ఎర్ర కలబంద
పరిచయము
మార్చుఎర్ర కలబంద (Red Aloe) అనేది Ascent of sap అనే కృత్రిమ రసాయనిక పద్ధతి ద్వారా ప్రయోగశాలలో ఎర్రగా మార్చబడిన మామూలు అలో వెరా మొక్క.
Ascent of sap ప్రక్రియ
మార్చుకాలేజీలలోనూ, ప్రయోగశాలల్లోనూ ఈ ప్రయోగం జరుపుతారు. ముందుగా కలబందలో ఉన్న నీటిని చేరవేసే Xylem కణాల ద్వారా ఇయోసిన్ (Eosin) అనే ఎర్రటి రసాయనాన్ని కలబందలోకి పంపిస్తారు. కొన్ని గంటల తర్వాత కలబందలో ఉన్న ప్రతి కణానికి ఈ రసాయనం ప్రవేశిస్తుంది. ఫలితంగా క్లోరోఫిల్ నాశనమయ్యి, కణాలు బ్రద్దలయ్యి ఆకులు, కాండం, వేర్లు అన్నీ ఎర్రగా మారిపోతాయి. అయితే ఇలా మార్చబడిన మొక్క బ్రతికే అవకాశం లేక క్రమేణా చనిపోతుంది.
పుకార్లు
మార్చుతయారీదారులు ఇలా కలబందలను రహస్యంగా తయారుచేసి, వాటికి 'ఎర్ర కలబంద' అని పేరు పెట్టి మధ్యవర్తులకు ఇచ్చి మార్కెటింగ్ చేయిస్తున్నారు. మధ్యవర్తులు ఈ మొక్కల కాండాలకు మట్టిని అంటించి - ఎర్రకలబంద మొక్కలు చాలా అరుదుగా దట్టమైన నల్లమల అడవుల్లో దొరుకుతున్నాయని వినియోగదారులను నమ్మంచి వారికి అమ్మి కేజీ లక్ష రూపాయలకు చొప్పున వసూలు చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. ఎర్ర కలబంద మామూలు కలబంద కంటే చాలా శక్తివంత మైన ఔషధ విలువలున్నాయని, మంత్రశక్తులున్నాయని వినియోగదారులు విశ్వసిస్తున్నారు. ఈ పుకార్లు దాదాపు దేశమంతటా ప్రాకినది. ఎర్ర కలబంద అనే లేని మొక్క గురించి చాలా మంది తమ డబ్బును భారీగా ఖర్చు పెట్టి అడవులలో అన్వేషణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఈ మొక్కలను కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించలేదు.
కొన్ని వాస్తవాలు
మార్చు- నీరు లభ్యం కాని సమయాల్లో కలబంద ఆకుల్లో క్లోరోఫిల్ (Chrophyill) నాశనమయ్యి ఆ ప్రదేశాల్లో రోఢోక్సాన్థిన్ (Rhodoxanthin) అనే ఎర్రటి పిగ్మెంట్ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆకు ఎర్రగా తయారవుతుంది. నీరు లభ్యమైనప్పుడు క్లోరోఫిల్ ఏర్పడుట వలన ఆ ఎర్రటి పిగ్మెంట్ ప్రదేశంలో తిరిగి ఆకుపచ్చ రంగు వస్తుంది. ఈ లక్షణం చాలా కలబంద రకాల్లో ఉంటుంది.
- కలబంద యొక్క ఔషధ గుణాలు అందులో ఉండే ఎమినో యాసిడ్లు, పోలీసాకరైడ్లు, జెల్ చేదు తనాన్ని బట్టి అంచనా వేయబడుతుంది కాని ఎరుపు రంగును బట్టిని కాదు.
- Eosin ను కలబందలోకి వెళ్ళినప్పుడు ఔషధ గుణాలు నాశనమౌతాయి.
- Eosin విషపూరితమైన ద్రావకము. కనుకు ఇది కలిగియున్న కలబంద యొక్క జెల్ ను సేవించరాదు.
- సర్వ సాధారణంగా ఏ రకమైన కలబందయొక్క జెల్ అయినా లేత పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది.
- కలబంద జాతుల జన్మస్థానం భారతదేశం కాదు. భారత దేశానికి కలబందను పరిచయం చేసినవారు ఈజిప్టు దేశస్తులు.
ఈ మొక్క గురించి మూఢ నమ్మకాలు
మార్చు- ఎర్ర కలబంద చనిపోయిన వారిని బ్రతికించగలదు
- దెయ్యాలు, భూతాలు ఈ మొక్కను చూస్తే పారిపోతాయి
- ఈ కలబంద ఆకులోకి రాగి తీగను గుచ్చినప్పుడు, కాస్సేపటికి రాగితీగ తానంతట తానే తెగిపోతుంది.
- ఎర్రకలబంద ఆకులు, కాండము, వేళ్ళు, జెల్ రక్తం రంగులో ఉంటుంది
- ఎర్రకలబంద దుర్గ పూజలో వాడతారు
- ఎర్రకలబంద అత్యంత ఖరీదైన మొక్క
- ఎర్రకలబందను పరుసవేది (Alchemy) లో వాడతారు
లింకులు
మార్చు- http://en.wikipedia.org/wiki/Red_Aloe_(Rumor)
- http://plantcellbiology.masters.grkraj.org/html/Plant_Cellular_Physiology5-Trans[permanent dead link] location_Of_Water_And_Nutrients.htm
- http://www.tutorvista.com/content/biology/biology-iv/plant-water-relations/ascen[permanent dead link] t-sap-theories.php
- http://en.wikipedia.org/wiki/Xylem
- http://en.wikipedia.org/wiki/Ascent_of_sap