ఎ. కనకదుర్గా రామచంద్రన్

కనకదుర్గా రామచంద్రన్[1] విదుషీమణి, రచయిత్రి.

జీవిత విశేషాలు సవరించు

ఆమె 1919 జనవరి 25న యామినీ పూర్ణతిలకమ్మ, నిరాఘాటం రామకోటయ్య దంపతులకు జన్మించింది. ఆమె తల్లి యామినీపూర్ణతిలకమ్మ సంఘసేవకురాలు, జాతీయవాది, కవయిత్రి, భాగవతోత్తమురాలు. తండ్రి నిరాఘాటం రామకోటయ్య సంగీత విద్వాంసుడు. ఆమె విజయవాడలోని రుషి వేలీ పాఠశాలలో, మదనపల్లిలో, మద్రాసులో విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎం.ఏ., ఎం.ఇడి. చదివింది. ఈమె భర్త ఏ.రామచంద్రన్ మద్రాసులో న్యాయవాది.1961 సంవత్సరంలో ఈమెను గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కరించారు. ఆమె విశ్వనాథవారి రచనలు అభిమానించేది.

రచనలు సవరించు

బాలసాహిత్యం[2] సవరించు

  1. వేటగాడి కొడుకు - ఇతర విదేశీ కథలు (అనువాదం)[3][4]
  2. అందమైన లోకం
  3. ఇంద్రజాల దీపం
  4. పిల్లల నాట్యకళ
  5. ఐక్యరాజ్యసమితి
  6. పిల్లలు కట్టిన చెలిమి వంతెన

ఆంగ్ల గ్రంథాలు సవరించు

  1. విదర్ ఆర్ యు రౌండ్?

మూలాలు సవరించు

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineగృహలక్ష్మి మాసపత్రిక మే,1961 పేజీలు 5,54
  2. ఆంధ్ర రచయిత్రుల సమాచార సూచిక, కె. రామలక్ష్మి - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1968
  3. [2][3]మాగంటి.ఆర్గ్‌లో పుస్తకం
  4. "వేటగాడి కొడుకు ఇతర విదేశీ కథలు". lit.andhrajyothy.com. Retrieved 2020-06-05.