ఎడ్ల గురవారెడ్డి

(ఎ. గురవారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

ఎడ్ల గురువారెడ్డి (Edla Guruva Reddy) ఆగష్టు 16, 1914న మెదక్ జిల్లా రామంచ గ్రామంలో జన్మించాడు. సిద్ధిపేట, హైదరాబాదులలో విద్యనభ్యసించాడు. సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఏంఏ పట్టాపొందాడు. గురువారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే వందేమాతరం ఉద్యమం జరిగింది. ఇతను కూడా ఉద్యమంలో చురుగ్గా పనిచేశాడు. యూనివర్శిటీ నుంచి బహిషృతుడై నాగ్పూర్ లో చేరారు. నిషేధం తర్వాత మళ్ళీ హైదరాబాదు వచ్చి నిజాం నిరంకుశ పాలనకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించాడు.వరంగల్ జిల్లాలో ప్రముఖమైన భైరాన్ పల్లి సంఘటనలో ఇతను పాల్గొన్నాడు. మెదక్ జిల్లా విఠలాపూర్లో గురువారెడ్డి ప్రోత్సాహంతో 5వేల మంది జెండావందనం చేశారు.[1] నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విమోచనోద్యమంలో చురుగ్గా పాల్గొని, హైదరాబాదు భారతయూనియన్ లో కలిసిన పిదప కమ్యూనిస్టు పార్టీలో కొనసాగాడు. 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు.1958 లో విధానమండలికి ఎన్నికై 6 సం.లు ఎమ్మెల్సీగా ఉన్నాడు.

మూలాలు మార్చు

  1. మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, ప్రచురణ 2007, పేజీ 91