ఏగిస (లాటిన్ Pterocarpus marsupium) ఒక విధమైన కలప చెట్టు. ఏగిస 15-18 మీటర్ల వరకు పెరిగి ఆకులతో విస్తారం గా ఏపుగా ఎదిగే కలప చెట్టు . మొక్కలు వేసే సమయం మార్చి నెల. ఒక ఎకరాకు 250 మొక్కల చొప్పు న సాగు చేస్తారు . మొక్క చెట్టుగా ఎదగ డానికి 10 సంవత్సరములు పడుతుంది . ఒక రకం గా చెప్పాలంటే ఏగిస విలువైన కలప. అనేక ఇతర ప్రయోజనమూలకు ఉపయోగం అయ్యే చెట్టు అని పేర్కొనవచ్చును. ఏగిస కలపను భారతీయ అటవీప్రాంతం లలో సాగు చేస్తారు . కాఫీ తోటలలో నీడ చెట్టుగా దీనిని పెంచుతారు . ఇంటి తోటలలో కూడా బహుళార్ధసాధక చెట్టుగా,భారతదేశం, శ్రీలంకలోని వివిధ ప్రాంతాలలో వ్యవసాయ లో భాగంగా దీనిని సాగు చేస్తారు. 22 - 34 ° c ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఈ మొక్క పెరుగుతుండి. సగటు వర్షపాతం 1,000 - 1,500 మిమీ. తేలిక పాటి నుంచి మధ్య రకముగా వుండే నేలలో సహజం గా పెరుగ గలదు[1] .

ఏగిస
Koeh-252.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
P. marsupium
Binomial name
Pterocarpus marsupium
ఏగిస చెట్టు - కాండం

చరిత్రసవరించు

భారత దేశములో మధ్య ప్రదేశ్ , ఒడిస్సా, ఛత్తిస్ ఘర్ , మహారాష్ట్ర , రాజస్థాన్, పశ్చిమ బెంగాలు, తమిళ నాడు, కేరళ , ఆంధ్ర ప్రదేశ్, లో ఏగిస చెట్లు వుంటాయి[2] ఏగిస చెట్టును ఇంగ్లీష్ లో బిజాసల్, ఇండియన్ కినో ట్రీ, ఈస్ట్ ఇండియన్ కినో, బాస్టర్డ్ టేకు, కినో, గామలు, మలబార్ కినో ట్రీ ,హిన్‌బిగసల్,హిందీ లో బిగసల్క, కన్నడహోన్నే లో మలయాళ లో వెన్నా, వెంగా, కరవెంగా,ఇతరులు వెంగై, పొన్నై, తమిళము లో వెంగై, పిలుస్తారు. ఏగిస చెట్టు కేరళ రాష్ట్రములో అన్ని జిల్లాలలో , కర్ణాటక లో బెల్గాం, కూర్గ్, ధార్వార్, హసన్, మైసూర్, తమిళనాడులో కోయంబత్తూర్, ధర్మపురి, దిండిగల్, కాంచీపురం, కన్నియకుమారి, మదురై, నీలగిరి, సేలం, తేని, తిరుచ్చిరాపల్లి, తిరునెల్వేలి, తిరువన్నమలై, విలుప్పురం, విరుదునగర్ లలో ఈ చెట్టు కనబడుతుంది [3]

ఉపయోగములు[4]

ఏగిస మొక్కలు ఆయర్వేదిక సంభందమైన మధుమేహం , రక్తం లో కొలెస్ట్రాల్ నియంత్రణ , చర్మ వ్యాధులకు, డహేరియా, ఎనేమియా లాంటి మందు ల తయారీ కి వాడుతున్నారు [5] ఏగిస్ చెట్ల కాండములతో బీమ్స్ వేయడం, ఇంగినీరింగ్ ప్రాథమిక పనులలో గృహ నిర్మాణం లో వాడటం , ప్లై వుడ్ తయారీలలో కూడా వాడటం జరుగు తుంది[6]

మూలాలుసవరించు

  1. "Pterocarpus marsupium - Useful Tropical Plants". tropical.theferns.info. Retrieved 2020-08-06.
  2. "Indian Kino Tree Reforestation Project | HerbalEGram | August 2018". cms.herbalgram.org. Retrieved 2020-08-06.[permanent dead link]
  3. "Pterocarpus marsupium Roxb". India Biodiversity Portal. Retrieved 2020-10-27.
  4. "Plant Details for a Pterocarpus marsupium ROXB". envis.frlht.org. Retrieved 2020-08-06.
  5. Anupama (2014-10-17). "Vijaysar (Pterocarpus Marsupium) Medicinal uses". bimbima (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-06.
  6. "Pterocarpus marsupium (andaman redwood)". www.cabi.org. Retrieved 2020-08-06.
"https://te.wikipedia.org/w/index.php?title=ఏగిస&oldid=3214038" నుండి వెలికితీశారు