ఎస్.పాండియన్ అగస్టు 2018 నుండి శ్రీహరికోటలో వున్న సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(క్లుప్తంగా షార్) కు నూతన సారధిగా ఎన్నిక అయ్యాడు.[1] ఏ.పాండియన్ నియామకానికి ముందు షార్ కు సారధి(డైరక్టరుగా) పి.కున్నికృష్ణన్ పనిచేసాడు. కున్నికృష్ణన్ 2015 జూన్ లో షార్ డైరెక్టరుగా పదవి భాద్యతలు స్వీకరించారు.జులై 31.2018 నుండి ఎస్.పాండియన్ అయన స్థానంలో డైరెక్టరుగా నియమియులిఅయ్యారు. కున్నికృష్ణన్ బెంగళూరు లోని శాటిలైట్ సెంటరు డైరెక్టరుగా బదిలీ అయ్యాడు.[2]

ఎస్. పాండియన్
జననంఎస్. పాండియన్
నివాస ప్రాంతంతమిళనాడు
వృత్తిశాస్త్రవేత్త
ఉద్యోగండైరెక్టరు. ఇస్రో,శ్రీహరికోట నెల్లూరు
ముందు వారుకున్హిక్రిష్ణన్

ఎస్.పాండియన్ వ్యక్తిగత వివరాలు

మార్చు

పాండియన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు.ఇతను మద్రాసులోని ఐఐటిలో 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగులో బీటెక్ పూర్తి చేసారు.తరువాత బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లొ ఎయిరోస్పేస్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ 1984 లో పూర్తి చేసారు.[2]

వృత్తి వివరాలు

మార్చు

మాస్టరు డిగ్రీ అయ్యిన వెంటనే (1984 లో)ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపిక అయ్యి త్రివేండ్రంలోని వీఎస్‌ఎస్‌సిలో చేరారు.అక్కడె అసోసియేట్ డైరెక్టరుగా వివిధ ప్రాజెక్టులలో పనిచేసారు.రాకెట్ల లో యూరోడైనమిక్ డైజైన్లు రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.చంద్రయాన్-1,మంగళయాన్,ఆకెట్ ప్రయోగలలో కీలక పాత్ర వహించాడరు.2017లో తమిళనాడులోని మహెంద్రగిరిలోని ఇస్రో ఐపీఆర్‌సి డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించాడరు.[2]

అందుకున్న అవార్డులు

మార్చు
  • 2011 లో ఇస్రో మెరిట్ అవార్డు
  • 2012 లోఇస్రో టీం ఎక్స్‌లెన్స్ అవార్డు
  • 2013 లో గ్రాపికల్ సిస్టం డైజైన్ అచీవ్‌మెంట్
  • 2014 లో నేషనల్ ఎయిరోనాటికల్ అవార్డు
  • 2016 లో ఇస్రో ఎక్స్‌లెన్స్ అవార్డు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "షార్ డైరెక్టర్‌గా ఎస్. పాండియన్". andhrabhoomi.net. Archived from the original on 2018-08-02. Retrieved 2018-08-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 అంధ్రజ్యోతి దినపత్రిక 1-08-2018,నెల్లూరు ఎడిసన్