ఏప్రిల్ 28 ఏం జరిగింది

ఏప్రిల్‌ 28 ఏం జరిగింది 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] వి.జి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వీరాస్వామి నిర్మించి దర్శకత్వం వహించాడు.[2] రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది.[3]

ఏప్రిల్ 28 ఏం జరిగింది
దర్శకత్వంవీరాస్వామి
స్క్రీన్ ప్లేవీరాస్వామి
నిర్మాతవీరాస్వామి
తారాగణంరంజిత్
షెర్రీ అగర్వాల్
తనికెళ్ళ భరణి
రాజీవ్ కనకాల
ఛాయాగ్రహణంసునీల్‌ కుమార్‌
కూర్పుసంతోష్
సంగీతంసందీప్‌ కుమార్‌
నిర్మాణ
సంస్థ
వి.జి. ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
27 ఫిబ్రవరి 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

విహారి (రంజిత్) సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. ఓ సినిమా ఫ్లాపు తర్వాత నిర్మాత (తనికెళ్ళ భరణి)ఒత్తిడితో మంచి ఐడియా కోసం భార్య ప్రవల్లిక (షెర్రీ అగర్వాల్)తో కలిసి సిరిపురం అనే ఊరిలోని ఓ గెస్ట్‌ హౌస్‌కి వెళ్తాడు. కానీ అందులో ఉన్న కొన్ని ఆత్మలు రంజిత్ తో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. విహారికి స్నేహితుడు ఎస్ఐ డేవిడ్(అజయ్)తో పాటు ఈ ఫ్యామిలీ మొత్తం విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? ఆ తరువాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: వీజీ ఎంటర్‌టైన్మెంట్
  • నిర్మాత: వీరాస్వామి
  • కథ, దర్శకత్వం: వీరాస్వామి
  • స్క్రీన్‌ప్లే: హరి ప్రసాద్ జక్కా
  • సంగీతం: సందీప్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌
  • ఎడిటర్: సంతోష్


మూలాలు సవరించు

  1. Eenadu (9 February 2021). "ఏప్రిల్‌ 28న 'ఏం జరిగింది..?'". Retrieved 8 June 2022.
  2. Telangana Today (21 January 2021). "'April 28 Em Jarigindi' to hit screens". Retrieved 8 June 2022.
  3. Eenadu (20 February 2021). "'ఏప్రిల్ 28 ఏం జరిగింది' అందరినీ అలరిస్తుంది". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  4. Sakshi (27 February 2021). "'ఏప్రిల్‌ 28 ఏం జరిగింది' మూవీ రివ్యూ". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.

బయటి లింకులు సవరించు