మాడిపోయిన ట్యూబ్‌లైట్లో మళ్ళీవెలుగులు నింపేందుకు మండోజి నర్సింహాచారి రూపొందించిన పరికరం పేరు ఐక్య-రెడ్ (IKYA-ReD). ఈ పరికరం మాడిపోయిన ట్యూబ్‌లైట్ ను వెలిగించటమే ప్రధానమైనను ఈ పరికరం ద్వారా కొత్త ట్యూబ్‌లైట్ నూ వెలిగించవచ్చు. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్‌ను వెలిగించినట్లయితే విద్యుత్ ఆదా కూడా అవుతుంది. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్ వెలుగునప్పుడు గతకడం కూడా జరగదు, తడిసినా నీటిలో మునిగినా లైట్ వెలుగునిస్తూ ఉంటుంది.

ఈ పరికరంతో లాభాలు
  1. కాలిపోయిన/కొత్త ట్యూబ్‌లైట్ ను వెలిగించవచ్చు.
  2. చౌక్, స్టార్టర్ ల అవసరం లేదు.
  3. తక్కువ ఓల్టేజ్ తో పనిచేస్తుంది.
  4. గతకదు.
  5. ఉపయోగించడం చాలా సులభం.

మండోజి నర్సింహాచారిసవరించు

కాలిపోయిన ట్యూబ్ లైట్ను కూడా వెలిగించగల సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించి అందరిని అబ్బురపరచిన ఆవిష్కర్త మండోజి నర్సింహాచారి. ఇతను తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన వ్యక్తి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఐక్య-రెడ్&oldid=2884443" నుండి వెలికితీశారు