ఏల్చూరి మురళీధరరావు

ఏల్చూరి మురళీధరరావు తెలుగు కవి, రచయిత.[1]

జీవిత విశేషాలు మార్చు

అతను ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్నాడు. మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం కుమారుడు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక, విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశాడు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నాడు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందాడు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.[2]

మూలాలు మార్చు

  1. "elchuri muralidhara rao articles Archives". ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-07-26. Retrieved 2023-07-26.
  2. "తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం – ఈమాట" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-14.