బ్రూనై అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేక నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు[4]. ఇది ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలేషియా దేశ రాష్ట్రమైన సారవాక్‌ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరం చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బోర్నియో ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము మలేషియా, ఇండోనేషియా దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్దములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో పోలి అనే పేరుతో రూపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్దములో అది ఇస్లాము మతము ప్రవేశించి అచ్చటి ప్రజలు ముస్లింలు‌గా మారే ముందుగా మజాపహిత్ సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. మజాపహిత్ సామ్రాజ్యము ఉచ్ఛస్థితిలో ఉన్న సమయములో దీనిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలోని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్, బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన సులు ఆర్చ్ ఫిలాగో వరకు విస్తరించారు. 1521లో ఫర్డినన్ద్ మెగల్లన్ నాయకత్వములో తలసోక్రసి ప్రవేశించింది. 1578లో స్పైన్ దేశముతో కేస్టిల్ వార్ పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో నార్త్ బోర్నియో చార్టేడ్ కంపెనీ సారవాక్‌ నుండి జెమ్స్‌బ్రోక్, సబాహ్ వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రునై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది[5]. 1984 జనవరి 1వ తారీఖున యునైటెడ్ కింగ్‌డమ్ నుండి బ్రూనై పూర్తిగా స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్థికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.

بروني دارالسلام
నెగారా బ్రూనై దారుస్సలాం (బ్రూనై రాజ్య శాంతిధామం)
State of Brunei Darussalam
Flag of బ్రూనై దారుస్సలాం (బ్రూనై శాంతిధామం) బ్రూనై దారుస్సలాం (బ్రూనై శాంతిధామం) యొక్క చిహ్నం
నినాదం
"దైవ నిర్దేశనం ద్వారా ఎల్లప్పుడూ సేవ (Always in service with God's guidance)"  (translation)
జాతీయగీతం
Allah Peliharakan Sultan
అల్లాహ్ సుల్తాన్ ను దీవించుగాక (God Bless the Sultan)

బ్రూనై దారుస్సలాం (బ్రూనై శాంతిధామం) యొక్క స్థానం
బ్రూనై దారుస్సలాం (బ్రూనై శాంతిధామం) యొక్క స్థానం
రాజధానిబందర్ సెరీ బెగవాన్
4°55′N 114°55′E / 4.917°N 114.917°E / 4.917; 114.917
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు మలయ్[1][2][3]
ప్రభుత్వం
 -  సుల్తాన్ హసన్ అల్ బోల్కియా
స్వతంత్ర్యం
 -  పరిసమాప్తి
బ్రిటిష్ రక్షణ

జనవరి 1 1984 
విస్తీర్ణం
 -  మొత్తం 5,765 కి.మీ² (170వది)
2,226 చ.మై 
 -  జలాలు (%) 8.6
జనాభా
 -  మే 2007 అంచనా 383,990 (177వది)
 -  2001 జన గణన 332,844 
 -  జన సాంద్రత 65 /కి.మీ² (127వది)
168 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $9.009 బిలియన్ (138వది)
 -  తలసరి $24,826 (26వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.871 (high) (34వది)
కరెన్సీ బ్రూనై డాలర్ (BND)
కాలాంశం (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bn
కాలింగ్ కోడ్ +673
1 మరియూ తూర్పు మలేషియా నుండి 080 .
బ్రూనై సుల్తాన్ హసన అల్ బోల్కియా

నామ చరిత్ర

మార్చు

బ్రూనై అవాంగ్ అలాంగ్ బెటాటర్ చేత స్థాపించబడింది. టేంబర్గ్ డిస్ట్రిక్ నుండి ఆయన బ్రూనై నది పరీవాహక ప్రాంతానికి తన నివాసస్థలమును మార్చుకొని వెళ్ళగానే ఆయన ఆ ప్రదేశాన్ని చూసి ఆయన నోటి నుండి వెలువడిన మాట బ్రూ నాహ్ (అదే ఇది). ఆ కారణంగా ఈ ప్రదేశానికి బ్రూనై అనే పేరు వచ్చిందని ఊహించబడుతుంది. 14వ శతాబ్దము నుండి ఇది బ్రునైగా పిలువబడుతున్నది. సంస్కృతపదమైన వరుణై (జలదేవత) అన్న పదము బ్రూనైగా మారిందన్న అభిప్రాయము కూడా ఉంది. బూర్నియో అన్న పదానికి అదే మూల పదమని అభిప్రాయపడుతున్నారు. దేశపు పూర్తి పేరైన నెగరా బ్రూనై దరుసలేమ్ దరుసలేం అంటే అరబిక్ భాషలో విస్తారమైన ప్రశాంతత. నెగారా అంటే మలాయ్ భాషలో దేశము. నెగారా సంస్కృత పదము అయిన నగర్ అనే పదము నుండి ఉత్పన్నము అయినది. సంస్కృతములో నగర్ అంటే తెలుగులో నగరం అనే అర్ధమూ ఉంది.

