ఏకశిలా గణపతి విగ్రహం

తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలంలోని మండలంలోని ఆవంచ గ్రామంలో ఉంది

ఏకశిలా గణపతి విగ్రహం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామంలో ఉంది. భారతదేశంలో ఎత్తైన గణపతి విగ్రహం (30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు) ఇది. పశ్చిమ చాళుక్య సామ్రాజ్య నేపథ్యం గురించి ఈ విగ్రహం వర్ణిస్తుంది. వీరు గుల్బర్గా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు. ఈ విగ్రహం 9.144 మీటర్లు (పీఠం7.62 మీటర్లు) ఎత్తు ఉంది.[1][2][3] దీనిని ఐశ్వర్య గణపతి విగ్రహం, ఆవంచ గణపతి విగ్రహం అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన గణపతిని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.

ఏకశిలా గణపతి విగ్రహం
ఆవంచ
మతం
అనుబంధంహిందూ
జిల్లానాగర్‌కర్నూల్ జిల్లా
పండుగవినాయకుడు
ప్రదేశం
ప్రదేశంఆవంచ, తిమ్మాజిపేట మండలం
రాష్ట్రంతెలంగాణ
గణపతి విగ్రహం
గణపతి విగ్రహం
గణపతి విగ్రహం
భౌగోళిక అంశాలు16°42′41″N 78°14′54″E / 16.711498°N 78.248336°E / 16.711498; 78.248336
వాస్తుశాస్త్రం.
సృష్టికర్తపశ్చిమ చాళుక్య సామ్రాజ్యం
ఎత్తు9.144 m (30 ft)

చరిత్ర మార్చు

12వ శతాబ్దంలో అవంచలో పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యకు సోమేశ్వరుడు, తైలంపుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నాడు. ఈ తైలంపుడు సామంత రాజును కందూరు రాజధానిగా ఉన్న ఒక నిర్దిష్ట ప్రావిన్స్‌గా మార్చారు. సా.శ. 1113లో తైలంపుడు తన రాజధానిని అవంచకు మార్చాడు. తైలంపుడు పెద్ద గ్రానైట్ బండరాయిపై ఈ పురాతన గణపతి విగ్రహాన్ని చెక్కించాడు. విగ్రహం పనులు కొనసాగుతున్న సమయంలోనే తండ్రి విక్రమాదిత్యుడు చనిపోయాడనే వార్త తెలుసుకున్న తైలంపుడు మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆధారాలున్నాయి.[4] ఈ రాజవంశం 200 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో తమ రాజ్యపాలన సాగించారు. ఆ విగ్రహం వ్యవసాయ క్షేత్రంలో ఉంది.[5] ఆ విగ్రహానికి గుడి, చుట్టూ గోడ లేదు. పొలాల్లో పనిచేసుకొనే రైతులే అప్పుడప్పుడు అరటిపండు నైవేద్యంగా పెడుతున్నారు.[6]

ఇతర వివరాలు మార్చు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సి. లక్ష్మా రెడ్డిలు ఈ విగ్రహాన్ని దర్శించారు.

మూలాలు మార్చు

  1. "Aishwarya Ganapathi, Avancha, Mahbubnagar District, Telangana - YouTube". www.youtube.com. Retrieved 2020-08-23.
  2. Goud, R. Narender (2017-08-25). "Historic Ganesh idol lies in neglect". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-23.
  3. "30 అడుగుల అరుదైన ఏకశిలా గణపతి.. మన అవంచలో!". Samayam Telugu. Retrieved 2020-08-23.
  4. ఆంధ్రజ్యోతి, నాగర్‌కర్నూల్‌ (5 September 2016). "ఐశ్వర్య గణపతి". andhrajyothy. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  5. "Telangana Government Neglects Eka Shila Ganesh in Mahabubnagar | Sneha TV Telugu - YouTube". www.youtube.com. Retrieved 2020-08-23.
  6. "నిరాదరణకు గురవుతున్న ఆవంచ గణపతి". mytelangana.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-09.