''ఐ.టీ.సి హోటల్స్'', భారతదేశపు రెండో అతిపెద్ద హోటల్స్ చైన్. ఈ సంస్థకు సుమారు 100 హోటల్స్ ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ గుర్గాన్ లోని ఐ.టీ.సి గ్రీన్ సెంటర్ లో ఉంది. ఐ.టీ.సి హోటల్స్, భారత్ లోని స్టార్ వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ప్రముఖ విలాస కలెక్షన్ బ్రాండ్ కు ఫ్రంచిసీ. ఈ సంస్థ ఐ.టి.సి (ఇండియన్ టొబాకో లిమిటెడ్) గ్రూప్ అఫ్ కంపెనీస్‌లో ల ఒక భాగం.[1][2] హాస్పిటాలిటీ విభాగంలో ఈ సంస్థ ఆసియా ఖండం లోని ఉత్తమ యజమానులుగా ఎన్నికయ్యారు.[3]

ఐ.టీ.సి హోటల్స్
రకంహోటల్స్
పరిశ్రమసేవా రంగం
స్థాపన1975
ప్రధాన కార్యాలయం190,
గుర్గాన్
,
సేవ చేసే ప్రాంతము
భారత్
కీలక వ్యక్తులు
వై.సి.దేవేశ్వర్
యజమానిఐ.టీ.సి
వెబ్‌సైట్Official site

చరిత్ర

మార్చు

ఐ.టీ.సి లిమిటెడ్, 1975 అక్టోబరు 18 న హోటల్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఒక హోటల్ ప్రారంభంతో ఈ వ్యాపారం మొదలైంది. దీనినే తర్వాత "హోటల్ చోళ"గా పేరు పెట్టారు.[4]

2006 కి, ఐ.టీ.సి హోటల్స్ 75 ప్రాంతాలలో 100 హోటళ్లకు పైగా సొంతంగా నడుపుతుంది. ఈ సంస్థకి విదేశాల నుడి వచ్చిన ప్రముఖులకు, నాయకులకు వరుసగా ఆతిధ్యం ఇచ్చిన పేరు ఉంది.[5][6][7][8]

ఐ.టీ.సి రెస్టరంట్ లు బుఖారా, పెశావరి, దక్షిణ, డుమ్ఫుఖ్త్, కేబబ్స్ & కుర్రీస్ ఈ రోజు ప్రసిద్ధ బ్రాండ్ లగా ఈ రోజు గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఎన్నో ఆహార పదార్ధాలను 'కిచెన్స్ అఫ్ ఇండియా' అనే బ్రాండ్ తో అమ్ముతుంది.[9]

ఐ.టీ.సి హోటల్స్ భారత్ లోని ఎక్కువగా కళాఖండాలు సేకరించే వాళ్ళలో ఒకరు.[10] కోలకతలో ఇప్పటిదాకా సేకరించిన కళాఖండాలతో ఒక మ్యుసీఅం ప్రారంభించాలని యోచిస్తునారు. గుర్గాన్, మనేసర్, లోని ఐ.టీ.సి గ్రాండ్ భారత్ ఈ సంస్థ కట్టిన కొత్త హోటల్.[11]

ఐ.టీ.సి బ్రాండ్స్

మార్చు
 
ఐ.టీ.సి గ్రాండ్ మరాఠా హోటల్, ముంబై.
 
లవాస ఫార్చ్యూన్ హోటల్ కోర్ట్ యార్డ్, లవాస, మహారాష్ట్ర.

ఈ సంస్థ ఈరోజు ఎన్నో విభాగాలలో ప్రముఖ బ్రాండ్లను నడుపుతుంది :

  • విలాసపూరిత హోటల్స్ కలెక్షన్.షెరటాన్ హోటల్స్
  • ఫార్చ్యూన్ హోటల్స్, ఈ సంస్థకు భారత్ లోని 41 నగరాలలో, 54 హోటల్స్, 4,446 గదులు కలిగి ఉన్నాయి.[12]
  • వెల్కమ్ హెరిటేజ్ హోటల్స్

కళా సేకరణ

మార్చు

1975 నుండి, ఐ.టీ.సి హోటల్స్ 50 కళాకారులతో కూడిన ఒక ఆర్ట్ బ్యాంకు ఉంది. ఈ జాబితాలో ప్రముఖ భారతీయ కళాకారులు ఎ.జి.సుబ్రహ్మణ్యం, క్రిషన్ ఖాన్న ఎం.ఎఫ్.హుస్సేన్, జతిన్ దాస్, రామ్ కుమార్, ఎఫ్.ఎన్.సౌజా, జే.స్వామినాథన్, త్యేబ్ మెహతా, ఆంజలీ ఎలా మీనన్, అక్బర్ పదమ్సీ, ఏ. రామచంద్రన్, సతీష్ గుజ్రాల్, మీరా ముఖర్జీ, జైమిని రాయ్, బికాష్ భట్టాచార్జీ, సంజయ్ భట్టాచార్జీ, గోపి గజ్వాని, బిరెన్ దీ, కిం మైఖేల్, జి.ఆర్.సంతోష్, అర్పిత సింగ్ ఉన్నారు.

సూచనలు

మార్చు
  1. "ITC Limited - One of the World's Most Reputable Companies".
  2. "ITC - History and Evolution".
  3. "Welcomgroup tops Hewitt best employer" Archived 2009-04-19 at the Wayback Machine.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-12-03. Retrieved 2016-01-28.
  5. http://www.rediff.com/news/2006/mar/01bush29.htm
  6. http://infotech.indiatimes.com/articleshow/msid-28103943,prtpage-1.cms[permanent dead link]
  7. http://www.rediff.com/news/2000/oct/02putin.htm
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-25. Retrieved 2016-01-28.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-24. Retrieved 2016-01-28.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-20. Retrieved 2016-01-28.
  11. http://www.thehindubusinessline.com/companies/itc-grand-bharat-launched-in-ncr/article7089651.ece
  12. "Fortune signs up Savoy Hotel in Mussoorie".