చరిత్ర

మార్చు

15వ శతాబ్దము నుండి 17వ శతాబ్దము వరకు బ్రూనైలో సుల్తానుల పాలనా వైభవము ఉచ్ఛస్థాయిని అందుకుంది. సుల్తానుల అధికారము ఉత్తర బోర్నియా నుండి దక్షిణ ఫిలిప్పైన్ వరకు కొనసాగింది. బ్రూనై సుల్తానుల ఇస్లామ్ మత ప్రచారము బ్రూనై నుండి ఉత్తర బోర్నియా, దక్షిణ ఫిలిప్పైన్స్ వరకు కొనసాగింది. 16వ శతాబ్దములో బ్రూనైలో ఇస్లామ్ చక్కగా వేళ్ళునుకొంది, ఫలితముగా దేశములో పెద్ద మసీదు నిర్మించబడింది. స్పానిష్ యాత్రికుడైన అలాన్సో బెల్ట్రాన్ నీటి మీద నిర్మించబడిన అయిదు అంతస్తుల భవనముగా దానిని వర్ణించాడు. ఆ భవనములో ఉన్న అయిదు దొంతరల కప్పులు అయిదు ఇస్లామిక్ స్థూపాలకు ప్రాతినిధ్యము వహిస్తాయి. ఎట్టకేలకు చివరకు ఆ భవనాన్ని చివరకు అదే సంవత్సరములో స్పానియన్లు ధ్వంసం చేసారు. స్థానిక శక్తుల ప్రాబల్యముతో యూరోపియన్ల అధిక్యము బ్రూనైలో ముగింపుకు చేరుకుంది. తరువాత బ్రూనై పాలకుల మధ్య జరిగే అతర్యుద్ధాల శకము ప్రారంభము అయింది. బ్రూనై రాజధాని ఆక్రమణకు గురిఅయిన సమయములో బ్రూనై స్పైన్‌ల మధ్య చిన్న పాటి యుద్ధము జరిగింది. చివరకు బ్రూనై విజయాన్ని సాధించినా బ్రూనై లోని కొంత భూభాగము ల్యూజెన్ ద్వీపముతో చేరి స్పెయినీయుల వశము అయింది. బ్రూనై సామ్రాజ్య క్షీణదశలో 19వ శతాబ్దములో బ్రునై సామ్రాజ్యములోని అధిక భూభాగము వైట్ రాజాహ్ ఆఫ్ సారవాక్ వశమైంది. ఫలితముగా ఇప్పటి రెండుగా విభజించబడిన చిన్న దేశముగా బ్రూనై మిగిలి పొయింది. 1888 నుండి 1984 వరకు బ్రిటిష్ సంరక్షణలో ఉన్న సమయములో బ్రూనై 1941, 1945ల మధ్య రెండవ ప్రపంచ యుద్ధ కాలములో జపాన్ ఆక్రమణకు గురి అయింది. 1960లొ బ్రూనై సామ్రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటు యునైటెడ్ కింగ్‌డమ్ సహాయముతో అణిచివేయబడింది. బ్రూనై రివోల్ట్‌గా పిలువబడిన ఈ తిరుగుబాటు నార్త్ బోర్నియా ఫెడరేషన్ వైఫల్యానికి కొంత కారణం అయింది.

రాజకీయాలు ప్రభుత్వము

మార్చు

బ్రూనైలో సుల్తాన్ ప్రభుత్వ పాలన మలులో ఉంది. బ్రిటిష్ కామన్ లా ఆధారిత న్యాయవ్యవస్థ అమలులో ఉన్నా కొన్ని కోర్టు కేసుల మీద షరియాహ్ లా అధిక్యత కొనసాగుతుంది. సాంస్కృతిక మలాయ్ ఇస్లామిక్ మొనార్చ్‌తో చేరిన ప్రజా ప్రభుత్వము పాలనా వ్యవస్థ బ్రూనై దేశములో అమలులో ఉంది. ఇది మెలయు ఇస్లామ్ బెరాజ (ఎమ్ ఐ బి) అనే పేరుతో పిలువబడుతుంది. ఎమ్ అంటే మలాయ్ సంస్కృతి, ఐ అంటే ఇస్లామిక్ రిలీజియన్, బి అంటే సామ్రాజ్యములోని రాజకీయ వ్యవస్థ. 1959 నుండి 1962 వరకు బ్రూనై హీజ్ మెజెస్టీ పదుక సెరి బెగింద సుల్తాన్ హజి హాసనల్ బోల్కియాహ్ ముజద్దీన్ వద్దులాహ్ అధ్యక్షతలో పూర్తి నిర్వహణాధికారము అత్యవసర సమయ అధికారముతో సహా కొనసాగింది. సుల్తాన్ రాజ్యాధికారము మెలయు ఇస్లామ్ బెరాజ లేక మెలయు ఇస్లామ్ సామ్రాజ్యముగా గుర్తించబడుతుంది. దేశములో 1962 బ్రూనై రివోల్ట్ జరిగే వరకు హిపోతెటికల్ మారిటల్ లా అమలులో ఉంది. రాజకుంటుంబమ్ ప్రాచీన రాజ అంతస్తును కలిగి ఉంది.

