ఐస్ క్రీమ్ 2 2014, నవంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన, జె. డి. చక్రవర్తి జంటగా నటించగా, సత్య కశ్యప్ సంగీతం అందించాడు.[1][2][3][4] ఐస్ క్రీమ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.[5]

ఐస్ క్రీమ్ 2
ఐస్ క్రీమ్ 2 సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతతుమ్మలపల్లి సత్యనారాయణ
తారాగణంజె. డి. చక్రవర్తి
నవీన
జీవా
ఛాయాగ్రహణంఅంజి
కూర్పునాగేంద్ర అడప
సంగీతంసంగ ప్రతాప్ కుమార్
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
2014 నవంబరు 21 (2014-11-21)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు10 కోట్లు

కథ మార్చు

ఐదుగురు స్నేహితులు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తియ్యాలనుకొని అడవిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు వింత వింత అనుభూతులు ఎదురవుతుంటాయి. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంలో బ్యాంక్ దొంగతనాలు చేసే సిక్క (జెడి చక్రవర్తి) అతని గ్యాంగ్ తో కలిసి ఈ ఐదుగురిని కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ చంపబడుతూ ఉంటారు. ఆ అడవిలో వాళ్ళని ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, చివరికి ఎవరన్నా బతికారా అన్నది మిగతా కథ.[6]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  • నిర్మాత: తుమ్మలపల్లి సత్యనారాయణ
  • సంగీతం: సత్య కశ్యప్
  • ఛాయాగ్రహణం: అంజి
  • కూర్పు: నాగేంద్ర అడప
  • నిర్మాణ సంస్థ: భీమవరం టాకీస్

పాటలు మార్చు

ఈ సినిమాకి సత్య కశ్యప్ సంగీతం అందించాడు. ఈ3 మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

ఐస్ క్రీమ్ 2
పాటలు by
సత్య కశ్యప్
Releasedసెప్టెంబరు 23, 2014
Recorded2014
Genreపాటలు
Length14:08
Labelఈ3 మ్యూజిక్
Producerసత్య కశ్యప్
సత్య కశ్యప్ chronology
కౌన్రీ కన్య
(2013)
ఐస్ క్రీమ్ 2
(2014)
తోడా ప్యార్ తోడా మ్యాజిక్
(2016+)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కిస్ మీ"  సునీత ఉపద్రష్ట 4:07
2. "చల్ల చల్లగా"  ఉమా నేహ, అక్షర పరాషర్ 2:53
3. "కిస్ మీ (రిమిక్స్)"  సునీత ఉపద్రష్ట 3:49
4. "ఐస్ క్రీమ్ థీమ్"  వాయిద్యం 3:19
24:38

మూలాలు మార్చు

  1. "RGV finds his new muse for Ice-Cream 2". The Times of India. Retrieved 16 August 2020.
  2. "RGV reunites with JD Chakravarthy". The Times of India. Retrieved 16 August 2020.
  3. "RGV ICECREAM 2 FIRST LOOK POSTER". supergoodmovies.com. Archived from the original on 18 August 2014. Retrieved 16 August 2020.
  4. "Ice Cream 2 Trailer and songs. Telugu movie trailers, songs and clips from IndiaGlitz". IndiaGlitz. Archived from the original on 25 ఆగస్టు 2014. Retrieved 16 August 2020.
  5. "Ice Cream 2 Release Date". cinesprint.com. Retrieved 16 August 2020.
  6. 123తెలుగు, సినిమా రివ్యూ (21 November 2014). "Ice Cream 2 telugu movie review". www.123telugu.com. Archived from the original on 16 August 2020. Retrieved 16 August 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 మార్చి 2018 suggested (help)CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు మార్చు