శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్
- శ్రీ రామ విద్యానికేతన్
- ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
- శ్రీ నీలకంఠేశ్వర ఉన్నత పాఠశాల
- బాలికల ఉన్నత పాఠశాల
- శ్రీ సరస్వతి విద్యా నికేతన్
- మాచని సోమప్ప ఇంగ్లీష్ మీడియం ఉన్నత స్క్ల్
- నారాయణ గృఫ్ అఫ్ స్కుల్స్
- శారద కమిటీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల
- నలంద ఉన్నత పాఠశాల
- శ్రీ వేణు విద్యా నిలయం.
- ఆదర్శ విద్యాపీఠం
- రవింద్ర భరతి స్కల్
- వివేకవర్ధిని ఇంగ్లీష్ & తెలుగు మీడియం స్కూలు
- కస్తూరి కాన్సెప్ట్ స్కూలు
కళాశాలలు
- దీక్ష జూనియర్ కాలేజీ
- ప్రభుత్వ జూనియర్ కాలేజి
- నలంద జూనియర్ కాలేజి
- సంజీవి జూనియర్ కాలేజి
- వైష్ణవి కాలేజి
- శ్రీ మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజి.హన్మపురం
- సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి
- ఉషోదయా కాలేజి
- మదర్ తెరిసా కాలేజి
- నలందా కాలేజి ఆఫ్ ఎదుకేషన్
- నలంద టేచర్ ట్రైనింగ్ ఇనిష్టిట్యూట్
- మదర్ థెరిస్సా టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
- వెన్నెల ఎడ్యుకేషన్ కన్సుల్టేన్సీ,