బహుమతి (ప్రైజ్)
ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి వారు సాధించిన విజయాలను గుర్తించి, అభినందించి అందించే అవార్
బహుమతి అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి (క్రీడా బృందాలు, సంస్థలు) వారు సాధించిన విజయాలను గుర్తించి, అభినందించి అందించే అవార్డు.[1] అధికారిక బహుమతులు తరచుగా నగదుతోనూ, వాటితో వచ్చే కీర్తిని కలిగి ఉంటాయి. అకాడమీ అవార్డ్స్ వంటి కొన్ని బహుమతుల ప్రదానంకోసం వేడుకలు నిర్వహించబడుతాయి.
ఆదర్శప్రాయమైన విధానాన్ని ప్రచారం చేయడానికి, మెరుగైన ఫలితాలు, పోటీ ప్రయత్నాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కూడా బహుమతులు ఇవ్వబడతాయి.[1] అయినప్పటికీ, అనేక బహుమతులు, ముఖ్యంగా ప్రసిద్ధమైన బహుమతులు తరచుగా వివాదానికి, అసూయకు కారణమవుతున్నాయి.
రకాలు
మార్చు- బూబీ ప్రైజ్: సాధారణంగా చివరిగా నిలిచిన వారికి (ఉదా, చెక్క చెంచా అవార్డు ) అవమానంగా ఇవ్వబడుతుంది.
- కన్సోలేషన్ ప్రైజ్: గెలవకపోయినా గుర్తింపు పొందేందుకు అర్హులుగా భావించే వారికి ఇచ్చే అవార్డు.
- వరుపక్రమ బహుమతులు: ఉత్తమ అవార్డు "మొదటి బహుమతి" ("గ్రాండ్ ప్రైజ్", "గోల్డ్ మెడల్ ". ఇతర అవార్డులు "రెండవ బహుమతి" ("ఫస్ట్ రన్నర్-అప్", " సిల్వర్ మెడల్ ") గానూ, "మూడవ బహుమతి" ("సెకండ్ రన్నరప్", "కాంస్య పతకం") గానూ ఉంటాయి.
- కొనుగోలు బహుమతి: విజేత పనికి బదులుగా ఆర్ట్ పోటీలో ఇచ్చే నగదు బహుమతి.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చుMedia related to Prizes at Wikimedia Commons