ఎస్పీ హిందుజా
శ్రీచంద్ పర్మానంద్ హిందూజా (1935 నవంబరు 28 - 2023 మే 17) భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ బిలియనీర్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు. ఆయన హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ప్రాథమిక వాటాదారు, ఛైర్మన్. ఆగస్ట్ 2022 నాటికి, అతని సోదరుడు గోపీచంద్ హిందుజాతో కలిసి, అతను యూకెలో అత్యంత ధనవంతుడు.[1] 1990ల నుండి, అతను యూకె, ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకడు.
ఎస్. పి. హిందూజా | |
---|---|
జననం | కరాచీ, సింధ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్) | 1935 నవంబరు 28
మరణం | 2023 మే 17 | (వయసు 87)
జాతీయత | బ్రిటీష్ పౌరసత్వం |
విద్య | దావర్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆర్. డి. నేషనల్ కాలేజ్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఛైర్మన్, హిందూజా గ్రూప్ |
జీవిత భాగస్వామి | మధు హిందూజా (died 2023) |
పిల్లలు | 3, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (మరణించాడు) |
తల్లిదండ్రులు | పర్మానంద్ దీప్‌చంద్ హిందూజా జమున పర్మానంద్ హిందూజా |
బంధువులు | గోపీచంద్ హిందూజా, ప్రకాష్ హిందూజా (సోదరులు) కరమ్ హిందూజా (మనవడు) ధీరజ్ హిందూజా (మేనల్లుడు) |
2022లో హిందుజా సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో £28.472 బిలియన్ స్టెర్లింగ్ సంపదతో అగ్రస్థానంలో ఉంది. ఆసియా మీడియా & మార్కెటింగ్ గ్రూప్ సంకలనం చేసిన సంపన్నుల జాబితా ఆధారంగా, హిందూజా సంపద £25.2 బిలియన్ (US$31.7 బిలియన్)గా అంచనా వేయబడింది.[2] మార్చి 2019లో ఫోర్బ్స్ జాబితా అతను, అతని సోదరుడు గోపీచంద్ హిందుజా $16.9 బిలియన్ల సంపదతో ప్రపంచంలోని 65వ అత్యంత సంపన్న బిలియనీర్ కుటుంబంగా ర్యాంక్ ఇచ్చింది.[3]
బాల్యం, విద్యభ్యాసం
మార్చుఆయన 1935 నవంబరు 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో జన్మించాడు. ఆయన పర్మానంద్ దీప్‌చంద్ హిందూజా, జమున పర్మానంద్ హిందూజాల రెండవ కుమారుడు.[4][5] ఆయన ముంబైలోని దావర్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆర్. డి. నేషనల్ కాలేజీలో చదువుకున్నాడు.[5]
ఆయన తమ్ముళ్లు గోపీచంద్, ప్రకాష్, అశోక్‌లతో పాటు ఆయన భారతదేశపు ఫ్యాబ్ ఫోర్ పితృస్వామ్యంగా గుర్తించబడింది.[6]
కెరీర్
మార్చుఆయన దేశంలోని ముంబై, పహ్లావి ఇరాన్‌లోని టెహ్రాన్‌లో తన తండ్రి వస్త్ర వ్యాపారాలలో తన వృత్తిని ప్రారంభించాడు.[7] అలాగే ఆయన ప్రారంభ దశలో విజయవంతమైన వ్యాపారాలలో భారతదేశం నుండి ఇరాన్కు ఆహార వస్తువులైన ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు ఇనుప ఖనిజం అమ్మకం ఉన్నాయి.[8]
ఆయన వ్యాపార సామ్రాజ్యం చమురు & గ్యాస్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, ఐటీ నుండి రియల్ ఎస్టేట్, ఎనర్జీ & కెమికల్స్, పవర్, మీడియా & వినోదం వరకు విభిన్న వ్యాపార రంగాలలో విస్తరించింది.[9][10]
వ్యక్తిగత జీవితం
మార్చుఆయన మధు శ్రీచంద్ హిందూజాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[11] ఒక కుమార్తె, వినూ శ్రీచంద్ హిందూజా ముంబైలోని పి.డి. హిందూజా నేషనల్ హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఉంది.[12][13]
1992 మే 19న, వారి ఏకైక కుమారుడు, ధరమ్ హిందుజా, మారిషస్‌లో మరణించాడు.[14][15] ఎస్పీ హిందుజా భార్య, మధు, జనవరి 2023లో మరణించింది.[16]
మరణం
మార్చు87 ఏళ్ల శ్రీచంద్ పర్మానంద్ హిందూజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2023 మే 17న లండన్లో లెవీ బాడీ డిమెన్షియా సమస్యలతో తుదిశ్వాస విడిచాడు.[17][18][19]
మూలాలు
మార్చు- ↑ "The Sunday Times Rich List 2022". hetimes.co.uk. Retrieved 2023-05-17.
- ↑ Andrew Bounds (22 March 2013). "Mittal loses top spot in rich list". Business & Economy. The Financial Times Ltd. Archived from the original on 4 మార్చి 2023. Retrieved 20 June 2015.
- ↑ "Srichand & Gopichand Hinduja". Forbes. Archived from the original on 7 March 2013.
- ↑ "SP's USP: Family First, Biz Later". The Times of India. 12 February 2011. Archived from the original on 3 January 2013. Retrieved 21 August 2012.
- ↑ 5.0 5.1 Europa Publications (2003). The International Who's Who 2004. Psychology Press. p. 733. ISBN 978-1-85743-217-6.
- ↑ "SP's USP: Family First, Biz Later – The Times of India". Timesofindia.indiatimes.com. 12 February 2011. Retrieved 21 August 2012.
- ↑ "The world is their bazaar". Pranaygupte.com. 28 December 1987. Archived from the original on 19 జనవరి 2015. Retrieved 21 August 2012.
- ↑ Cragg, Claudia (1996). The New Maharajahs: The Commercial Princes of India, Pakistan and Bangladesh – Claudia Cragg – Google Books. ISBN 9780712677615.
- ↑ "Hinduja group forms power sector JV with Germany's STEAG – The Times of India". Timesofindia.indiatimes.com. 28 March 2012. Retrieved 21 August 2012.
- ↑ "Hindujas to foray into India's real estate sector". The Asian Age. 22 July 2012. Archived from the original on 1 సెప్టెంబరు 2012. Retrieved 21 August 2012.
- ↑ Palijo, Waseem (8 January 2019). "Most billionaires in India today once resided in Pakistan's Sindh". Daily Times. Archived from the original on 7 May 2020. Retrieved 7 May 2020.
- ↑ "Live To Give Hope". Hindujahospital.com. 1 November 1932. Retrieved 22 May 2016.
- ↑ "Newsletter". Hinduja Group. Retrieved 22 May 2016.
- ↑ "Millionaire's son died in suicide pact with wife". The Independent. 22 October 1992. Retrieved 22 May 2016.
- ↑ "Hinduja heir Dharam fails to cope with family pressures against his wife, ends life". Retrieved 22 May 2016.
- ↑ "Wife of SP Hinduja dies in London". 6 January 2023.
- ↑ "New Delhi: హిందూజా గ్రూప్ చైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజా కన్నుమూత | New Delhi SP Hinduja Head Of Billionaire Hinduja Family Dies bvn". web.archive.org. 2023-05-18. Archived from the original on 2023-05-18. Retrieved 2023-05-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Hinduja Group chairman SP Hinduja passes away in London at 87". Business Today. 17 May 2023. Retrieved 17 May 2023.
- ↑ "SP Hinduja obituary". The Times. 17 May 2023. Retrieved 17 May 2023.