ఏకాదశి (పుస్తకం)

(ఏకాదశి(పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)


చింతా దీక్షితులు(1891-1960) వ్రాసిన కథల సంపుటి ఈ పుస్తకం.[1] దీనిలో 11 కథలున్నాయి. 1925లో తెనాలి సాహితీసమితి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. తల్లావఝల శివశంకరశాస్త్రికి ఈ పుస్తకాన్ని అంకితం చేయబడింది. ఈ పుస్తకానికి ఆముఖము పేరుతో శివశంకరశాస్త్రి పీఠిక వ్రాశాడు.

ఏకాదశి
కృతికర్త: చింతా దీక్షితులు
అంకితం: శివశంకరశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంపుటి
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: సాహితీసమితి తెనాలి
విడుదల: 1925
పేజీలు: 158
  1. శ్యామల (1920)
  2. ముద్దు (1920)
  3. మా అబ్బాయి (1920)
  4. వరూధిని (1924)
  5. కవిరాయుడు:మహారాజు(1924)
  6. "సాహితి"కి కథ(1921)
  7. పాఠము(1921)
  8. ఎన్నో చేస్తాను(1921)
  9. మన్మథసందర్శనము(1921) - ఈ కథ హాస్య కథలు పుస్తకంలో కూడా ప్రచురితమైంది.
  10. గాలిపాటు(1920)
  11. చెంచుదంపతులు

అభిప్రాయం

మార్చు

శివశంకరశాస్త్రి పీఠికలో ఇలా తన అభిప్రాయం చెప్తున్నాడు.

ఈ కథలలో నానాత్వము, చమత్కారిత్వమూ కనబడుతున్నవి. మన కథ, కథానకము, ఆఖ్యానకము, ఆఖ్యాయికి అనే విభాగాలకూ ఇంగ్లీషులో Story, Tale, Sketch అనే విభాగాలకూ ఇంచుమించుగా సరిపోయేలాగున వుంటవి దీక్షితులుగారి కథలు. కథా లక్షణాలు వుండడం చేత ఈ సంపుటిలో చేరింది వరూధిని.

మూలాలు

మార్చు