బెంగుళూరు
బెంగుళూరు (కన్నడ: ಬೆಂಗಳೂರು), భారతదేశంలోని మహా నగరాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని.
?బెంగుళూరు ಬೆಂಗಳೂರು కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°ECoordinates: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
741 కి.మీ² (286 sq mi)[1] • 920 మీ (3,018 అడుగులు) |
జిల్లా (లు) | బెంగుళూరు జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత |
52,80,000 (3rd) (2007 నాటికి) • 7,126/కి.మీ² (18,456/చ.మై) |
మేయర్ | సంపత్ రాజ్ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 560 0xx • +91-(0)80 • IN BLR • KA-01; KA-02; KA-03; KA-04; KA-05; KA-41; KA-51; KA-53 |
బెంగుళూరును "హరిత నగరం" (ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతుంది. తద్వారా ఈ నగరంలో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరం" అని కూడా అంటారు. బెంగుళూరు భారతదేశంలో సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. విజయనగర సామ్రాజ్యంనకు చెందిన కేంపె గౌడ అను పాలేగాడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించాడు. ఇతడు ఒక్కలిగ జాతికి చెందిన వ్యక్తి. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠీలు, మొఘల్ ల చేతుల నుండి మైసూరు రాజ్యం క్రిందకు వచ్చింది. బ్రిటీషు వారి కంటోన్మెంటుగా మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీతో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొంది.
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్, రక్షణా దళాలకు బెంగుళూరు కేంద్రం.
పుట్టుకసవరించు
కన్నడలో దీని అసలు పేరు బెంగళూరు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది. ఒక యుధ్ధ వీరుని జ్ఞాపకార్థం పశ్చిమ గంగ వంశీయులు 9 వ శతాబ్దంలో వీరగల్లు అనే ఒక శిలాఫలకం (ವೀರಗಲ್ಲು) చెక్కించిన దాఖలాలు ఉన్నాయి. 890 వ సంవత్సరంలో బేగూరు కోసం యుధ్ధం జరిగిందని దాని పై రాసి ఉంది.
చరిత్రసవరించు
పశ్చిమ గంగ వంశీకులు కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన తరువాత సా.శ. 1024 సంవత్సరంలో చోళ రాజులు చేజిక్కించుకున్నారు. తరువాత 1070లో అధికారం చాళుక్య చోళుల చేతుల్లోకి మారింది. 1116లో హోయసలులు చోళ రాజులను ఓడించి ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
భౌగోళిక పరిస్థితులు , వాతావరణంసవరించు
బెంగుళూరు కర్ణాటకలో ఆగ్నేయ దిశగా, మైసూరు పీఠభూమి మధ్య భాగంలో ఉంటుంది.
16వ శతాబ్దంలో కెంపే గౌడ నగరంలో మంచినీటి అవసరాల కోసం అనేక సరస్సులు తవ్వించాడు. ప్రస్తుతం నగరంలో 80% నీటి అవసరాలు కావేరి జలాల వల్లనే తీరుతున్నాయి. మిగతా 20% తిప్పగొండనహళ్ళి, అర్కావతి నదిపై నిర్మించబడ్డ హేసరగట్ట రిజర్వాయర్ వల్ల తీరుతున్నాయి. బెళ్లందూరు చెరువు కూడా ఒక ముఖ్య నీటి వనరు.
ఆదాయ వనరులుసవరించు
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగుళూరు ప్రధానంగా అనేక సాఫ్ట్వేర్ సంస్థలకు నిలయం. దాదాపు ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఈ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. అంతేకాక భారతదేశంలోకెల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం.
రవాణా సౌకర్యాలుసవరించు
- రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు, ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే కెంపెగౌడ బస్సు స్టేషను నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు నడిపే బస్సులు శాంతినగర్ బస్సు స్టేషను, మైసూరు రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషను, బైయప్పనహళ్లి బస్సుస్టేషనుల నుండి బయలుదేరతాయి[2] ప్రతిరోజు 1,000 కొత్త వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
- రైలు
బెంగుళూరు నగర రైల్వేస్టేషను, యశ్వంతపూర్, కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
- విమాన
అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో 2008 మే 24 న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది.
