ఏలేశ్వరం నగరపంచాయితీ

తూర్పగోదావరిజిల్లా కి చెందిన నగర పంచాయతీ

ఏలేశ్వరం నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందిన ఏలేశ్వరం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ నగర పంచాయతీ కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగర పంచాయతీ.

ఏలేశ్వరం నగరపంచాయితీ
ఏలేశ్వరం
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.ఇది సమీప పట్టణమైన కాకినాడ నుండి 49 కి.మీ. దూరంలో ఉంది.[1]

భౌగోళికం మార్చు

ఈ నగరపంచాయితీ 17°17′00″N 82°06′00″E / 17.2833°N 82.1000°E / 17.2833; 82.1000అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన కాకినాడ నుండి 49 కి.రాష్ట్ర రాజధాని అమరావతి నుండి 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2]

జనాభా గణాంకాలు మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32,957మంది జనాభా ఉన్నరు. అందులో పురుషులు 16,048, మహిళలు 16,909మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే గొల్లప్రోలు అక్షరాస్యత ఎక్కువ. 2011 లో అక్షరాస్యత గొల్లప్రోలు 68.33% కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 67.02%.ఉంది. పురుషుల అక్షరాస్యత 73% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 63%.అక్షరాస్యులు ఉన్నారు.[3]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

మూలాలు మార్చు

  1. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-06-06.
  2. Elesvaram at Falling Rain Genomics
  3. "ఏలేశ్వరం జనాభా గణాంకాలు 2011". www.census2011.co.in. Retrieved 2021-06-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "ఎన్నికల ఫలితాలు:మున్సిపోల్స్ లో ఫ్యాన్ గాలి". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.