పత్రికా స్వాతంత్ర్యము

మార్చు

బ్రూనై పత్రికల మీద పూర్తిగా ప్రభుత్వం అధిపత్యం ఉంటుంది. రాజరికాన్ని, ప్రభుత్వాన్ని పత్రికలు విమర్శించడము అపురూపమే. అయినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శనాత్మక వ్యాసాలు వ్రాయడానికి అంతగా కట్టుబాట్లు లేకున్నా పత్రికలకు ప్రభుత్వము మీద అంతగా వ్యతిరేకత లేదు. 1953 నుండి బ్రూనై ప్రభుత్వ అనుమతితో ముద్రణా, వినియొగము చేసే ఎస్ డి ఎన్ బి హెచ్ డి కంపెనీ తన కార్యక్రమాలను సాగిస్తూఉంది. అది బోర్నియో బులెటిన్ అనే ఆంగ్లపత్రికను విజయవంతంగా నడుపుతుంది. ఈ పత్రిక ప్రారంభించిన కమ్యూనిటీ వారపత్రిక 1990 నుండి దినపత్రికగా మార్చబడింది. ఈ కమ్యూనిటీ పత్రికలో ప్రాంతీయ, అంతర్జాతీయ ఉపయుకతమైన విషయాలను ప్రలకు అందించడంలో విజయము సాధించింది. మలాయ్ భాషలో ప్రచురితమౌతున్న మీడియా పర్మత అనే దినపత్రిక బ్రూనైలో లభించే మరొక దినపత్రిక. బ్రూనై దరుసలాంలో లభ్యమౌతున్న మరొక పత్రిక ది బ్రూనై టైమ్స్ అనే మరొక ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. బ్రూనై టైమ్స్ ఎస్ డి ఎన్ బి హెచ్ డి ప్రముఖ వ్యాపారుల చేత సమైక్యంగా నడుపబడుతుంది. బ్రూనై ప్రభుత్వము చేత డిజిటల్ ప్రసారాలు డి వి బి -టి ద్వారాఆరు దూరదర్శన కేంద్రాలు నడుపబడుతున్నాయి. అవి డి వి బి -టి (ఆర్ టి బి 1, ఆర్ టి బి2, ఆర్ టి బి 3 (హెచ్ బి), ఆర్ టి బి 4, ఆర్ టి బి 5, ఆర్ టి బి న్యూ మీడియా (గేమ్‌పోర్టల్), అయిదు ఆకాశవాణి ప్రసారాలు జరుగుతునాయి. అవి (నేషనల్ ) ఎఫ్ ఎమ్, ఫిలిన్ ఎఫ్ ఎమ్, నర్ ఇస్లామ్ ఎఫ్ ఎమ్, హార్‌మోనీ ఎఫ్ ఎమ్, పెలంగి ఎఫ్ ఎమ్. ఒక ప్రైవేట్ సంస్థ ఆస్ట్రొ-క్రిస్టల్ పెరుతో ఒక కేబుల్ టి వి ప్రసరం అందిస్తుంది. అలాగే క్రిస్టల్ ఎఫ్ ఎమ్ పేరుతో ఆకాశవాణి ప్రసారాలను అందిస్తుంది.

విదేశీ సంబంధాలు

మార్చు

బ్రూనై యునైటెడ్ కింగ్‌డమ్‌తో సంప్రదాయక అనుబంధము ఏర్పరచుకున్న కారణంగా 1984 జనవరి 1 వ తారీఖున స్వతంత్రం లభించిన వెంటనే 49వ కామన్వెల్త్ దేశంగా అవతరించింది. అలాగే 1984 జనవరి ఏడవ తారీఖున బ్రూనై ఎ ఎస్ ఇ ఎ ఎన్ తో చేరి తన ప్రాంతీయ అంతర్జాతీయ సంభాంధాలను ఏర్పరచుకోవడములో మొదటి అడుగు వేసి దానిలో ఆరవ సభ్యదేశము అయింది. తరువాత బ్రూనై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 39వ సమావేశములో పాలు పంచుకుని తరువాత 1984 సెప్టెంబరు 21 నాటికి శాశ్వత సభ్యత్వం పొందడము ద్వారా తన సార్వభౌమాధికారము, సంపూర్ణ స్వాతంత్ర్యము కలిగిన దేశముగా ప్రపంచ ఆమోదము పొందింది. ఒక ఇస్లామ్ దేశముగా బ్రూనై దరుసలాం ఇస్లామ్ కాన్‌ఫరెన్స్ సంపూర్ణ సభ్యత్వము కలిగి ఉంది. మొరాకోలో జరిగిన నాల్గవ సమావేశములో 1984 జనవరిలో ఇస్లామిక్ కాన్ఫరెన్స్ అనే పేరును ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్‌ గా నామాంతరం చెందింది. 1989వ సంవత్సరంలో ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్‌లో (ఎ పి ఇ సి) కలసిన తరువాత 2000 సంవత్సరం ఆర్థికవేత్తల సమావేశానికి బ్రూనై ఆతిథ్యం ఇచ్చంది. ఇతర ఆర్థిక సంబంధాల కారణంగా బ్రునై దరుసలేం వరల్డ్ ట్రేడ్ కార్పొరేషన్ (వి టి ఓ) 1995వ సంవత్సరం సభ్యత్వం పొందిది. 1994 మార్చి 24న ఫిలిప్పైన్స్‌లో జరిగిన డేవో మంత్రివర్గ సమావేశములో బి ఐ ఎమ్ పి-జిఎలో రూపుదిద్దుకోవడనికి ప్రధాన పాత్ర వహించింది. బ్రూనై ప్రపంచంలోని అన్ని దేశాల గుర్తింపు పొందింది. బ్రూనై ఫిలిప్పైన్స్, సింగపూరు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. 1909 ఏప్రిల్‌లో ఫిలిప్పైన్స్, బ్రూనై దేశాలు వారి స్నేహ సంబధాలు బలపడే విధంగా మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎమ్ ఒ యు) లో సంతకాలు చెసాయి. తరువాత కాలములో అది వ్యవసాయ, తోటల సంబంధిత రంగాలలో సహకార పెట్టుబడుల అభివృద్ధికి తోడ్పడింది.

