ఎయిర్ఆసియా ఇండియా

(ఎయిర్ఆసియ ఇండియా నుండి దారిమార్పు చెందింది)

ఏయిర్ ఆసియా ఇండియా[2] అనే సంస్థ ఇండో-మలేషియన్ కు చెందిన అతి తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను తీసుకెళ్లే విమానాయాన సంస్థ.[3] ఫిబ్రవరి 19, 2013లో ఏయిర్ ఆసియాతో కలిసి మరికొన్ని వ్యాపార సంస్థలు చేసుకున్న సంయుక్త ఒప్పందం ప్రకారం బెరహాడ్ సంస్థకు 49 శాతం వాటా, టాటా సన్స్ కు 30 శాతం వాటా, టెలెస్టా ట్రేడ్ ప్యాలేస్ మిగతా 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి.[4][5] ఏయిర్ ఆసియా ఇండియా కార్యకలాపాలు జూన్ 12, 2014 నుంచి ప్రారంభమయ్యాయి.[6]

AirAsia India
IATA
I5
ICAO
IAD
Callsign
ARIYA
స్థాపితము2013 మార్చి 28 (2013-03-28)
కార్యకలాపాల ప్రారంభం2014 జూన్ 12 (2014-06-12)
Operating bases
  • Kempegowda International Airport (Bangalore)
Fleet size2
గమ్యస్థానములు6
సంస్థ నినాదముNow Everyone Can Fly
మాతృసంస్థ
  • AirAsia Berhad (49%)
  • Tata Group (30%)
  • Telestra Tradeplace (21%)
ప్రధాన కార్యాలయముBangalore, India.[1]
కీలక వ్యక్తులు
  • S. Ramadorai (Chairman)
  • Mittu Chandilya (CEO)
  • Tony Fernandes (Founder, Air Asia)
వెబ్‌సైటుwww.airasia.com

భారత దేశంలో రాయితీతో విమాన సేవలు అందిస్తోన్న తొలి విదేశీ సంస్థ ఏయిర్ ఆసియా ఇండియా.[7] సగటున ఒక్కో విమానంలో 52 శాతం ప్రయాణీకుల సామర్థ్యంతో ఈ సంస్థ నడుస్తోంది. రాబోయే మూడేళ్లలో 100 శాతం తన ఇంధన అవసరాలు తీర్చుకుంటూనే ప్రతి 25 నిమిషాలకో విమాన సర్వీసును నడపాలని యోచిస్తోంది.[8]

చరిత్ర మార్చు

ఏయిర్ ఆసియా కార్యకలాపాలను భారత్ లో ప్రారంభించాలని ఆ సంస్థ 2012లోనే యోచించింది. ఈ క్రమంలోనే 2013 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీంతో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్.ఐ.పి.బి.)కు ఏయిర్ ఆసియా దరఖాస్తు చేసుకుంది.[9] టాటా సన్స్, టెలిస్ట్రా ట్రేడ్ ప్యాలెస్ తో సంయుక్త భాగస్వామ్యంలో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఏయిర్ ఆసియా ప్రకటించింది. మొదట్లో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం స్థావరంగా 2 టైర్, 3 టైర్ నగరాల్లో మాత్రమే తన కార్యకలాపాలు ప్రారంభించాలని భావించింది.[10] కానీ ఆ తర్వాత తన స్థావరాన్ని బెంగళూరుకు మార్చుకుని తొలి విమాన సర్వీసును బెంగళూరు – గోవా మధ్య నడిపించారు.[11]

ప్రాథమికంగా ఏయిర్ లైన్ లో 50 మిలియన్ల అమెరికన్ డార్లు పెట్టుబడ్డి పెట్టాలని ఏయిర్ ఆసియా భావించింది. తన కార్యాకలాపాల విస్తరణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆన్ లైన్, ఆప్ లైన్ల ప్రయాణ ఏజెంట్లతో ఒప్పందాలు కూడా చేసుకుంది. మార్చి 3, 2013న ఏయిర్ ఆసియాకు సరుకల రవాణా చేసేందుకు, విమానాలు అద్దెకు తీసుకునేందుకు , ఆ తర్వాత ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఎఫ్.ఐ.పి.బి. అనుమతినిచ్చింది. ఏయిర్ ఆసియా భారత్ దేశంలో ఏయిర్ ఆసియా(ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో మార్చి 28, 2013న సంస్థను ప్రారంభించారు.

