ఎ.టి.కోవూర్

శ్రీలంకకు చెందిన హేతువాది, వృక్షశాస్త్ర ప్రొఫెసరు

డాక్టర్‌ ఎ.టి. కోవూర్‌(ఏప్రిల్ 10, 1898 - సెప్టెంబరు 18 , 1978) గొప్ప సైన్సు వాది. సైన్స్‌ సూత్రాలే తప్ప, మహిమలనేవి ఏవీ లేవని తన జీవితకాలమంతా ప్రచారం చేశారు. అంతేకాదు. అలాటి మహిమలు ఎవరైనా నిరూపిస్తే వారికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని 1960లలోనే ప్రకటించాడు. ఈయన శ్రీలంక దేశానికి చెందిన ప్రొఫెసర్. ఈయన తన పదవీవిరమణ అనంతరం శ్రీలంక, భారతదేశం లో వివిధ మూఢనమ్మకాలను, మూఢ ఆచారాలను సవాలుచేశాడు. భారత దేశంలో దేవుని పేరుచెప్పి జరిగే అవినీతిని హేతువాద ఉద్యమంతో నిరూపించాడు.[1]

అబ్రహాం థామస్ కోవూర్
డా.అబ్రహాం థామస్ కోవూర్
జననం(1898-04-10)1898 ఏప్రిల్ 10
మరణం1978 సెప్టెంబరు 18

బాల్య జీవితం మార్చు

అబ్రహం కోవూర్ కేరళ రాష్ట్రం లోని తిరువల్లా లో జన్మించాడు ఈయన తండ్రి మలబార్ లోని సిరియన్ చర్చి జనరల్ అయిన కోవూర్ ఈప్ థామస్ కట్టనర్. కోవూర్ కలకత్తా లోని బంగబసి కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆయన కేరళ లోని జూనియర్ ప్రొఫెసర్ గా పనిచేసినతర్వాత ఆయన శేష జీవితాన్ని శ్రీలంక లో వివిధ కళాశాలలలో వృక్ష శాస్త్రమును బోధిస్తూ గడిపాడు. పదవీ విరమణ కు ముందు ఆయన కొలంబో లోని ధరస్టన్ కళాశలలో పనిచేశారు. ఆయన హిప్నాటిజం, అనువర్తిత మానసిక శాస్త్రాన్ని కూడా ప్రాక్టీసు చేసారు.

మూఢ నమ్మకాలపై సవాళ్ళు మార్చు

  1. తాను దాచిపెట్టిన కరెన్సీ నోటు నంబరును ఎవరైనా చెప్పమని సవాలు చేశాడు. ఇలా చెప్పినవారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాననీ ప్రకటించారు. చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సి.డి.ఎడుసూరియా అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. తాను దైవపూజలు చేస్తాననీ, అందువలన తనకు మహిమలు చేసే శక్తి వచ్చిందనీ, అందువల్ల తాను కోవూర్‌ సవాలును స్వీకరిస్తానని ప్రకటించాడు. అపుడు కోవూరు స్పందించి తాను ఒక రూపాయి నోటును దావాసా అనే పత్రిక ఎడిటర్‌గారి ఆఫీసు సొరుగులో ఉంచానని, ఎడుసూరియన్‌ను ఆ నోటు నంబరును చెప్పమన్నాడు. ఎడు సూరియా అనేకరోజులు పూజలు చేసి చివరికి ఒకరోజును మంచిరోజుగా ప్రకటించి, ఆ రోజున నోటు నంబరు ఇదీ అని ఒక నంబరు ప్రకటించాడు. కానీ ఎడిటర్‌గారి సొరుగులోని నోటు నంబరుతో ఆ నంబరును పోల్చి చూస్తే అది పూర్తిగా తప్పని తేలిపోయింది!
  2. అలాగే మరోసారి సెవెల్లీ డిసిల్వా అనే వ్యక్తి తనకు టెలీపతీ శక్తులున్నాయనీ, వాటిద్వారా ఎవరైనా దూరంగా వేరే గదిలో ఉండి తనను ప్రశ్నిస్తే వారికి సరియైన సమాధానాలు చెప్పగలననీ ఈ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధమేనా? అని డా|| కోవూర్‌ను 'టైమ్స్‌ ఆఫ్‌ సిలోన్‌ అనే పత్రికలో ఒక లేఖ ద్వారా సవాల్‌ చేశాడు. కోవూర్‌ ఆ సవాలును స్వీకరించాడు. ఆయన మహిమలను పరీక్షించడానికి 1967 ఆగస్టు 15వ తేదీ నిర్ణయమైంది. ఆనాడు ఆ పత్రిక సంపాదకులు, సహ సంపాదకుల సమక్షంలో కోవూర్‌ అడిగిన 7 ప్రశ్నలకు డిసిల్వా ఇచ్చిన సమాధానాలను పరిశీలించడం జరిగింది. ప్చ్‌! ఏడు సమాధానాలూ తప్పేనని తేలిపోయింది. టెలిపతీ బండారం ఇంతేనని లోకానికి ఆ పత్రిక ద్వారా అర్థమైంది.

శ్రీ లంక నివాశి అబ్రహాం టి. కోవూర్ అనే హేతు వాది భార దేశమంతా తిరిగి హేతు వాదాన్ని పురి కొల్పుతూ..... మూడ నమ్మకాల లోని మర్మాలను బట్ట బయలు చేస్తూ 80 వ దశకంలో బహుళ ప్రచారం చేశారు.

మూలాలు మార్చు

  1. "Dr Abraham T. Kovoor: The Rationalist of Indian Subcontinent". Dr Prakash Arumugam. 1998-01-30. Retrieved 2007-03-07.

యితర లింకులు మార్చు