భూవివాదాలు

మార్చు

చిన్ని ద్వీపాల భూవివాదాలు కలిగిన అనేక దేశాలలో బ్రూనై ఒకటి. బ్రూనైని ఆనుకుని ఉన్న మలేషియా దేశానికి చెందిన సారవాక్ ఒక భాగమైన లింబాంగ్ గురించి ఇరు దేశాల మధ్య 1890వ సంవత్సం నుండి వివాదము కొనసాగుతూనే ఉంది. మలేషియన్ ప్రధాన మంత్రి మహాతిర్ మొహమ్మద్ దాతక్ సెరి అబ్దుల్లహ్ అహమద్ బద్దవీ ప్రభుత్వాన్ని బ్రునైతో రహస్యల సంబంధాలు పెట్టుకున్నాడని ఫలితంగా దక్షిణచైనాలోని రెండు చమురు నిలువలు సమృద్ధిగా కలిగిన భూములకు బదులుగా మలేషియా ప్రభుత్వం లింబర్గ్ మీద ఆధిపత్యాన్ని బ్రూనైకి ధారాదత్తం చేసిందని బహిరంగంగా విమర్శించాడు.

విభాగాలు

మార్చు
 
బ్రూనైలోని జిల్లాలు

బ్రూనై దేశము నాలుగు జిల్లాలుగా విభజించబడి ఉంది. జిల్లాలును ముఖిమ్స్‌‌లుగా విభజింపబడతాయి.

 • బెలియత్.
 • బ్రూనై, మౌర.
 • టెంబరాంగ్.
 • తుటాంగ్.

టెంబరాంగ్ జిలా భౌతికంగా బ్రునై నుండి మలేషియా భూభాగమైన సారవాక్ భూభాగముతో విభజింపపడి ఉంటుంది. ఈ జిల్లాలు 38 ముఖిమ్స్ అనే విభాగాలుగా విభజింపబడి ఉంటాయి.

బ్రూనై విభాగాల జాబితా

మార్చు
వర్గము ముఖిమ్ జనసంఖ్య నగరం/నగర పురము/నగరం జిల్లా
1 సెంగ్కురాంగ్ 71,700 జెరుడాంగ్, బందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
2 గడాంగ్ ఎ & గడాంగ్ బి, 59,610 బందర్ సెరి బెగ్వాన్ బ్రూనై మౌర
3 బెరాకస్ ఎ 57,500 బందర్ సెరి బెగ్వాన్ బ్రూనై మౌర
4 కౌల బెలియత్ 35,500 కౌల బెలియత్ బెలియత్
5 సెరియ 32,900 సెరియా టౌన్ (పెకాన్ సెరియా) బెలియత్
6 బెరాకస్ బి 23,400 బందర్ సెరిబెగ్వాన్ బ్రూనై-మౌర
7 సుంగై లియాంగ్ 18,100 నోన్ బెలియత్
8 పెంగలాన్ బాటు అప్రాక్స్ 15,00 నోన్ బ్రునై - మౌర
9 ఖిలానాస్ సుమారు. 15,000 బెందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
10 కొత బాటు 12,600 బెందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
11 పెకాన్ తటాంగ్ 12,100 పెకాన్ తటాంగ్ తుటాంగ్
12 మెంతిరి 10,872 నోన్ బ్రూనై - మౌర
13 సెరస సుమారు. 10,000 మౌర టౌన్ (పెకాన్ మౌర) బ్రూనై - మౌర
14 కియాన్‌గ్గే 8,540 బెందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
15 బరంగ్ పింగారి అయార్ సుమారు. 8,200 బెందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
16 కెరియమ్ 8,000 నోన్ తుటాంగ్
17 లుమాపాస్ 7,458 బందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
18 కియ్డాంగ్ 7,000 నోన్ తటాంగ్
19 సబా సుమారు. 6,600 బందర్ సెరి బెగ్వాన్ బ్రూనై-మౌర
20 సుంగై కెడయాన్ సుమారు. 6,000 బెందర్ సెరి బెగ్వాన్ బ్రూనై - మౌర

