ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దుండిగల్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న భారత రక్షణ సేవా శిక్షణ సంస్థ. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 43 కి.మీ.ల దూరంలో ఉంది.[1] 1969లో స్థాపించబడిన ఈ అకాడమీలో 1971 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. ఇది 7,050 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||||||
విమానాశ్రయ రకం | భారత సైనిక అకాడమీలు | ||||||||||||||
యజమాని | రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం | ||||||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత వైమానిక దళం | ||||||||||||||
ప్రదేశం | దుండిగల్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||||||||||||||
ఎత్తు AMSL | 2,013 ft / 614 m | ||||||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°37′38″N 078°24′12″E / 17.62722°N 78.40333°E | ||||||||||||||
రన్‌వే | |||||||||||||||
| |||||||||||||||
7,050 ఎకరాలు |
ప్రారంభం
మార్చుభారత వైమానికి దళ కేడర్ అధికారుల నుండి క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ శాఖలతోపాటు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు ఇందులో శిక్షణ ఇవ్వబడుతోంది. ఒక సంవత్సరం శిక్షణ తర్వాత, ఆఫీసర్ క్యాడెట్లను భారత వైమానిక దళానికి చెందిన వివిధ శాఖలలో నియమిస్తారు. 1993, జూన్ లో మొదటిసారిగా మహిళా క్యాడెట్లను వైమానిక దళంలో చేర్చుకుంది.[2]
శిక్షణ వివరాలు
మార్చుభారత వైమానికి దళానికి చెందిన పైలట్‌లు విమానాల్లో ప్రయాణించడం నేర్చుకోవడానికి ఈ అకాడమీలో వివిధ దశల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు రాఫెల్,[3] సు-30ఎంకెఐ, మిగ్-29, మిగ్-21, మిరేజ్ 2000, తేజస్, జాగ్వార్ మొదలైన విమానాలు కలిగిన ఫ్రంట్ లైన్ కాంబాట్ స్క్వాడ్రన్లలో పనిచేస్తారు. ఎగురుతున్న రవాణా విమానాలలో ఆసక్తి ఉన్నవారికి, భారత వైమానిక దళ భారీ మల్టీ ఇంజిన్ Il-76 ఎయిర్‌క్రాఫ్ట్, సి-17 గ్లోబ్‌మాస్టర్ III, ట్విన్ ఇంజిన్ మల్టీ రోల్ యాన్ -32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, హెచ్ఎస్ 748, డోర్నియర్ 228 లైట్ యుటిలిటీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను అందిస్తోంది.
హెలికాప్టర్ ఫ్లీట్‌లో చేరడం వల్ల, ట్రైనీలు ట్రీటాప్ ఎత్తు, దూర ప్రాంతాలలో ల్యాండింగ్ చేయడం మొదలైనవి నేర్చుకుంటారు. భారత అభివృద్ధి చెందిన ధృవ్ , ఎహెచ్ -64 అపాచీ వంటి అటాక్ హెలికాప్టర్,[4] మి -26, హెవీ-లిఫ్ట్ ఛాపర్లు, ప్రమాదాల నుండి తరలింపు, సైన్యాన్ని చేరవేయడం, గాలిలోకి ఎత్తడం మొదలైన పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి.
వైమానిక దళ కార్యకలాపాలలో భాగంగా ఇతర రంగాలలో (అడ్మినిస్ట్రేటివ్, ఎయిర్ కంట్రోలింగ్, మెటీరోలాజికల్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ శాఖలు) పనిచేసేలా యువతీ యువకులకు అకాడమీ ప్రత్యేక శిక్షణను అందిస్తుంది. సాయంత్రం స్విమ్మింగ్, ఫీల్డ్ - ఇండోర్ గేమ్‌లు ఉంటాయి. విదేశాల అధికారులు కూడా అప్పుడప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.
అకాడమీలో నిర్వహించబడే శిక్షణ రకాలు
మార్చు- ప్లయింగ్
క్యాడెట్ ఫ్లయింగ్ బ్రాంచ్‌లో చేరినట్లయితే, మూడు దశల్లో శిక్షణ ఇవ్వబడులోంది. ప్రతి దశలో ట్రైనీ పైలట్‌లకు ప్రాథమిక స్థాయి నుండి మరింత సంక్లిష్టమైన విమానయాన స్థాయి శిక్షణ ఉంటుంది. మొదటి దశ తరువాత తర్వాత క్యాడెట్‌లను ఫైటర్, హెలికాప్టర్ లేదా ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై స్పెషలైజేషన్ కోసం పంపుతారు.
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్స్ శిక్షణ
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విధానాల ఆధారంగా రూపొందించబడింది, సైనిక విమాన అవసరాలకు అనుగుణంగా మార్చబడింది.
- గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ శిక్షణ
భారత వైమానిక దళంలోని అన్ని నాన్-టెక్నికల్ శాఖలకు గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లకు ఇచ్చే శిక్షణ ఇది. క్యాడెట్ అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ లేదా మెటియోరాలజీ విభాగంలో చేరినట్లయితే, వారు ఎయిర్ ఫోర్స్‌లో గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్‌గా చేరడానికి ముందు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.
- జాయింట్ సర్వీస్ శిక్షణ
ఫ్లయింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌ల క్యాడెట్‌లకు ఇక్కడ 22 వారాల పాటు జాయింట్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇస్తారు.[5] ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంపికైన క్యాడెట్లను బెంగుళూరులోని జలహళ్లిలోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీకి పంపుతారు. శిక్షణలో పరిపాలన, సేవా పరిజ్ఞానం వంటి సాధారణ సేవా సబ్జెక్టులు ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ "Career Air Force". careerairforce.nic.in. Archived from the original on 2021-08-31. Retrieved 2021-08-31.
- ↑ "Half the IAF women trainee pilots quit in a year". Rediff.com. 19 June 1997. Retrieved 29 October 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-12. Retrieved 2021-08-31.
- ↑ Gurung, Shaurya Karanbir. "Apache Attack helicopters: Eight US made Apache attack helicopters inducted into IAF". The Economic Times. Retrieved 2021-08-31.
- ↑ "Training for Aeronautical Engineering Branches". Archived from the original on 2020-11-27. Retrieved 2021-08-31.
బయటి లింకులు
మార్చు- Airport information for VODG at World Aero Data. Data current as of October 2006.
- గ్లోబల్ సెక్యూరిటీ వద్ద దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