ఎరిత్రోమైసిన్
ఎరిత్రోమైసిన్ అనేది అనేక బ్యాక్టీరియా సంక్రమణాలు వంటి అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్ ఔషధము. ఇందులో శ్వాసకోశ అంటువ్యాధులు, చర్మానికి సంబంధించినవి, క్లామిడియా అంటువ్యాధులు, కటి శోథ వ్యాధి, సిఫిలిస్ వంటివి ఉన్నాయి[1]. ఇది గర్భధారణ సమయంలో నవజాత శిశువులో గ్రూప్ B స్ట్రెప్టోకోకల్ సంక్రమణాన్ని నివారించడానికి, అలాగే కడుపు ఖాళీ చేయడం ఆలస్యమయితే ఆ పరిస్థితి మెరుగుపరచడానికి కూడా ఉపయోగించుతారు[1][2]. దీనిని సిరల ద్వారా, ఇంకా నోటి ద్వారా ఇస్తారు[1]. నవజాత శిశువులో కంటిలో సంక్రమణాలను నివారించడానికి ప్రసవం తర్వాత ఈ కంటి లేపనం మామూలుగా సిఫార్సు చేస్తారు[3].
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(3R,4S,5S,6R,7R,9R,11R,12R,13S,14R)-6-{[(2S,3R,4S,6R)-4-(Dimethylamino)-3-hydroxy-6-methyloxan-2-yl]oxy}-14-ethyl-7,12,13-trihydroxy-4-{[(2R,4R,5S,6S)-5-hydroxy-4-methoxy-4,6-dimethyloxan-2-yl]oxy}-3,5,7,9,11,13-hexamethyl-1-oxacyclotetradecane-2,10-dione | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఎరిత్రోమైసిన్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | సిరలు, నోటి ద్వారా ఇస్తారు. నవజాత శిశువులో కంటిలో సంక్రమణాలను నివారించడానికి ప్రసవం తర్వాత ఈ కంటి లేపనం సిఫార్సు చేస్తారు. |
MedlinePlus | ఎరిత్రోమైసిన్ |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | A (AU) B (US) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) |
Routes | సిరల ద్వారా, నోటి ద్వారా ఇస్తారు. కంటి లేపనం మామూలుగా సిఫార్సు చేస్తారు. |
Pharmacokinetic data | |
Bioavailability | 30% - 65% మధ్య ఈస్టర్ రకంపై ఆధారపడి ఉంటుంది |
Protein binding | 90% |
మెటాబాలిజం | కాలేయం (5% కంటే తక్కువ విసర్జించబడుతుంది) |
అర్థ జీవిత కాలం | 1.5 గంటలు |
Excretion | Bile |
Identifiers | |
ATC code | ? |
Chemical data | |
Formula | C37H67NO13 |
| |
| |
(what is this?) (verify) |
సాధారణ దుష్ప్రభావాలలో కడుపు తిమ్మిరి, వాంతులు, అతిసారం ఉంటాయి. మరింత తీవ్రమైన దుష్ప్రభావాలలో క్లోస్ట్రిడియం డిఫిసిల్ పెద్దప్రేగు శోథ, కాలేయ సమస్యలు, దీర్ఘకాలిక QT అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు. పెన్సిలిన్ అలెర్జీ ఉన్నవారిలో కూడా దీనిని సాధారణంగా సురక్షితంగా ఉపయోగిస్తారు[1]. ఎరిత్రోమైసిన్ గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి సురక్షితంఅని భావిస్తున్నారు[4]. సాధారణంగా తల్లిపాలను ఇచ్చే సమయంలో కూడా సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ, మొదటి రెండు వారాలలో తల్లికి దీనిని ఉపయోగించడం వలన శిశువులో పైలోరిక్ స్టెనోసిస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది[5]. ఈ వయస్సులో శిశువుకి నేరుగా ఇస్తే కూడా ఈ ప్రమాదం ఏర్పడుతుంది. ఇది యాంటీబయాటిక్స్ మాక్రోలైడ్ కుటుంబంలో ఉంది. ఇది బ్యాక్టీరియా ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది[1].
ఎరిత్రోమైసిన్ మొట్టమొదట 1952 లో సాక్కరోపోలిస్పోరా ఎరిత్రియా అనే బ్యాక్టీరియా నుండి వేరుచేసారు[1][6]. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన ఔషధాల జాబితాలో క్లారిథ్రోమైసిన్ కు ప్రత్యామ్నాయంగా ఉంది[7]. ఇది సాధారణ ఔషధంగా లభిస్తుంది. ఎక్కువ ఖరీదైనది కాదు. [5]. 2017 లో, ఇది అమెరికాలో రెండు మిలియన్లకు పైగా ప్రిస్క్రిప్షన్లతో ఈ ఔషధం 215వ అత్యంత సాధారణంగా సూచించబడింది[8][9].
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Erythromycin". The American Society of Health-System Pharmacists. Archived from the original on 2015-09-06. Retrieved Aug 1, 2015.
- ↑ . "Clinical guideline: management of gastroparesis".
- ↑ . "Treatment and prevention of ophthalmia neonatorum".
- ↑ "Prescribing medicines in pregnancy database". Australian Government. August 23, 2015. Archived from the original on April 8, 2014.
- ↑ 5.0 5.1 Hamilton, Richard J. (2013). Tarascon pocket pharmacopoeia (2013 delux lab-coat ed., 14th ed.). [Sudbury, Mass.]: Jones & Bartlett Learning. p. 72. ISBN 9781449673611. Archived from the original on 2020-08-01. Retrieved 2017-09-09.
- ↑ Vedas, J. C. (2000). Biosynthesis : polyketides and vitamins. Berlin [u.a.]: Springer. p. 52. ISBN 9783540669692. Archived from the original on 2020-08-01. Retrieved 2017-09-09.
- ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
- ↑ "The Top 300 of 2020". ClinCalc. Archived from the original on 12 February 2021. Retrieved 11 April 2020.
- ↑ "Erythromycin - Drug Usage Statistics". ClinCalc. Archived from the original on 30 March 2020. Retrieved 11 April 2020.