ఎర్ర మట్టి (1989 సినిమా)
ఎర్ర మట్టి 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నవతరం ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మాదాల రంగారావు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మాదాల రంగారావు, రూప ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి పార్థసారధి సంగీతాన్నందించాడు.[1]
ఎర్ర మట్టి (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | కె.వి.మహదేవన్ |
---|---|
నిర్మాణ సంస్థ | నవతరం ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మాదాల రంగారావు
- రూప
- ప్రభాకరరెడ్డి
- వీరభద్రరావు
- జయప్రకాష్
- నర్రా వెంకటేశ్వరరావు
- ఎం.పి.ప్రసాద్
- పరమానందం
- లక్ష్మీప్రియ
- వాణి
- కావ్య
- జయశీల
సాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ధవళ సత్యం
- నిర్మాత: మాదాల రంగారావు
- సంగీతం: పార్థసారధి
- సంభాషణలు: ఎం.జి.రామారావు
- పాటలు: కొసరాజు, డి.వివి.ఎస్.వర్మ, ధవళ సత్యం
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: ఆర్.రామారావు
- కూర్పు: చౌదరి సుబ్బారావు
- పోరాటాలు: లంకా వెంకటేశ్వరరావు
- కళ: హనుమంతరావు
- కొరియాగ్రఫీ: శేషు
- పబ్లిసిటీ డిజైన్స్: లంకా భాస్కర్
- నిర్మాణ సంస్థ: నవతరం ఆర్ట్ పిక్చర్స్
- విడుదల తేదీ: 1989 జూలై 14
సమీక్ష
మార్చుపల్లెల్లో భూకామందులు, పట్నాలలో అక్రమార్జనాపరుల పైనే ప్రభుత్వం ఆధారపడి నడుస్తుంది కనుక నోరు విప్పదు. అధికారులు వారి చేతి కీలుబొమ్మలు. ప్రజలు నిస్సహాయులు. కనుకనే వారు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అటువంటి ఓ భూ బకాసురుని చరిత్రనే "ఎర్రమట్టి" చిత్రంలో చక్కగా వివరించారు.
భూపతిపురంలో భూస్వామి భూపతి ప్రభుత్వ బంజరునంతా స్వాధీనం చేసుకొని, గ్రామాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరయినా ఎదురు మాట్లాడితే వాడిపని సరి.అలా ఎదిరించి బంజరుపై ఆశపడిన రైతుకూలి సూరన్నని భూపతి ఖతం చేస్తాడు.
సూరన్న కొడుకు వీరన్న పెరిగి పెద్దవాడవుతాడు. కండబలం, గుండెబలం ఉన్నా తల్లి మాటకి కట్టుబడి రైతన్న రామయ్య ఇంట పాలేరుగా పనిచేస్తుంటాడు. భూపతికి, అతని బావమరిది రామయ్యకి చుక్కెదురు.
చిన్ననాటి నుండి వీరన్నపై మనసు పెంచుకున్న రామయ్య కూతురు సుశీల పట్నం చదువు పూర్తి చేసుకొని పల్లె చేరుతుంది. వీరన్నని తోడు నీడగా వెన్నంటి ఉంటుంది.
భూపతి ప్రియురాలు చిలకమ్మ వీరన్నపై మాంసు పడుతుంది. అతడు తిరస్కరిస్తాడు. దానితో భూపతి ద్వారా ప్రతీకారం తీర్చుకోబోతుంది. అప్పటికే భూపతి ఆగ్రహానికి ఎందరో బలి అవడాం చూసిన వీరన్నలో వీరావేశం ఉప్పొంగుతుంది.
చిత్రం ముగింపు కొంత విచిత్రంగానే ఉంటుంది.
ఈ చిత్రంలో విప్లవంతో పాటు సెంటిమెంట్, ప్రేమ, హాస్యం, పోరాటాలు కూడా చోటుచేసుకున్నాయి.
తహసీల్దరుపై చెప్పిన బుర్రకథ చిత్రానికే ఒక ప్రత్యేకత[2]
పాటల జాబితా
మార్చు1: ఎంది చిలకమ్మ , రచన: ధవళ సత్యం, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
2: ఓ రామన్న ఓ లచ్చన్న , రచన: ధవళ సత్యం, గానం.శ్రీనివాస్, ఎస్ పి శైలజ బృందం
3: వీరులెందరో ఒరిగినారు , రచన: డీ వి.ఎస్.వర్మ , గానం.శ్రీనివాస్, ఎస్ పి శైలజ కోరస్
4: సుబ్బన్న చెప్పందన్న , రచన: కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
5: తందానా తాని తందాన(బుర్రకథ) రచన: కొసరాజు , గానం.శ్రీనివాస్ బృందం.
మూలాలు
మార్చు- ↑ "Erra Matti (1989)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.
3. కొల్లూరి భాస్కరరావు ,ఘంటసాల గళామృతమ్ నుండి పాటలు.