తుది ప్రక్రియలో భాగంగా విమాన సర్వీసులను నిర్వహించేందుకు అనుమతి కోసం 2014లో మే 1, 2 తేదీల్లో చెన్నై నుంచి కోచి, బెంగళూరు నుంచి కోల్ కతాకు విమానాలను ప్రయోగాత్మకంగా నడిపించారు.[12] తొలి విమాన సర్వీసులు జూన్ 12 నుంచి బెంగళూరు నుంచి గోవాకు నడిపించారు.[13]

నిర్వహణ మార్చు

సంస్థ ప్రారంభంలో రతన్ టాటాను ఏయిర్ ఆసియా ఇండియా బోర్డుకు ముఖ్య సలహాదారుగా నియమించారు.[14][15] మే, 15, 2013 నాడు మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న మిట్టూ చాండిల్యాస్ ను ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఏయిర్ ఆసియా నియమించింది.[16] మరో నెల తర్వాత జూన్ 17, 2013నాడు భారత్ లోని సాఫ్ట్ వేర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్సీసులో నాన్ ఎక్జుక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా పనిచేస్తున్న ఎస్. రామోదరాయ్ ను ఏయిర్ లైన్ ఛైర్మన్ గా నియమించారు.[17]

గమ్య స్థానాలు మార్చు

ఏయిర్ ఆసియా ఇండియా ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, సౌత్ కొరియా, మలేషియా, వియత్నాం, బ్రూనై, కంబోడియా, పిలిప్పిన్స్, శ్రీలంక, తైవాన్, లావోస్, భారత్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాల్లోని 400 గమ్య స్థానాలకు ఈ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
భారత్ లోని ఈ క్రింది ప్రదేశాల నుంచి విమానాలు నడుస్తున్నాయి.[18]

నగరం ఐ.ఎ.టి.ఎ ఐ.సి.ఎ.ఓ విమానాశ్రయం
బెంగళూరు బి.ఎల్.ఆర్ వి.ఓ.బి.ఎల్ కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయం
చెన్నై ఎం.ఎ.ఎ. వి.ఓ.ఎం.ఎం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
గోవా జి.ఓ.ఐ వి.ఓ.సి.ఐ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
జైపూర్ జె.ఎ.ఐ వి.ఐ.జె.పి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం
చండీఘర్ ఐఎక్స్ సి వి.ఐ.సీ.జీ చంఢీగర్ విమానాశ్రయం

విమాన సర్వీసులు మార్చు

ఏయిర్ ఆసియా ఇండియా సంస్థ ఏయిర్ బస్ A 320-200 విమాన సర్వీసును నడిపించాలని ఆలోచిస్తోంది. ఆరంభంలో 2 లేదా 3 A-320లను నడిపించి ఆ తర్వాత సంఖ్య పెంచాలని యోచించింది.[19] ప్రస్తుత 2014 చివరిలోగా మరో A-320 విమాన సర్వీసులను ప్రవేశపెట్టి, 2014-15 ఆర్థిక సంవత్సరంలో మరో 14 A-320 విమానాలను నడిపించాలని లక్ష్యంగా నిర్ణయించింది.
ఏయిర్ ఆసియా ఇండియా విమానం

విమాన సర్వీసు రిజి.నెం. వచ్చినవి ఆర్డర్ ప్రయాణికుల సంఖ్య
ఏయిర్ బస్ A320-200 VT-ATF & VT-ATB 2 10 180

సూచనలు మార్చు

  1. "AirAsia India shifts base to Bangalore from Chennai". Times of India. Retrieved 20 May 2014.
  2. "AirAsia incorporates company for Indian venture". The Times of India(New Delhi),Press Trust of India. 31 March 2013. Retrieved 31 March 2013.
  3. Joshua, Kurlantzick (23 December 2007). "Does Low Cost Mean High Risk?". The New York Times. Retrieved 28 April 2010.
  4. "AirAsia to tie up with Tata Sons for new airline in India". Times of India. 21 February 2013.
  5. "Tata Sons, Telestra Tradeplace and Air Asia to form Air Asia India". Economic Times(Press release). Retrieved 28 April 2010.
  6. "AirAsia India Tickets on Sale From Today - NDTVProfit.com". Profit.ndtv.com. Retrieved 2014-05-30.
  7. "FIPB to take up AirAsia India entry proposal on March 6". The Hindu Business Line. Retrieved 22 February 2013.
  8. "Passengers' perceptions of low cost airlines and full service carriers". Cranfield University. 2005. Archived from the original on 2017-03-13. Retrieved 2014-11-13.
  9. "AirAsia India to take to the skies in Q4". MCIL Multimedia Sdn Bhd. Archived from the original on 24 ఫిబ్రవరి 2013. Retrieved 21 February 2013.
  10. "Tatas plan return flight with AirAsia on board". NDTV Profit. Retrieved 21 February 2013.
  11. "AirAsia India launches and shifts base to Bangalore". ANNA-Aero. 18 June 2014. Retrieved 5 September 2014.
  12. "AirAsia India Proving Flights". Archived from the original on 2015-07-03. Retrieved 2014-11-13.
  13. "AirAsia India's maiden flight from Bangalore to Goa". Archived from the original on 2015-01-03. Retrieved 2014-11-13.
  14. "AirAsia wants Ratan Tata to head JV". The Economic Times. Retrieved 24 February 2013.
  15. "Ratan Tata to be the chief advisor to AirAsia India".
  16. "Singapore based Mittu Chandilya appointed CEO of Air Asia India".
  17. "AirAsia India appoints TCS' S Ramadorai as Chairman".
  18. "Air Asia Destinations". Cleartrip.com. Archived from the original on 2013-12-26. Retrieved 2014-11-13.
  19. "AirAsia to invest up to $60 mn in airline venture with Tata". The Economic Times. Retrieved 21 February 2013.

బయటి లింకులు మార్చు

అధికారిక వెబ్ సైట్