ఎర్త్ అవర్
ఎర్త్ అవర్ (ఆంగ్లం: Earth Hour) అనేది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.[1]
ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు.. వగైరా కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మార్చి మాసంలోని చివరి శనివారం (ఈ 2016లో మూడవ శనివారం అని గమనించండి) రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటూ ఇప్పటికి ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు.[2]
2022లో మార్చి 26న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు జరుపుకునే ఎర్త్ అవర్ గురించిన పూర్తి వివరాల కోసం https://www.earthhour.org/ను[permanent dead link] చూడవచ్చు.
చరిత్ర
మార్చు2004లో, శాస్త్రీయ అన్వేషణలను ఎదుర్కొన్న WWF ఆస్ట్రేలియా వారు "వాతావరణ మార్పుల సమస్యపై ఆస్ట్రేలియన్లలో ఆలోచనలను రేకెత్తించడానికి" ప్రకటనల ఏజెన్సీ లియో బర్నెట్ సిడ్నీతో సమావేశమైంది.[3] పెద్ద ఎత్తున స్విచ్ ఆఫ్ చెయ్యాలనే ఆలోచనను "ది బిగ్ ఫ్లిక్" పేరుతో 2006లో అభివృద్ధి చేసారు. WWF ఆస్ట్రేలియా తమ భావనను ఫెయిర్‌ఫాక్స్ మీడియాకు అందించింది. వారు సిడ్నీ లార్డ్ మేయర్ క్లోవర్ మూర్‌తో కలిసి ఈ ఈవెంట్‌కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు.[3] 2007 ఎర్త్ అవర్ మార్చి 31న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరిగింది.
2007 అక్టోబరులో, సిడ్నీ ఎర్త్ అవర్ స్ఫూర్తితో శాన్ ఫ్రాన్సిస్కో కూడా "లైట్స్ అవుట్" కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్టోబరులో ఈ ఈవెంట్ విజయవంతమైన తర్వాత నిర్వాహకులు, 2008 మార్చిలో ఎర్త్ అవర్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.[4]
ఆ తరువాత జరిగిన ఎర్త్ అవర్ల వివరాలు ఇవి:
2022 - Shape Our Future
2021 - Climate Change to Save Earth
2020 - Climate Action and Sustainable Development
1919 - #Connect2Earth
1918 - Biodiversity
2017 - Our Choice for the Plane
2016 - Shine a Light on Climate Action
2015 - Change Climate Change
2014 - Use Your Power to Make Change a Reality
2013 - I Will if You Will
2012 - I Will if You Will
2011 - Go Beyond the Hour
2010 - The power of individual action for a sustainable future
2009 - Vote Earth
2008 - We’ve Turned the Lights Out. Now it’s Your Turn
ఇవీ చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "26న ఎర్త్ అవర్ పాటించండి: గవర్నర్ బిశ్వభూషణ్". andhrajyothy. 2022-03-25. Archived from the original on 2022-03-26. Retrieved 2022-03-26.
- ↑ "earth hour - Google Search". www.google.com. Retrieved 2022-03-26.
- ↑ 3.0 3.1 "history". Earth Hour. Archived from the original on March 27, 2012. Retrieved March 31, 2012.
- ↑ "Moving forward | Lights Out San Francisco". Lightsoutsf.org. October 24, 2007. Retrieved September 30, 2013.