భౌగోళికము

మార్చు
 
బ్రూనై భౌగోళిక స్వరూపం

బ్రూనై భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడిన ఆగ్నేయాసియా దేశము. బ్రూనై 5,765 చదరపు కిలోమీటర్ల భూభాగము కలిగిన దేశము . దక్షిణ చైనా సముద్రతీరానికి అభిముఖంగా బ్రూనై 161 మైళ్ళ పొడవున సముద్రతీరం కలిగిన దేశం. బ్రూనై, మలేషియా దేశాల మధ్య కల సరిహద్దుల పొడవు 381 కిలోమీటర్లు. బ్రునై 500 చదరపు జలభాగము కలిగి ఉంది. ఇందులో 200 నాటికల్ మైళ్ళు ప్రత్యేక వాణిజ్య భూభాగము. బ్రూనై దేశ పౌరులలో 77% శాతం ప్రజలు దేశపు తూర్పు భూభాగములో ఉంటున్నారు. దేశపు అగ్నేయ భూభాగములో (టెంబురాంగ్) ఉపస్థితమై ఉన్న కొండల మీద కేవలము 10,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. 2010 జూలై జనాభా లెక్కల ప్రకారం బ్రూనై దేశపు మొత్తము జనాభా సుమారు 408,000. విరిలో 150,000 మంది దేశపు రాజధాని అయిన బందర్ సెరి బెగ్వాన్లో నివసిస్తున్నారు. మిగిలిన ప్రధాన నగరాలు వరుసగా రేవు పట్టణమైన మౌర, చమురు తయారు చేసే నగరమైన సెరియా, పొరుగు నగరమైన బెలియత్ జిల్లాలో ఉన్న కౌలా బెలియత్, పెనాగా నగరంలో దేశము కొరకు పోరాడిన దేశభక్తులు అనేకులు నివసిస్తున్నారు. వీరు రాయల్ డచ్ షెల్, బ్రిటిష్ ఆర్మీ హౌసింగ్, రిక్రియేషన్ ఫెసిలిటీస్ పోరాటాలలో పాల్గొన్న వారు ఉన్నారు. బ్రూనై బర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్ అనే వర్షాధార అడవులు కలుగిన భూభాగము మధ్య ఉపస్థితమై ఉంది. ఈ అడవులు దేశపు భూభాగాన్ని అధికముగా అక్రమించి ఉన్నాయి. ఇవి కాక పర్వత వర్షాధార అడవులు ఉన్నాయి. బ్రూనై వతావరణాన్ని ఆంగ్లములో ట్రాపికల్ ఈక్వటోరియల్ అంటారు. సరాసరి ఉష్ణోగ్రత 26.1 సెంటీగ్రేడ్ డిగ్రీలు. ఏప్రిల్, మే మాసముల సరాసరి ఉష్ణోగ్రత 24.7 సెంటీగ్రేడ్ డిగ్రీలు, అక్టోబరు, డిసెంబరు వరకు ఉండే సరాసరి ఉష్ణోగ్రత 23.8 సెంటీగ్రేడులు ఉంటుంది.

ఆర్ధిక రంగం

మార్చు

బ్రూనై దేశము చిన్నదైన సంపన్నమైన దేశీయ, విదేశీ మిశ్రిత భాగస్వామ్యము ఆర్థికరంగం, ప్రభుత్వ క్రమబద్ధీకరణ, సేవారంగము, గ్రామీణ సంస్కృతి కలిగి ఉంది. బ్రూనై దేశం దాదాపు సగము అదాయాన్ని దేశీయ మౌలిక ఉత్పత్తి (జి డి పి) ని క్రూడ్ ఆయిల్, సహజవాయువుల ఉత్పత్తుల ద్వారా లభిస్తుంది. మిగిలిన ఆదాయము విదేశీ పెట్టుబడుల వలన కొంత స్వదేశీ ఉత్పత్తుల వలన కొంత లభిస్తుంది. బ్రూనై ప్రభుత్వం 2000 నుండి ఏషియన్ పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్ (ఎ పి ఇ సి) చైర్మెన్ పదవిని చేపట్టి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ సహకార రాజకీయాల ద్వారా ప్రపంచ ఆర్థిక రంగంలో తమ స్థానాన్ని పదిల పరచుకొని ముందుకు సాగడం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది. భవిష్యత్తులో కార్మిక శక్తిని బలపరచి దేశములో నిరుద్యోగ సమస్యను తగ్గించే ప్రయత్నాలు చేపట్టింది, బ్యాంకింగ్, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టింది, ఆర్థిక పునాదులను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. బ్రూనై ప్రభుత్వము తమ పౌరులకు ఉచిత వైద్య సెవలను అందిస్తూ పరిమిత ధరకు బియ్యము, అత్యవవసర సామాగ్రిని అందిస్తుంది. ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య అనుసంధిత కేంద్రంగా ఉండి అంతర్జాతీయ ప్రయాణ కేంద్రంగా ఉండాలని బ్రూనై జాతీయ ఎయిర్ లైన్ అయిన రాయల్ బ్రూనై ప్రయత్నిస్తుంది. ఆసియాలోని మరిన్ని నగరాలకు తమ విమానసేవలను విస్తృతపరిచే దిశగా రాయల్ బ్రూనై ఆలోచిస్తుంది.

