ఎస్‌.బి. గిరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు. ఆయన 1971లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.

ఎస్.బి. గిరి

పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 సెప్టెంబర్ 1921
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజా సమితి
జీవిత భాగస్వామి కమల
నివాసం మారేడుపల్లి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎస్‌.బి. గిరి 1921 సెప్టెంబరు 23లో తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ లో జన్మించాడు.[1] ఆయన మహబూబ్ కాలేజీ నుండి తన విద్యాభాస్యం పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఎస్‌.బి. గిరి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా సమితిలో కీలకంగా పనిచేశాడు. ఆయనను తెలంగాణ ఉద్యమ సమయంలో పి.డి. (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) చట్టం క్రింద నిర్భంధించారు. తెలంగాణ సమస్యపై ప్రధాని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు సూచించడానికై ప్రజాసమితి 1971 జనవరి 3న పధ్నాలుగు మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘంలో మర్రి చెన్నారెడ్డి, వి.బి. రాజు, నూకల రామచంద్రారెడ్డి, ఎస్‌.బి. గిరి, మదన్‌ మోహన్‌, జి. వెంకటస్వామి, జె. ఈశ్వరీ బాయి తదితరులున్నారు.[2] ఎస్‌.బి. గిరి 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.[3]

మూలాలు

మార్చు
  1. The Times of India (23 September 2016). "S.B.GIRI (MP)" (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  2. Telangana Magazine (14 January 2020). "14 లోక్‌సభ స్థానాలకు ప్రజా సమితి పోటీ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  3. Loksabha (2021). "Members Bioprofile S. B. GIRI". Archived from the original on 25 November 2020. Retrieved 30 December 2021.