ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (ఆంగ్లం:The L V Prasad Eye Institute (LVPEI) 1987లో హైదరాబాదులో స్థాపించబడింది.[1] ఇది లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర నేత్ర వైద్యశాల. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన , సమర్థవంతమైన కంటి సంరక్షణ LVPEI సంస్థ యొక్క లక్ష్యం. ఈ సంస్థ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ద్వారా స్థాపించబడింది. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి | |
---|---|
భౌగోళికం | |
స్థానం | ఎల్.వి.ప్రసాద్ మార్గ్, బంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
నిర్దేశాంకాలు | 17°25′29″N 78°25′39″E / 17.424643°N 78.427513°E |
వ్యవస్థ | |
రకాలు | స్పెషలిస్టు |
Services | |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1987 |
లింకులు | |
వెబ్‌సైటు | http://www.lvpei.org |
వ్యవస్థాపన
మార్చుప్రముఖ భారతీయ చలన చిత్ర నిర్మాత ఎల్. వి. ప్రసాద్ ఈ నేత్ర వైద్యశాల స్థాపన కొరకు బంజారా హిల్స్లో 10 మిలియన్ల రూపాయల ధనం, 5 ఎకరాల స్థలం దానం చేసాడు.[2] ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆ సంస్థకు ఆయన పేరును ఆ సంస్థ పేరు ముందు ఉంచారు.
ఆపరేషన్ యొక్క క్రియాశీల ప్రాంతాలు
మార్చువైద్య సేవలు
మార్చుLVPEI సుమారు 23.8 మిలియన్ల ప్రజలకు తన సేవలనందించింది. అందులో 50% ఉచితంగా, సంక్లిష్టతతో సంబంధం లేకుండా అవసరమైన వైద్యాన్ని అందించింది.[3]
పరిశోధనలు
మార్చు2012 జూన్ 1 న, LVPEI పరిశోధన అధిపతి ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ చెప్పిన ప్రకారం జన్యు కణజాల లోపాలను సరిచేయడానికి జన్యు చికిత్స ఉంది, కంటికి జన్యు డెలివరీ 1-2 సంవత్సరాలలో జరుగుతుంది[4]
కేంద్రాలు
మార్చుLVPEI నెట్‌వర్క్:[3]
- బంజరా హిల్స్ లో ప్రదాన కేంద్రం, డా. రెడ్డి లాబ్స్ వ్యవస్థాపకుడు కల్లం అంజిరెడ్డి తరువాత పేరుపెట్టబడింది.
- 16 మాధ్యమిక కేంద్రాలు
- 160 ప్రాథమిక సంరక్షణా కేంద్రాలు
- జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
మాధ్యమిక, ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు వైద్య సేవలను దేశ వ్యాప్తంగా గ్రామీన ప్రాంతాలకు అందిస్తాయి.
ఐ బ్యాంకులు
మార్చుThe RIEB set up the Hyderabad Cornea Preservation Medium Centre which uses a McKarey Kauffman (MK) Medium.[5]
మూలాలు
మార్చు- ↑ Khan, Arshia (30 December 2011). "Dr Gullapalli N Rao: Unwinding the reserved and rigorous". ModernMedicare.co.in. Archived from the original on 11 జూలై 2012. Retrieved 28 January 2012.
- ↑ ABN Telugu (2017-10-30), Gullapalli Nageswara Rao About Sr NTR And LV Prasad Eye Institute | Open Heart With RK | ABN, retrieved 2018-01-11
- ↑ 3.0 3.1 "About L V Prasad Eye Institute - LV Prasad Eye Institute". L V Prasad Eye Institute (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2018-01-12. Retrieved 2018-01-11.
- ↑ "Research on gene therapy by Prasad Eye". 1 June 2012.
- ↑ "RIEB of LV Prasad Eye Institute gets award from International Federation of Eye Banks". saffron.pharmabiz.com. Archived from the original on 14 జూలై 2012. Retrieved 28 January 2012.