ఎల్లి (నవల)

అరుణ రాసిన తెలుగు నవల

ఎల్లి అన్నది అరుణ రాసిన తెలుగు నవల. మొదటి భాగం 1992 లోను, రెండవ భాగం 1996 లోనూ ప్రచురితమయ్యాయి. నిమ్నజాతులవారి జీవితాన్ని గూర్చి తెలుగులో వచ్చిన నవలలు తక్కువ. అలాంటి నవలల్లో ఎల్లి ఒకటి. ఎరుకలవారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, కష్టాలు కడగళ్ళూ శ్రీమతి అరుణ రచించిన ఎల్లి నవలలో ఉన్నాయి

కథా సంగ్రహం మార్చు

కృష్ణాజిల్లాలో వన్నెట్టి ఒడ్డున పందులు మేపుకొని బతికే ఎరుకల జీవిత గాథ ఎల్లి. ఎరుకలు పందులు మేపటంతోపాటు బుట్టలు, చాపలు అల్లటం, చింత చిగురుకోసి అమ్ముకోవడం కూడా చేస్తుంటారు. వాళ్ళ గూడెంలో అందరివీ పూరి గుడిసెలే. ఎవరూ స్థితిమంతులు లేరు. కన్యాశుల్కం, వరకట్నం రెండూ దురాచారాలే. కొన్ని కులాలలో మారు మనువు ఆచారం ఉండటం నయమని స్త్రీని వితంతు బాధనుండి రక్షిస్తుందని విద్యావంతులలో ఒక అపోహ ప్రబలంగా ఉంది. ఎల్లి చదివిన వారికీ నిమ్న జాతులలో స్త్రీ స్వేచ్ఛ ఎంత బూటకమో తేటతెల్లమవుతుంది. ఎరుకలలో ఆడపిల్ల తండ్రి పెళ్ళి కొడుకు దగ్గర ఓలి తీసుకుని పిల్ల పెళ్ళి చేస్తాడు. మనువాడిన మగడు ఆలిని మరొకరికి అమ్మితే ఆమె రెండవవాడి వెంట వెళ్ళవలసిందే. మొదటి భర్తకు కలిగిన సంతానాన్ని తనతో తీసుకు వెళ్ళటానికి వీలులేదు. బతికినంతకాలమూ తల్లీబిడ్డలు ఒకరినొకరు తలచుకొని కుమిలి పోవలిసిందే. అటువంటి హృదయవిదారక సన్నివేశాలు సమాహారమే ఎల్లి నవల

ప్రచురణ మార్చు

అరుణ రాసిన ఎల్లి 1992 నవంబరులో తొలిసారి అచ్చయింది. నీలితో కలిపి 1996 ఆగస్టులో ఈ పుస్తకం వెలువడింది.