ది బ్రూనై హలాల్ బ్రాండ్

మార్చు

2009 జూలైలో బ్రూనై ప్రభుత్వం బ్రూనై హలాల్ పేరుతో జాతీయ హలాల్ బ్రాండ్ ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ కారణంగా చమురు ఆధారిత తయరీదారులకు ప్రభుత్వపరంగా లభించిన అనుమతి ద్వారా బ్రూనై హలాల్ బ్రాండులను దేశంలోని విదేశాలలోనూ ఉపయోగించుకుని చమురు అధారిత వాణిజ్యంలో దుసుకువెళుతూ గుర్తించతగిన ముస్లిమ్ వాడకందారులను ఆకర్షిస్తుంది. బ్రూనై హలాల్ బ్రాండ్ అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ముస్లిమ్ వాడకం దారుల అవసరాలను పూర్తి చేస్తూ శక్తివంతమైన వ్యాపార లాభాలను పంట అందుకోవడానికి చేసిన సరైన విశ్వసనియమైన మొదటి ప్రయత్నంగా గుర్తింపు పొందింది. రాజరికపు పర్యవేక్షణలో సాగుతున్న బ్రూనై హలాల్ బ్రాండ్ ముస్లిమ్ వాడకందారుల గుర్తింపు పొందడంలో విజయము సాధించింది. తయారీదారులు కూడా ముస్లిమ్ సాంకేతిక చట్టాలను కచ్చితంగా పాటించడంలో జాకరుకత వహిస్తున్నారు. బ్రూనై ప్రభుత్వం ఈ బ్రాండ్ యొక్క విశ్వసనీయత పెంచే విధంగావ్యూహాత్మక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా లోపం లేని నాణ్యత కలిగిన హలాల్ బ్రాండ్ తయారిలు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఉపయోగిస్తున్న ముడిసరుకులు, తయారీ పద్ధతులు, వినియోగం వరకు చక్కగా సాగడనికి అనువైన చట్టాలను రూపొందించి వాటిని నిర్ధుష్టంగా అమలు చేసేలా పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వానికి స్వంతం అయిన నూతన సంస్థ అయిన వాఫిరాగ్ హోల్డింగ్స్ ఎస్ డి ఎన్ బి హెచ్ డి బ్రూనై హల్లల్ బ్రాంద్ మిద ఆధిపత్యం వహిస్తుంది. వాఫిరాగ్ సంస్థ బ్రూనై గ్లోబల్ ఇస్లామిక్ ఇన్వెస్ట్‌మెంట్, హాంగ్ కాంగ్‌లోని లాజిస్టిక్ ఫామ్ కెర్రీ ఎఫ్ ఎస్ డి ఎ లిమిటెడ్‌ల జాయింట్ వెంచరులో పాలుపంచుకోవడం ద్వారా ఘనిమ్ ఇంటర్నెషనల్ ఎస్ డి ఎన్ బి హెచ్ డి రూపొందించింది. ఘనిమ్ ఇంటర్నెషనల్ డిపార్ట్‌మెంటాఫ్ స్యారియాహ్ అఫెయిర్స్ హలాల్ ఫుడ్ కంట్రోలింగ్ సెక్షన్ నుండి బ్రూనై హలాల్ బ్రాండ్‌ను లెబుల్‌ను ఉపయోగించు కోవడనికి అనుమతి పోందిన అనంతరము వారి ఆహార ఉత్పత్తులకు హలాల్ బ్రాంద్‌ను వాడుకుంటుంది.

వ్యవసాయం

మార్చు

ఆహార ఉత్పత్తుల్లో స్వయమ్ సమృద్ధిని సాధించే దిశగా చెసిన ప్రత్నాలలో మొదటిది పాడి ప్లాంటింగ్ టువార్డ్స్ అచివింగ్ సెల్ఫ్ సఫీషియన్సీ ఆఫ్ బ్రూనై దరుసలేం పేరుతో 2009లో వసన్ పాడి ఫీల్డ్స్ వద్ద జరిగిన సదస్సులో తమ బ్రూనై దరుసలేమ్ రైస్ 1 అన్న పేరును లైలా రస్‌గా నామాంతరం చేసింది. 2009 ఆగస్టు నాటికి రాయల్ కుటుంబమ్ మొదటి వరికంకుల పంతను వారి స్వహస్తాలతో కొన్ని లైలా వరికంకులను కోసారు. మరిన్ని ప్రయత్నాలద్వారా ఉత్పత్తిని అభివృద్ధి చేస్తు అహ్హరౌత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో ముందుకు నడుస్తుంది.

ఆరోగ్య సంరక్షణ

మార్చు

బ్రూనై పౌరులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఉచితవైద్య సేవలు అందుకునే సౌకర్యం కలిగి ఉన్నారు. బ్రూనైలో అతి పెద్ద ఆసుపత్రి పేరు రాజా ఇస్తేరీ ఆనక్ సాలేహ హాస్పిటల్ (ఆర్ ఐ పి ఎస్). ఈ ఆసుపత్రి దేశరాజధాని అయిన బందర్ సెరి బెగ్వాన్ లో ఉంది. దేశంలో రెండు ప్రైవేట్ వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు వరుసగా గ్లెనీగల్స్ జే పి ఎమ్ సి ఎస్ డి ఎన్ బి హెచ్ డి, జెరుడాంగ్ పార్క్ మెడికల్ సెంటర్. 2008 వరకు బ్రూనైలో ఇంటర్నెషనల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆసుపత్రులు లేవు. బ్రూనైలో వైద్యకళాశాలలు లేవు. వైద్యవిధ్యను అభ్యసించాలని అభిలషించే బ్రూనై పౌరులు విదేశీ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిసిన్స్ పేరుతో వైవిధ్యా విభాగాన్ని యూనివర్సిటీ బ్రూనై దరుసలేం లో ప్రారంభించే ప్రయత్నాలలు ఆరంభించి తరగతులను నిర్వహించడానికి కావలసిన భవనం నిర్మించారు. ఈ భవనంలో పశోధనా వసతులున్న ప్రయోగశాల ఉంది. 2009లో ఈ భవనము నిర్మాణము పూర్తి అయిమ్ది. 1951 నుండి ఇక్కద నర్సింగ్ నిర్వహించబడుతుంది. వైద్య సేవలను అభివృద్ధి చేసి నాణ్యమైన వైద్య సంరక్షణను మెరుగు పరచడానికి ఆర్ ఐ పి ఎస్ అదనంగా 58 మంది నర్సిమ్గ్ మెనేజర్స్‌ను నియమించింది. 2008 నాటికి ఈ నర్సింగ్ కళాశాల యునివర్సిటీ బ్రూనై దరుసలేంలో ఉన్న ఇంన్సిట్యూట్ ఆఫ్ మెదిసిన్స్ తో నర్సులను, మిడ్‌వైవ్స్‌ను అధికంగా తయారు చెసే నిమిత్తం కలిపారు. దీనిని ఇప్పుడు పి ఎ పి ఆర్ ఎస్ పి (పెంగిరన్ ఆనక్ పుతెరి రాషిడాహ్) ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా పిలువబడుతుంది.

