ఎల్లాప్రగడ సీతాకుమారి
ఎల్లాప్రగడ సీతాకుమారి కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు.[1][2]
జీవిత విశేషాలు
మార్చుఆమె జనవరి 1 1911 న బాపట్లలో జన్మించారు. ఆమె హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు.సికింద్రాబాద్ కీస్ బాలికా విద్యాలయంలో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగం చేసారు.[3] ఆమె తన భర్త నారాయణరావుతో కలిసి 1926లో హైదరాబాదుకు తరలి వచ్చారు. నారాయణరావు హైదరాబాదులో ”ఆంధ్రా బుక్ హౌజ్” పేరుతో తెలుగు పుస్తకాల దుకాణాన్ని నడిపేవారు. అప్పటినుంచి ఆమె జీవితం ఇక్కడి తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.మద్రాసు యూనివర్సిటీ నుండి తెలుగు, సంస్కృత భాషలలో విద్వాన్ డిప్లోమా డిగ్రీలు పొందారు. 1946 నుండి 1956 వరకు సికింద్రాబాదు కీస్ హైస్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేసారు.
జాతీయ్యమంలో
మార్చుసీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రమహిళా సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్రమహిళా సభలకు అధ్యక్షతా స్థానాన్ని అలంకరించారు.[4] జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం, ప్రచారం విస్తృతంగా చేశారు. 1934నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ లో ఆంధ్ర యువతీ మండలి స్థాపనలో భాగస్వాములయ్యారు ."ఆంధ్ర" అనే మాటను తెలంగాణా ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేయటానికి విస్తృత ప్రయత్నం చేశారు. చిక్కడ పల్లి "ప్రమదావనం" స్తాపకురాలై ప్రమదల సేవలో చొరవ చూపారు . 1930లో యల్లాప్రగడ సీతాకుమారి కాంగ్రెస్లో చేరి కార్యకర్తగా ఎంతగానో కృషి చేసారు. 1934లో ఖమ్మం మెట్టులో ఏర్పాటైన నిజాం రాష్ట్ర ఆంధ్ర మహిళాసభకు ఆవిడ అధ్యక్షురాలు. ఏడాది పసిపిల్లను చంకనపెట్టుకుని ఆవిడ వేదికపై సాంఘిక దురాచారాలను గురించి, సనాతన స్త్రీ చిరోధక దురాచారాల గురించి చేసిన ఉపన్యాసం అందరిని ఆశ్చర్య చకితుల్ని చేసింది. అతి బాల్య వివాహాలను గురించీ, ఘోషాపద్ధతి నిర్మూలన గురించి, వితంతు వివాహాల గురించి సభలో ప్రవేశపెట్టిన తీర్మానాలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి
ఆనాటి హైదరాబాదులో ఘోషా పద్ధతి అమలులో ఉండేది. స్త్రీలు కాలినడకన వీధులలో తిరుగుటయే అరుదు. అటువంటి కాలంలో శ్రీ మాడపాటి హనుమంతరావుగారి ప్రోత్సాహంతో వారి సతీమణి మాణిక్యమ్మ, పందిటి వీరరాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ, వడ్లకొండ వెంకమ్మ నడింపల్లి వారింట సోదరీసమాజాన్ని స్థాపించారు
స్త్రీ విద్య, మహిళా స్వాతంత్ర్యం, వరకట్న నిషేధం, వితంతు వివాహం మొదలైన విషయాలపై తీవ్ర కృషి చేశారు . నిజాం నిరంకుశ పాలనలో "అక్కిరెడ్డిపల్లి" గ్రామంలో జరిగిన స్త్రీ ల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘంలో సభ్యురాలైనారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్త్రీలకు ధైర్యం చెప్పారు సీతాదేవి. అనాథలకు వితంతువులకు భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలను ఏకీకృతం చేసి విశాలాంధ్ర ఏర్పడాలంటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి పోటీలేకుండా 1957లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రులకు సంబంధించిన అన్ని ఉద్యమాలలో ముందు ఉండి నడిపించారు. సాంఘిక, రాజకీయ, సారస్వత రంగాలలో విశేషంగా కృషి చేశారు. తెలంగాణా ఆంధ్రోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. స్త్రీల కోసం "ఆంధ్ర సోదరీ సమాజము" స్థాపించారు. ఇదే తర్వాతికాలంలో "ఆంధ్ర యువతీ మండలి"గా రూపుదిద్దుకొంది. ఇదేగాక ప్రత్యేకంగా తెలంగాణా మహిళా సమితిని కూడా నడిపారు. నిజాం రాష్ట్ర విమోచనానంతరం, విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత 1957లో ఆమె "బాన్సువాడా" నుంచి పోటీ లేకుండా రాష్ట్ర శాసనసభా సభ్యులుగా ఎన్నికైనారు.
రచయితగా
మార్చు- గృహలక్ష్మి
- భారతి
- ఉజ్జ్వలనారి -ఖండికల సంపుటి
- కోడికుంపటి (నాటిక)
- కొత్తబడి (నాటిక)
- మంచు కొండల్లో మహిళాసభ
- నేనూ-మా బాపూ
- 1968లో సంకలనం చేసిన "మందారమాల" అనే వ్యాసమాల విశ్వవిద్యాలయ విద్యార్థులకు పఠనీయగ్రంథంగా ఉంది.
కథలు
మార్చు- పునిస్త్రీ పునర్వివాహం – ఆంధ్రప్రతిక – ఈశ్వర సంవత్సరాది 1937
- ”ఈ రాధేనా?” – భారతి – 1938 జూలై
- ఆ వీణ – ఆంధ్రకేసరి – 1940
మూలాలు
మార్చు- ↑ కాసం, ప్రవీణ్ (10 November 2018). "'ఆమె'కు ఎందుకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు?". బిబిసి తెలుగు. Archived from the original on 3 December 2018. Retrieved 3 December 2018.
- ↑ "1957 ఎన్నికలలో ఫలితాలు". Archived from the original on 2014-04-10. Retrieved 2015-07-22.
- ↑ స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి
- ↑ "తొలి తరం తెలంగాణ మహిళా కథకులు". Archived from the original on 2017-10-28. Retrieved 2015-07-22.