ఎమ్. చంద్రసేనగౌడ్
ఎమ్. చంద్రసేనగౌడ్ రంగస్థల నటి.
ఎమ్. చంద్రసేనగౌడ్ | |
---|---|
జననం | వెంపులూరి చంద్రసేనగౌడ్ అక్టోబరు 10, 1947 ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
తండ్రి | వెంపులూరి రామయ్య |
తల్లి | సుబ్బమ్మ |
జననం
మార్చుచంద్రసేనగౌడ్ 1947, అక్టోబరు 10వ తేదిన సుబ్బమ్మ, వెంపులూరి రామయ్య దంపతులకు జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
మార్చుఈవిడ రంగస్థల నటిగా దాదాపు 50 సంవత్సరాల అనుభవం గడించింది. పలు పద్య నాటకాల్లోనూ, సాంఘిక నాటకాల్లోనూ నటించింది. హర్మోనిస్టు కొణికి రామారావు, దర్శకుడు డి.సి. సత్యమూర్తి, జమీన్ రైతు సంపాదకుడు గిద్దలూరు గోపాలరావు ఈ ముగ్గురు చంద్రసేనకు రంగస్థల గురువులు. వున్నం బసవయ్యగారి నేతృత్వంలో 1983 నుండి ప్రజా నాట్యమండలి ప్రదర్శనలో పాల్గొంటున్నది.
నటించినవి: మోహినీ భస్మాసుర (లక్ష్మీదేవి), మహాకవి కాళిదాసు (విద్యాధరి), వేంకటేశ్వర మహాత్మ్వం (పద్యావతి, వకుళ), పాదుకా పట్టాభిషేకం (కైక), సారంగధర (రత్నాంగి), మాయాబజార్ (సుభద్ర), సామ్రాట్ అశోక్ (శాంతి) వంటి పద్యనాటకాలలో, పంచమవేదం, ఆత్మవత్ సర్వభూతాని, గిజిగాడికూడు, కాలధర్మం, అవేకళ్ళు, సందిగ్ధ సమరం వంటి సాంఘిక నాటకాల్లో నటించింది.
టివి, సినిమారంగం
మార్చుదూరదర్శన్ ద్వారా ప్రసారమైన మరణశాశనం, జీవితాశయం, ఖడ్గతిక్కన, స్త్రీ, క్రాంతి పథం, దాంపత్యం, మానుకో మనసారా మొదలైన నాటికలలో, అయ్యప్పకరుణ, ఎదురింటి రాధ, తులసి తీర్థం వంటి చిత్రాలలో నటించారు.
అవార్డులు, బిరుదులు
మార్చు- పాదుకాపట్టాభిషేకంలో ‘కైక’ పాత్రకు సినీ నిర్మాత, కవి ఎమ్.ఎస్.రెడ్డి, రంగస్థల నటుడు, ‘హంస అవార్డు గ్రహీత’ పొన్నాల రామసుబ్బారెడ్డి మొదలైనవారి చేతుల మీదుగా నాలుగు సార్లు సన్మానం అందుకున్నది.
- 1993లో అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన వేడుకల సందర్భంగా ‘కళాభినేత్రి’ బిరుదుతో ఘన సత్కారం అందుకున్నది.
మూలాలు
మార్చుఎం. ఇంద్రసేనగౌడ్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 38.