ప్రయాణ సౌకర్యాలు

మార్చు

బ్రూనైలోని ప్రధాన జనసాంద్రత కలిగిన నగరాలన్ని 2,800 మైళ్ళ పొడవున ఉన్న రహదారులతో అనుసంధానించబడ్డాయి. మౌరా నగరం నుండి కౌలా బెలియత్ వరకు రావడానికి పోవడానికి సౌకర్యమున్న రహదారి 135 మైళ్ళ పొడవున్నది. రోడ్డుమార్గము, వాయుమార్గము, సముద్రమార్గముల ద్వారా బ్రూనైని చేరుకోవచ్చు. బ్రూనై ఇంటర్నేషనల్ విమానాశ్రయము దేశానికి ప్రధాన ప్రవేశ మార్గము. రాయల్ బ్రూనై ఎయిర్ లైన్స్ దేశీయ వాయువాహనము. మౌరా టెర్మునల్ నుండి మలేషియాకు చెందిన లబుయాన్ వరకు ప్రయాణీకులను ప్రతిదినము చేరవేస్తుంది. టెంబురాంగ్ వరకు ప్రయాణీకులను చేరవేయుట సరకు రవాణా వంటి కార్యక్రమాలను స్పీడ్ బోట్లు చేస్తుంటాయి. బ్రూనై మధ్య నుండి పోతున్న ప్రధాన రహదారి పేరు తుటాంగ్-మౌర-హైవే . బ్రూనై రహదారులు చక్కగా అభివృద్ధి చెందినవి. బ్రూనైలో ఉన్న ప్రధాన నౌకాశ్రయం మౌరాలో ఉంది. ఇక్కడి నుండి దేశీయ ఉత్పత్తులు అయిన చమురు అధారిత తయారీలు విదేశాలకు ఎగుమతి ఔతుంటాయి. బ్రూనై పౌరులలో ప్రతి 2.09 మందికి ఒక కారు చొప్పున ఉంది. ప్రపంచంలో అధికంగా కారువాడకందారులైన పౌరులున్న దేశాలలో బ్రూనై ఒకటి. ప్రయాణానికి అధికముగా వాహన సౌకర్యము లేక పోవడానికి ఇది ఒక కారణము. అతి తక్కువైన దిగుమతి సుంకము, ఆర్థిక భారము కాని నిర్వహణ, చవకగా లభిస్తున్నింధనము కారుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ పెట్రోలు ధర 0.53 బ్రునై డాలర్లు.

జనాభా వివరణ

మార్చు

బ్రూనై ప్రజలలో 75% శాతం నగరానికి వెలుపలి ప్రాంతంలో నివసిస్తుంటారు. బ్రూనై ప్రజల సరాసరి వయసు 75.96 సంవత్సరాలని అంచనా. బ్రూనై ప్రజలలో నివసిస్తున్న సంప్రదాయ చైనియుల సంఖ్య 15%. 1986 నుండి ఇక్కద తరాలుగా నివసిస్తున్నప్పటికీ 90% శాతం ప్రజలు బ్రూనై పౌరసత్వం పొందలేక పోతున్నారు.

బ్రూనై అధికారిక భాషను మెలయు బ్రూనై అంటారు. అధికారికంగా వాడబడుతున్న భాష మలాయ్. బ్రూనై మలాయ్ భాష స్వచ్ఛమైన మలాయ్ భాషకంటే భిన్నంగా ఉంటుంది. దేశంలో ఆంగ్లం, చైనా భాషలను కూడా మాట్లాడుతుంటారు. సహజమైన మలాయ్ భాషకు భిన్నమైన మిశ్రిత మలాయ్ భాష అయిన భాషా రోజాక్‌ను మాధ్యమము, ప్రజలలో వాడకంలో ఉంది. బ్రునై ప్రజలు మాట్లాడే ఇతర భాషలు కెడయాన్, తుటాంగ్, మురుత్, దుసన్, ఇబాన్. గుర్తించ తగినంతగా బ్రిటిష్, ఆంగ్లేయులు ఇక్కద నివసిస్తున్న కారణంగా ఆంగ్లభాష కూడా తరచు ఇక్కడి ప్రజలు మాట్లాడూతుంటారు.

