ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్

హైదరాబాదు నగరంలో ఉన్న వారసత్వ కట్టడాలు, భవనాల గురించిన రాయబడిన పుస్తకం

ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్: ది నేచురల్ అండ్ ది బిల్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న వారసత్వ కట్టడాలు, భవనాల గురించిన రాయబడిన పుస్తకం. మధు వోటేరి రాసిన[1] ఈ పుస్తకంలో చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్ మొదలైన అన్ని వారసత్వ కట్టడాలు, భవనాల గురించి సమాచారం ఉంది. విద్యార్థులు, విద్యావేత్తలు, పర్యాటకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్: ది నేచురల్ అండ్ ది బిల్ట్
రచయిత(లు)మధు వోటేరి
దేశంభారతదేశం
భాషఇంగ్లీష్
శైలిచరిత్ర
ప్రచురించిన తేది
2010
మీడియా రకంపుస్తకం
పుటలు270
ISBN978-81-291-1656-7

నేపథ్యం

మార్చు

ఈ పుస్తకం హైదరాబాదు నగర చరిత్ర, దాని వారసత్వం మధ్య ఉన్న సంబంధాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. నగరంలోని ప్రతి వారసత్వ నిర్మాణపు ప్రాముఖ్యత, విలువ, నిర్మాణం గురించి ఈ పుస్తకంలో సమగ్రంగా రాయబడింది. నగరంలోని వివిధ వారసత్వ ప్రదేశాల సందర్శనకు వీలుగా పుస్తకంలో స్కేల్ చేయబడిన రోడ్ మ్యాప్‌లు, స్కెచ్‌లు కూడా ఉన్నాయి.[2]

మూలాలు

మార్చు
  1. "UNESCO heritage tag: city monuments' chances bright". The Hindu. 13 December 2010.
  2. Vottery, Madhu (2010). A Guide to the Heritage of Hyderabad (in ఇంగ్లీష్). Rupa Publications. ISBN 978-81-291-2584-2.