నగరం వెలుపల రవాణా సౌకర్యంసవరించు
- బస్సు
ఎసి బస్సులు ప్రారంభించిన నగర రవాణా సంస్థలలో ప్రథమస్థానం బిఎమ్టిసికి దక్కింది.బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (BMTC) చే నడపబడే బస్సులు నగరంలో ప్రధాన రవాణా సౌకర్యం. బస్సులో టిక్కెట్టు,రోజువారీ బస్సుపాసు కొనే సదుపాయం ఉంది. విమానాశ్రయానికి, ఇతరప్రదేశాలకు శీతలీకరణ బస్సులు కూడా నడుపుతారు.[3]
- మెట్రో రైలు
నమ్మ మెట్రోగా చెప్పుకునే బెంగుళూరు మెట్రో రైలు 2011 అక్టోబరు 20 నుండి మహాత్మా గాంధీ రోడ్-బయ్యప్పనహళ్ళి మార్గంలో మొదలయింది. ఇది పూర్తిగా విస్తరిస్తే, బెంగుళూరును నిలువు-అడ్డంగా గీత గీస్తే వచ్చే స్థానాలన్నిటినీ కలుపుతుంది.
- ఇతర
మూడు చక్రాల ఆటో రిక్షాలు రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముగ్గురు వరకు ప్రయాణించగల వీటికి మీటరు ప్రకారం రుసుం చెల్లించాలి. టేక్సీలు అనగా సిటీ టేక్సీలు ఫోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఛార్జీలు అటో కంటే ఎక్కువ.[4]
విశేషాలుసవరించు
బెంగుళూరు భారతదేశపు ఉద్యానవనాల నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఉద్యానవనాలు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు ప్రముఖ ఉద్యానవనాలు. బెంగుళూరులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సంస్కృతి, సాంప్రదాయాలుసవరించు
ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.
తెలుగు సంస్థలుసవరించు
దాదాపు 12 పైగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అప్పుడప్పుడు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వాటిలో కొన్ని.
క్రీడలుసవరించు
క్రికెట్ ఇక్కడ బాగా ప్రజాదరణ పొందిన క్రీడ. భారత క్రికెట్ దిగ్గజాలైన గుండప్ప విశ్వనాధ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్ బెంగుళూరుకు చెందిన వారే.
విద్యసవరించు
1909లో ఇక్కడ ప్రారంభించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనా కేంద్రాలలో ఒకటి. ఇంకా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మానసిక ఆరోగ్య కేంద్రమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైనని ప్రధాన విద్యా సంస్థలు.
వాణిజ్య సముదాయాలుసవరించు
- గరుడ మాల్, ఎం.జీ రోడ్
- బెంగుళూరు సెంట్రల్, ఎం.జీ రోడ్
- మంత్రి మాల్, మల్లేశ్వరం
- రాయల్ మీనాక్షి మాల్, బన్నేరు ఘట్ట రోడ్
- ది ఫోరం మాల్, కోరమంగళ ఇంకా వైట్ ఫీల్డ్
- గోపాలన్ మాల్, మైసూర్ రోడ్
- గోపాలన్ ఆర్కేడ్, రాజరాజేశ్వరి నగర్
- బిగ్ బజార్
- సిగ్మా మాల్
- కాస్మోస్, వైట్ ఫీల్డ్
- ఇనార్బిట్ (హైపర్ సిటీ), వైట్ ఫీల్డ్
- యూబీ సిటీ
- ఫీనిక్స్ మాల్, వైట్ ఫీల్డ్
- ఒరాయన్ మాల్, మల్లేశ్వరం
బెంగుళూరులోని షాపింగ్ మాల్ ల చిత్రమాలికసవరించు
భోజనశాలలుసవరించు
- నందిని
- భగిని
- అడిగాస్
- సుఖ్ సాగర్
- కామత్
- నందన
- నాగార్జున
బెంగుళూరులోని రెస్టారెంట్లు/హోటళ్ళ చిత్రమాలికసవరించు
మాధ్యమాలుసవరించు
బెంగుళూరులో మొట్టమొదటి సారిగా 1840లో ప్రింటింగ్ ప్రెస్ ను నెలకొల్పడం జరిగింది. 1955 నవంబరు 2 న బెంగుళూరులో ఆకాశవాణి రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది.
