ఎ. వి. పి. అసైతంబి
తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు
ఎ..వి.పి అసైతంబి (మే 28 1924 - ఏప్రిల్ 7 1979) ఇతను డిఎంకె పార్టీకి చెందిన తమిళనాడు రాజకీయ నాయకుడు.[1] విరుదునగర్‌లో 1924 మే 28న జన్మించాడు.అతను ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరుపున, 1957లో థౌజండ్ లైట్స్ శాసనసభ నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు.అలాగే 1967లో ఎగ్మోర్ నియోజకవర్గం నుండి తిరిగి ద్రవిడ మునేట్ర కజగం పార్టీ అభ్యర్థిగా తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1977లో చెన్నై ఉత్తర నియోజకవర్గం నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. విరుదునగర్‌లోని జిల్లా కలెక్టరు కార్యాలయ భవనానికి అతని పేరు పెట్టారు. 1951లో నిర్మించిన సర్వధికారి చిత్రానికి అతను సంభాషణ రచయితగా పనిచేసాడు. అతను 1979 ఏప్రిల్ 7న మరణించారు.[2]
ఎ. వి. పి. అసైతంబి | |
---|---|
శాసనసభ్యులు మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ | |
In office 1957–1962 | |
అంతకు ముందు వారు | కె. వెంకటస్వామి నాయుడు |
నియోజకవర్గం | థౌజండ్ లైట్స్ |
In office 1967–1972 | |
అంతకు ముందు వారు | జె. వెంకటాచెల్లమ్ |
నియోజకవర్గం | ఎగ్మోర్ |
మూలాలు
మార్చు- ↑ Tamil Nadu Legislative Assembly, Sixth Assembly, Fourth Session, 1979
- ↑ "Sarvadhikari 1951". The Hindu. 24 October 2008. Archived from the original on 27 October 2008.