ఏకవర్ణ ఛాయాచిత్రకళ
మోనోక్రోం ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Monochrome photography) లో ఫోటో తీయబడుతున్న వస్తువు యొక్క అన్ని రంగులనీ నమోదు చేయకుండా, కేవలం ఒక వర్ణసంబంధిత రంగు(ల)లో మాత్రమే ప్రతిబింబాన్ని చిత్రించటం. నలుపు నుండి తెలుపు మధ్యలో, వివిధ తీవ్రతలు గల బూడిద వర్ణాలలో ఉన్న అన్ని రకముల బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రాలు మోనోక్రోం ఛాయాచిత్రకళ క్రిందకే వస్తాయి.
కలర్ ఛాయాచిత్రకళతో పోలిస్తే మోనోక్రోం ఛాయాచిత్రకళ సున్నితమైనది, భావాత్మమైనది, అవాస్తవికమైనది. మోనోక్రోం ఛాయాచిత్రకళ భావోద్వేగభరితం. మోనోక్రోం ప్రతిబింబాలు వస్తువుల యొక్క ప్రత్యక్ష కూర్పులు కావు. ఇవి బూడిద వర్ణాలలో చెప్పబడే సూక్ష్మాలు.
కలర్ ఛాయాచిత్రాలని ముద్రణలోని మెళకువలతో, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లతో మోనోక్రోం లో ముద్రించవచ్చును.
చిత్రమాలికసవరించు
సెపియా టోన్ లో తీయబడ్డ ఛాయాచిత్రం
బ్లాక్ అండ్ వైట్ లో తీయబడ్డ ఛాయాచిత్రం
సయనోటైప్ లో తీయబడ్డ ఛాయాచిత్రం