ఏకాంత సేవ లేదా పవళింపు సేవ అనగా దేవాలయాలలో స్వామి వారికి రాత్రి సమయంలో జరిపే ఒక సేవ. పేరుకు తగ్గట్టుగా స్వామి వారు ఏకాంతంగా పవళించుటకు ఈ సేవను భక్తుల సమక్షంలో పూజారులు నిర్వహిస్తారు. ఏకాంత సేవ సమయంలో స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ నైవేద్యంలో పాలు, పండ్లు, జీడిపప్పులు ఉంటాయి. పాలను కాగబెట్టి అందులో కస్తూరిని కూడా కలుపుతారు. అరటి, ఆపిల్ వంటి పండ్లను ముక్కలుగా కోసి అందులో జీడిపప్పులను కలిపి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏకాంత సేవ సమయంలో స్వామి వారి ఆవరణంలో ఉన్న, దేవాలయంలోని విద్యుత్ దీపాలను ఆపివేసి స్వామి వారికి కర్పూరంతో నక్షత్ర హారతిని ఇస్తారు. ఈ సమయంలో స్వామి వారిని ఊయలలో పండుకో బెట్టి, ఊయలను ఊపుతూ, వింజామరలనే ప్రత్యేక విసనకర్రలతో స్వామి వారికి విసురుతూ, స్వామి వారికి జోల పాటలను పాడుతారు. ఈ సేవతో స్వామి వారు నిద్రకుపక్రమిస్తారని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో ఈ సేవను నిర్వహిస్తారు. ఇంకా సాయిబాబా మందిరాలలో కూడా ఈ సేవను నిర్వహిస్తారు. సాయిబాబా మందిరాలలో ఈ సేవను చేసేటప్పుడు పల్లకి సేవను కూడా చేస్తారు. ఏకాంత సేవ తరువాత స్వామి వారికి సమర్పించిన నైవేద్యాలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఉత్సవాల సమయంలో ఏకాంత సేవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

ఏకాంతసేవ రోజున కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం

ఇవి కూడా చూడండి

మార్చు

తిరుమల ఏకాంత సేవ

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకాంత_సేవ&oldid=4076581" నుండి వెలికితీశారు