దర్శనీయ స్థలాలుసవరించు
- ఇస్కాన్ టెంపుల్
బెంగుళూరులోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది.[5] మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయించిన స్థలంలో 1990 - 1997ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయింది. అలా పూర్తయిన గుడి అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా 1997 మే 31న ప్రారంభమైంది.
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ధ్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.[6] ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్ అనే ప్రాంతములో ఉంది. అక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
- శివ మందిరం
ఎత్తైన శివుని విగ్రహం ఇచ్చట ఉంది. దీన్ని కెంప్ ఫోర్ట్ అని వ్యవహరిస్తారు. ఇది పాత బెంగుళూరు విమానాశ్రయం రహదారిపై మురుగేశ్ పాళ్యా ప్రాంతములో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 65 అడుగులు. అంతేగాకుండా ఇచ్చట ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి.
- పెద్ద గణేష మందిరం
అతి పెద్ద గణపతి శిలా విగ్రహం ఇక్కడ ఉంది. ఇది ఏక శిలా విగ్రహము. బెంగుళూరు దక్షిణ ప్రాంతములో బసవన గుడి ప్రక్కన ఉంది. బెంగుళూరు సందర్శకులు ఇక్కడికి కూడా వస్తుంటారు.
- బనశంకరి మందిరం
- వాసవీ మందిరం
- మత్స్య నారాయణ దేవాలయం
- దొడ్డ బసవన్న దేవాలయం
- దొడ్డ గణపతి దేవాలయం
- కొటే వెంకటేశ్వర మందిరం
- బెంగుళూరు ప్యాలెస్
- టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్
- లాల్బాగ్ ఉద్యానవనము
- కబ్బన్ పార్కు
- కర్ణాటక విధాన సౌధ (శాసనసభ)
- విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం
- ప్లానిటోరియం
- అక్వేరియం
- యమ్.జి. రోడ్
- ఫోరం మాల్
- గరుడ మాల్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలుసవరించు
- మారతహళ్ళి - తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతము. ఇది పెద్ద పెద్ద ఐ.టి సంస్థలకు అతి సమీపములో ఉంది.
- మెజిస్టిక్ - బెంగుళూరు రవాణా కేంద్రము. ఇక్కడి నుండి దాదాపు అన్ని రైలు, బస్సులు బయలుదేరుతాయి.
- కోరమంగళ
- వైట్‌ఫీల్డ్ - ఇక్కడ సత్య సాయి ఆసుపత్రి నెలకొల్పబడింది.
- మల్లేశ్వరం
- జాలహళ్ళి
- యలహంక
- కృష్ణరాజపురం
ప్రముఖులుసవరించు
- సౌందర్య రాజేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త.
- కిరణ్ మజుందార్-షా
- స్నేహ కపూర్
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 2007-08 సంవత్సరానికి తయారు చేసిన బడ్జెట్ నివేదిక ప్రకారం గ్రేటర్ బెంగుళూరు విస్తీర్ణం 741 చదరపు కిలోమీటర్లు "2007-08 బడ్జెట్ నివేదిక" (PDF). జాతీయ సమాచార కేంద్రం (NIC), కర్ణాటక రాష్ట్ర విభాగం. భారతదేశ ప్రభుత్వం. Archived from the original (PDF) on 2007-06-28. Retrieved 2007-06-28.
- ↑ http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html
- ↑ "Bangalore-city.com, Bangalore Bus Information, City Buses, Volvo Buses,Tata Marcopolo Buses, Long Distance Buses". Bangalore-city.com. Archived from the original on 25 జనవరి 2010. Retrieved 29 March 2010.
- ↑ "Stir leaves hundreds stranded". Online Edition of The Hindu, dated 2006-12-15. 15 December 2006. Retrieved 17 June 2012.
- ↑ ఇస్కాన్ బెంగలూరు చరిత్ర , వివరణ మొదటి పేజీ
- ↑ ఇస్కాన్ బెంగలూరు చరిత్ర , వివరణ మూడవ పేజీ