ఐంద్రితా రే

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి

ఐంద్రితా రే (1985, మార్చి 3) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[3] ఎక్కువగా కన్నడ సినిమాలలో నటించింది. 2007లో సినిమారంగంలోకి వచ్చిన ఐంద్రితా, మెరవనిగే సినిమాలో నటించింది. కన్నడ సినిమారంగంలో నటిగా గుర్తింపు పొందింది.[4] మనసారే సినిమాలో దేవిక అనే మానసిక వికలాంగ బాలికగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఐంద్రితా రే
కన్నడ సినిమా మనసారే ప్రచార కార్యక్రమంలో ఐంద్రితా
జననం
ఐంద్రితా రే

(1985-03-03) 1985 మార్చి 3 (వయసు 39)
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామిదిగంత్ మంచాలే (2018)

జననం, విద్య

మార్చు

ఐంద్రితా 1985, మార్చి 3న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది.[1] తండ్రి ఏకె రే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రోస్టోడాంటిస్ట్ కావడంతో, తన కుటుంబం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళి, చివరకు బెంగళూరులో స్థిరపడింది.[5]

బెంగుళూరులోని బాల్డ్‌విన్ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకున్న ఐంద్రితా, డెంటల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదవడానికి బెంగుళూరులోని బిఆర్ అంబేద్కర్ డెంటల్ కాలేజీలో చేరింది. డిగ్రీ చదువుతున్న సమయంలో, పార్ట్ టైమ్ మోడలింగ్ చేసింది, టెలివిజన్ ప్రకటనలలో నటించింది.

సినిమారంగం

మార్చు

మోడలింగ్ నుండి సినిమారంగంలోకి ప్రవేశించి, కన్నడ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఐంద్రితా రే ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఎంఎస్ శ్రీధర్ వద్ద శిక్షణ పొందింది. 2006లో హర్ష, ధ్యాన్ నటించిన జాక్‌పాట్‌ అనే ఒక కన్నడ సినిమాలోని ఒక పాటలో కూడా కనిపించింది.[6] 2008లో వచ్చిన మెరవనిగే సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఐంద్రితకు 2018, డిసెంబరు 12న నటుడు దిగంత్ మంచాలేతో వివాహం జరిగింది.[7][8][9][10]

అవార్డులు

మార్చు
సినిమా అవార్డు విభాగం ఫలితం మూలాలు
మనసారే 2011 అక్క అవార్డులు ఉత్తమ నటి గెలుపు [11]
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి గెలుపు [12]
సౌత్ స్కోప్ అవార్డులు ఉత్తమ కన్నడ నటి గెలుపు [13]
57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - కన్నడ ప్రతిపాదించబడింది [14]
వీర పరంపరే 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రతిపాదించబడింది [15]
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి ప్రతిపాదించబడింది [16]
పరమాత్మ 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి ప్రతిపాదించబడింది [17]
1వ సైమా అవార్డులు ఉత్తమ సహాయ నటి గెలుపు [18]
భజరంగీ 3వ సైమా అవార్డులు ఉత్తమ నటి గెలుపు [19]
61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - కన్నడ ప్రతిపాదించబడింది [20]
నిరుత్తర 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి ప్రతిపాదించబడింది [21]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Aindrita Ray | Manasaare | Meravanige | Yogaraj Bhat | Januma Janumadallu | Nooru Janmaku". www.mybangalore.com. Archived from the original on 29 September 2018. Retrieved 2022-03-31.
  2. "Archived copy". Archived from the original on 25 June 2009. Retrieved 2022-03-31.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "CCL photosoot 2012". Archived from the original on 14 December 2018. Retrieved 2022-03-31.
  4. "Kannada actress Aindrita Ray slapped". Rediff. Archived from the original on 3 June 2016. Retrieved 2022-03-31.
  5. "I would rather be called cute than sexy!". specials.rediff.com. Archived from the original on 2 October 2018. Retrieved 2022-03-31.
  6. "Kannada actresses who are dancing divas too!". The Times of India. Archived from the original on 20 September 2017. Retrieved 2022-03-31.
  7. "I'm really excited I'm marrying my best friend: Aindrita Ray". Archived from the original on 19 December 2018. Retrieved 2022-03-31.
  8. "Aindrita Ray and Diganth to get married in December". Archived from the original on 4 April 2019. Retrieved 2022-03-31.
  9. "Paresh Lamba designs Diganth's D-day outfit". Archived from the original on 15 December 2018. Retrieved 2022-03-31.
  10. "Peek into Aindrita and Diganth's wedding plan". Archived from the original on 15 December 2018. Retrieved 2022-03-31.
  11. "Archived copy". Archived from the original on 9 July 2012. Retrieved 2022-03-31.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Archived copy". Archived from the original on 20 August 2010. Retrieved 2022-03-31.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  13. "Manasaare sweeps Lux South Scope Awards". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 4 October 2010. Retrieved 2022-03-31.
  14. "57th Vying for the Lady in Black!". The Times of India. Archived from the original on 16 July 2010. Retrieved 2022-03-31.
  15. "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Archived from the original on 15 September 2020. Retrieved 2022-03-31.
  16. "Suvarna Film Awards Announced". newindianexpress.com. 4 June 2011. Archived from the original on 21 February 2014. Retrieved 2022-03-31.
  17. Filmfare Editorial (9 July 2012). "59th Idea Filmfare Awards South (Winners list)". Filmfare. Times Internet Limited. Archived from the original on 12 July 2012. Retrieved 2022-03-31.
  18. "SIIMA Awards 2012: Winners List". The Times of India. 15 January 2017. Archived from the original on 14 September 2016. Retrieved 2022-03-31.
  19. "And-the-SIIMA-Awards-go-to". indiatimes. timesofindia. Archived from the original on 19 September 2014. Retrieved 2022-03-31.
  20. "61st Idea South Filmfare Awards". Indiasnaps.com. 12 July 2014. Archived from the original on 10 August 2014. Retrieved 2022-03-31.
  21. "Winners: 64th Jio Filmfare Awards 2017 (South)". 19 June 2017. Archived from the original on 18 June 2017. Retrieved 2022-03-31.

బయటి లింకులు

మార్చు