 
సుల్తాన్ ఒమర్ అలి సయిఫుద్దీన్ మసీదు

బ్రూనై అధికారిక మతము ఇస్లామ్. మతాధికారిగా సుల్తానును గౌరవిస్తారు. మూడింట రెండు భాగాల బ్రూనై ప్రజలు ఇస్లాం మతావలంబీకులు. 13% బ్రూనై శాతం ప్రజలు బుద్ధమతావలంబీకులు. 10% శాతమ్ బ్రూనై ప్రజలు క్రిస్టియన్లు. 7% శాతం ప్రజలు ఈమతాన్ని అవలంబించని స్వేచ్ఛా ప్రియులు. వీరిలో చైనీయులు అధికం. వీరిలో అధికులు బుద్ధిజం, కన్‌ఫ్యూజియనిజం, తోయిజాన్ని అనుసరిస్తున్నా వీరు జనాభా గణనలో ఏమతము అవలంభించమని ప్రకటించిన వారు. 2% శాతమ్ ప్రజలు ఇండిజీనియస్ మతావలంబీకులు. బ్రూనై సంప్రదాయక ముస్లిమ్ ప్రభావితమైన మలాయ్ సంస్కృతి కలిగి ఉంది. దేనినైతే మలాయ్ సమ్స్కృతి అని అనుకుంటున్నారో పురాతన మలాయ్ సంస్కృతిని ప్రజలు అనుసరిస్తుంటారు. చారిత్రక సంఘటనల మీద ఆధార పడి వివిధ సంస్ఖృతులతో మిశ్రితమై బ్రూనై సమ్స్కృతి మీద విదేశీ సంస్కృతి ప్రభావము అధికమే. ఇక్కడి సంస్కృతిలో అయా కాలలో ఆధిక్యతలో ఉన్న అనిమిజం, హిందూఇజం, ఇస్లాం, పాశ్చాత్య నాగరికతల ప్రభావము కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బ్రూనైలో ఇస్లాము చక్కగా వేరూని ఉంది.

సంస్కృతి

మార్చు

చట్టాలు

మార్చు

వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొట్టి చంపడం.. బ్రూనై దేశంలో ఇప్పుడిది అధికారిక శిక్షల్లో ఒకటి. ఇలాంటి పలు కఠిన శిక్షలను 2013 నవంబరు 6 మంగళవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయిలో ఇలాంటి నిర్ణయం తీసుకొన్న తొలి తూర్పు ఆసియా దేశం ఇదే. కొత్త షరియా పీనల్ కోడ్ మంగళవారమే ప్రవేశపెట్టామని, దీన్ని ఆరు నెలల్లో పలు దశలుగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ముస్లింలకు మాత్రమే వర్తించే ఈ కొత్త పీనల్ కోడ్‌లో.. వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొటి చంపడం, దొంగతనానికి పాల్పడితే అంగం నరికేయడం, అబార్షన్ చేయించుకోవడం లేదా మద్యం తాగడం లాంటి ఉల్లంఘనలకు బెత్తంతో తీవ్రంగా దండించడం లాంటి శిక్షలు ఉన్నాయి. ‘‘అల్లా దయతో, ఈ చట్టం అమల్లోకి వచ్చాక, అల్లా పట్ల మా బాధ్యత నెరవేరుతుంది’’ అని సుల్తాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త పీనల్ కోడ్‌పై హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

గుర్తించతగిన బ్రూనై పౌరులు

మార్చు
 • క్రియాగ్ అడామ్స్ ఈయన జన్మించింది సెరియా, ఈయన పిట్స్ బర్గ్ పెంగ్విన్స్ తరఫున క్రీదలలో పాల్గొని రెండు సార్లు స్టన్లి కప్పును సాధించాడు.
 • డి కే నాజిబాహ్ ఎరా ఆల్-సుఫ్రి ఈయన కాస్‌పర్క్‌సి అట్లాంటిక్ ఎక్స్‌పెడిషన్ సభ్యుడు.
 • వూ చున్ ఈయన ఫాహ్‌రెన్‌హియట్.
 • డి హస్క్, రాక్ బాండ్.
 • ఎక్వాహ్ ఈమె ప్రాంతీయ, అంతర్జాతీయ గాయకురాలు.
 • మరియా ఈమె ప్రాంతీయ గాయకురాలు.
 • హిల్ జానీ ఈయన గాయకుడు, నటుడు.
 • జుల్ ఎఫ్ ఈయన పి2ఎఫ్ ఐడల్ (విగ్రహ) కాంపిటీషన్ విజేత.
 • ఆలి సాని ఈయన అండర్ 19 క్రికెట్ విరుడు, పెట్రోలియమ్ ఇంజనీర్, కస్టోదియన్ అఫ్ఫ్ నార్త్ ప్రొడక్షన్ ఫిల్డ్ బాధ్యతను నిర్వహిస్తున్న వాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. Adrian Clynes. "Brunei Malay: An Overview (Occasional Papers in Language Studies, Department of English Language and Applied Linguistics, Universiti Brunei Darussalam, Volume 7 (2001), pp. 11-43)" (PDF). Universiti Brunei Darussalam. Archived from the original (PDF) on 2013-10-16. Retrieved 2013-10-14.
 2. Gallop, 2006. "Brunei Darussalam: Language Situation". In Keith Brown, ed. (2005). Encyclopedia of Language and Linguistics (2 ed.). Elsevier. ISBN 0-08-044299-4.
 3. Writing contest promotes usage, history of Jawi script Archived 2012-06-12 at the Wayback Machine. The Brunei Times (22 October 2010)
 4. Peter Haggett (ed). Encyclopedia of World Geography, Volume 1, Marshall Cavendish, 2001, p. 2913.
 5. Pocock, Tom (1973). Fighting General – The Public &Private Campaigns of General Sir Walter Walker (First ed.). London: Collins. ISBN 0-00-211295-7.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రూనై&oldid=3685538" నుండి వెలికితీశారు