ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రకృతి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3] సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు.[4]

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
World Meteorological day flag created by Isa Khan.
ప్రాముఖ్యతపర్యావరణ పరిరక్షణకు మద్దతు
ప్రారంభం1950
జరుపుకొనే రోజుమార్చి 23
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రారంభం

మార్చు

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్ణయించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపబడుతుంది.[5]

కార్యక్రమాలు

మార్చు
  1. వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయి.
  2. వాతావరణ పరిశోధన చేసిన వాళ్ళకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హో వైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్-మమ్ అంతర్జాతీయ అవార్డు లు బహుమతులు అందజేయబడుతాయి.
  3. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా దేశాలు తపాలా బిళ్ళలను, ప్రత్యేక తపాలా స్టాంపు గుర్తులను విడుదల చేస్తాయి.[6][7]

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Who we are". World Meteorological Organization (in ఇంగ్లీష్). 2 December 2015. Archived from the original on 5 మార్చి 2020. Retrieved 23 March 2020.
  2. "World Meteorological Day". www.newvision.co.ug. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 23 March 2020.
  3. Hartston, William (23 March 2017). "Top 10 facts about meteorology". Express.co.uk (in ఇంగ్లీష్). Retrieved 23 March 2020.
  4. "World Meteorological Organization (WMO)". World Meteorological Organization (in ఇంగ్లీష్). 2 December 2016. Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 24 March 2020.
  5. ఈనాడు, యాదాద్రి భువనగిరి (23 March 2020). "వింతావరణం.. మనమే కారణం". www.eenadu.net. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
  6. "World Meteorological Day". World Meteorological Day (in ఇంగ్లీష్). 2 December 2017. Retrieved 23 March 2020.
  7. "wmo-2018-calendar-competition". World Meteorological Day (in ఇంగ్లీష్). 2 December 2017. Retrieved 23 March 2020.

ఇతర లంకెలు

మార్చు