సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు

ఇండియన్ ఫిల్మ్ అవార్డు

సైమా పురస్కారాలు అని పిలవబడే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు), దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక, సాంకేతిక విజయాలకు ప్రతిఫలంగా లభించే పురస్కారాలు.[1]

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు
Awarded forదక్షిణ భారత సినిమా, సంగీతం లో శ్రేష్ఠత
Locationబహుళ స్థానాలు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రీ మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి21–22 జూన్ 2012
Last awarded15–16 ఆగస్టు 2019
వెబ్‌సైట్సైమా.ఇన్
Television/radio coverage
Networks
జెమినీ టీవీ (తెలుగు)
సన్ టీవీ (తమిళం)
ఉదయ టీవీ (కన్నడ)
సూర్య టీవీ (మలయాళం)

ఈ వేడుకను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు ఇందూరి విష్ణువర్ధన్ 2012 లో స్థాపించాడు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్‌పర్సన్. అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటి రోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండవ రోజు ప్రధాన సిమా అవార్డులకు కేటాయించబడింది. అవార్డు నామినీలను సీనియర్ ఆర్టిస్టులు, నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. బహిరంగ పోలింగ్ ద్వారా ఓటు వేయబడుతుంది. మొదటి సైమా వేడుక 21 & 22 జూన్ 2012 న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగింది. ఇది భారతదేశంలో ప్రముఖ వినోద అవార్డు వేడుకలలో ఒకటి.

లఘు చిత్రాల తయారీదారులు, నటులను గౌరవించడానికి సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగాన్ని చేర్చబోతున్నట్లు 2017 లో విబ్రీ మీడియా గ్రూప్ ప్రకటించింది.

చరిత్ర

మార్చు

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ను 2012 లో విష్ణు వర్ధన్ ఇందూరి ప్రారంభించారడు. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలైన, తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమా, కన్నడ సినిమా నుండి వచ్చిన చిత్రనిర్మాతలను అభినందించి, దక్షిణ భారత చిత్రాలను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రోత్సహించడానికి ఒక వేదికను అందించారు.[2]

వేడుకలు

మార్చు
వేడుకలు తేదీ హోస్ట్లు వేదిక నగరం దేశం మూలాలు
మొదటి సైమా 21–22 జూన్ 2012 మంచు లక్ష్మి, ఆర్. మాధవన్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
రెండవ సైమా 12–13 సెప్టెంబర్ 2013 రానా దగ్గుబాటి ఎక్స్‌పో సెంటర్ షార్జా షార్జా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [3]
మూడవ సైమా 12–13 సెప్టెంబర్ 2014 నవదీప్, శ్రద్ధా దాస్ స్టేడియం నెగారా కౌలాలంపూర్ మలేషియా
నాల్గవ సైమా 6 – 7 ఆగస్టు 2015 శ్రీముఖి, రానా దగ్గుబాటి, ఆలీ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఐదవ సైమా 30 – 1 జూలై 2016 మంచు లక్ష్మి, అల్లు శిరీష్ సన్‌టెక్ నగరం సింగపూరు సింగపూరు
ఆరవ సైమా 30 – 1 జూలై 2017 మంచు లక్ష్మి, అల్లు శిరీష్ అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ అబు దాబి‎ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [4]
ఏడవ సైమా 14–15 సెప్టెంబర్ 2018 రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పులికొండ, శ్రీముఖి దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [5]
ఎనిమిదవ సైమా ఆగస్టు 2019 రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పులికొండ, సుమ కనకాల లుసైల్ స్పోర్ట్స్ అరేనా దోహా ఖతార్ [6]
9వ సైమా అవార్డ్స్ 18–19 సెప్టెంబర్ 2021 శ్రీముఖి, ధన్య బాలకృష్ణ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ భారత్
10వ సైమా అవార్డ్స్ 10–11 సెప్టెంబర్ 2022 శ్రీముఖి, రానా దగ్గుబాటి, ఆలీ బెంగళూరు భారత్
11వ సైమా అవార్డ్స్ 15–16 సెప్టెంబర్ 2023 దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ దుబాయ్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [7]

అవార్డుల వివరాలు

మార్చు

తెలుగు

మార్చు

కన్నడం

మార్చు

మూలాలు

మార్చు
  1. "SIIMA 2019 List: 'రంగస్థలం'కు అవార్డుల పంట.. ఇదిగో పూర్తి జాబితా". Samayam Telugu. Retrieved 2021-02-18.
  2. "దుబాయ్: సైమా అవార్డ్స్ 2018 విజేతల జాబితా". Zee News Telugu. 2018-09-16. Retrieved 2020-09-28.
  3. Kumar, Bojja (2013-09-13). "త్రిషకు SIIMA-2013 స్పెషల్ అవార్డ్ (ఫోటోలు)". telugu.filmibeat.com. Retrieved 2020-09-28.
  4. "సైమా వేడుకలు: పాటతో అదరగొట్టిన అఖిల్!". Samayam Telugu. Retrieved 2021-02-18.
  5. "'సైమా' అవార్డులు లిస్ట్: సాహోరే బాహుబలి". Samayam Telugu. Retrieved 2020-09-28.
  6. "SIIMA 2019 : సైమా అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటీనటులు వీరే." News18 Telugu. 2019-08-16. Retrieved 2020-09-28.
  7. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

బయటి లింకులు

మార్చు