మెదక్

తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ఒక పట్టణం

మెదక్, తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది మెదక్ పురపాలక సంఘం పరిపాలనా కేంద్రం. మెదక్ రెవెన్యూ విభాగంలో ఉన్న పట్టణం. మెదక్ మండలానికి ప్రధాన కేంద్రం.

మెదక్
మెతుకుదుర్గం, మెతుకు
ఏడుపాయల దేవాలయం, మెదక్
మెదక్ is located in Telangana
మెదక్
మెదక్
Location in Telangana, India
మెదక్ is located in India
మెదక్
మెదక్
మెదక్ (India)
Coordinates: 18°02′46″N 78°15′47″E / 18.046°N 78.263°E / 18.046; 78.263
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్ జిల్లా
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyమెదక్ కౌన్సిల్
విస్తీర్ణం
 • Total22 కి.మీ2 (8 చ. మై)
Elevation
442 మీ (1,450 అ.)
జనాభా
 (2011)[1]
 • Total44,255
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
DemonymMedakakar
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
502110
టెలిఫోన్ కోడ్08452
ISO 3166 codeఐఎన్-టిజి
Vehicle registrationటిఎస్-35[2]

భౌగోళికం

మార్చు

మెదక్ 18.03 ° N 78.27 ° E వద్ద ఉంది. దీని సగటు ఎత్తు 442 మీటర్లు (1450 అడుగులు).

జనాభా

మార్చు

భారతదేశం యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 9011 గృహాలతో 44,255 జనాభా ఉంది. మొత్తం జనాభాలో, 21,336 మంది పురుషులు, 22,919 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1074 మంది మహిళలు. 0 – 6 సంవత్సరాల వయస్సులోపు 4,815 మంది పిల్లలు ఉన్నారు, వీరిలో 2,418 మంది బాలురు, 2,397 మంది బాలికలు -వీరిలో నిష్పత్తి ప్రతి 1000 కి 991. సగటు అక్షరాస్యత రేటు 30,984 మందికిగాను అక్షరాస్యులతో 78.56% వద్ద ఉంది, ఇది రాష్ట్ర సగటు 66.46 కన్నా గణనీయంగా ఎక్కువ %.

పరిపాలన

మార్చు

మెదక్ పట్టణ పరిపాలన మెదక్ మునిసిపాలిటీ నిర్వహిస్తుంది.మెదక్ పరపాలక సంఘం 1953 సంవత్సరంలో ఏర్పడింది. ఇది 22.00 కిమీ 2 (8.49 చ. మై) విస్తీర్ణంలో ఉంది.

పరిశ్రమలు

మార్చు

మెదక్‌లో అతిపెద్ద పరిశ్రమ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది.ఇది భారత సాయుధ దళాల అవసరాల కోసం ఉత్పత్తులను తయారు చేస్తుంది. మెదక్ యొక్క ఆర్ధికవ్యవస్థకు ఈ ప్యాక్టరీ అతిపెద్ద సహకారి.

పర్యాటక రంగం

మార్చు
 
ప్రసిద్ధి పొందిన మెదక్ చర్చి
  • పోచరం వన్యప్రాణుల అభయారణ్యం, పోచరం సరస్సు,పోచారం అటవీ దర్శించతగినవి.
  • మెదక్ కేథలిక్ చర్చి ఇది చూపురులను ఆకట్టుకునే కట్టడాలలో ఇది ఒక కట్టడం.ఆసియాలోనే అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరం.[3]
  • మెదక్ కోట[4] ఈ కోటను మొదట కాకతీయ రాజులు నిర్మించారు. తరువాత కుతుబ్ షాహి రాజులు అభివృద్ధి చేశారు.
  • కుచన్‌పల్లిలోని కుచాద్రి వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

మార్చు

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్‌ శివారులో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ నిర్మాణ పనులకు 2018 మే 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు. 32 ఎకరాల్లో 67.07 కోట్ల రూపాయలతో లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా ఈ సముదాయం నిర్మించబడింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ 50వేల చదరపు అడుగులు, మొదటి అంతస్తు 50వేల చదరపు అడుగులు, రెండో అంతస్తు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.[5]

కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.[6] కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌కు విద్యుత్‌కు 315 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఒకటి, 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ సముదాయం వద్ద 80వేల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంకులు నిర్మించారు. భవనం ఆవరణలో గార్డెనింగ్‌ కోసం పూల మొకలతోపాటు వాటర్‌ ఫౌంటెయిన్‌, పచ్చిగడ్డి ఏర్పాటుచేశారు. చుట్టూ ప్రహరీ గోడ, దానికి ఆనుకుని సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, జాతీయ రహదారి నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు నాలుగు వరుసలతో దాదాపు 330 మీటర్ల పొడవునా రోడ్డు, రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌ వరకు 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు.[7]

ఈ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను 2023, ఆగస్టు 23న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ కు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కుర్చీలో కుర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం, దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8]

జిల్లా పోలీసు కార్యాలయం

మార్చు

మెదక్-రామాయంపేట రహదారిలో తూర్పుకు అభిముఖంగా 63 ఎకరాల్లో 38.50 కోట్ల రూపాయలతో మూడు అంతస్తుల్లో సుమారు 51,411 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ కార్యాలయంలో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎ‌స్‌‌డీ‌లకు ప్రత్యేక గదు‌ల‌తో‌పాటు రెస్ట్‌ రూంలు, నేరా‌లను ఛేదిం‌చేలా క్రైం విభాగం, పరి‌పా‌లనా విభా‌గా‌లు, ఇంటె‌లి‌జెన్స్‌, డాగ్‌ స్క్వాడ్‌, డిజి‌టల్‌ ల్యాబ్‌లు, ట్రైనింగ్‌ హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, సైబర్‌ ల్యాబ్‌, పీడీ సెల్‌, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌‌వార్డు, ఔట్‌‌వార్డు, మినీ కాన్ఫ‌రె‌న్స్‌‌హాల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, పార్కు, శాశ్వత హెలిప్యాడ్‌ ఏర్పాటుచేయబడ్డాయి.[9]

జిల్లా పోలీసు కార్యాలయాన్ని 2023, ఆగస్టు 23న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేసీఆర్ కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, హోంమంత్రి మహమూద్ అలీ రిబ్బన్ కట్ చేసి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించాడు. నూతన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[10]

మాతా- శిశు అరోగ్య కేంద్రం

మార్చు

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మరింతగా పెంచేందుకు మాతా- శిశు అరోగ్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా మెదక్‌లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన 100 పడకల మాతా- శిశు అరోగ్య కేంద్రాన్ని 2022 మే 27న తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు ప్రారంభించాడు. ఇందులో మెటర్నిటీ వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, పీడియాట్రిక్‌ వార్డ్, పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, ఆంటి నాటల్ వార్డ్, పోస్ట్ నాటల్ వార్డ్ వంటి సదుపాయాలను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.[11]

రైల్వే రేక్ పాయింట్

మార్చు

స్థానిక రైల్వే స్టేషన్ లో ఏర్పాటుచేసిన రైల్వే రేక్ పాయింట్ ను 2022 ఆగస్టు 1న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి , ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ లు పాల్గొన్నారు.[12]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
  2. "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
  3. Staff (2016-12-22). "ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి మన రాష్ట్రంలో ..!!". www.telugu.nativeplanet.com. Archived from the original on 2016-12-24. Retrieved 2020-01-10.
  4. "మెదక్‌ కోట". magazine.telangana.gov.in. Archived from the original on 2017-08-10. Retrieved 2020-01-10.
  5. "తుది దశలో సమీకృత కలెక్టరేట్‌ భవనం". EENADU. 2022-02-05. Archived from the original on 2022-02-05. Retrieved 2023-08-25.
  6. "'సమీకృతం'.. సర్వజన హితం". EENADU. 2023-08-25. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  7. telugu, NT News (2023-08-23). "ముస్తాబైన మెదక్‌ కలెక్టరేట్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  8. telugu, NT News (2023-08-23). "CM KCR | మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  9. "పాలన కార్యరూపం.. పథకాలకు శ్రీకారం". EENADU. 2023-08-23. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  10. "LIVE from Medak | జిల్లా ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్". Prabha News. 2023-08-23. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  11. telugu, NT News (2022-05-27). "మెదక్‌లో 100 పడకల దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.
  12. Desk, HT Telugu (2022-08-01). "Railway rake point: మెదక్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభం". Hindustantimes Telugu. Archived from the original on 2022-08-03. Retrieved 2022-08-03.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మెదక్&oldid=3963392" నుండి వెలికితీశారు