ఐ లవ్ యూ
ఐ లవ్ యు 1979 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. దీనికి వాయు నందన రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, సువర్ణ, ప్రసాద్ బాబు, పిఎల్ నారాయణ తదితరులు నటించారు. ఇది ఏకకాలంలో కన్నడలో చిత్రీకరించబడింది , అదే శీర్షికతో శంకర్ నాగ్ నటించిన ఈ సినిమాలో సువర్ణ తన పాత్రను తిరిగి పోషించింది. [1] [2]
ఐ లవ్ యు | |
---|---|
దర్శకత్వం | వాయు నందన రావు |
తారాగణం | చిరంజీవి |
నిర్మాణ సంస్థ | శ్రీ గౌరి కంభైన్స్ |
విడుదల తేదీ | 1 జూన్ 1979 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురమేష్ ( చిరంజీవి ) దినచర్యలో భాగంగా తన స్నేహితులతో కలిసి డ్రైవింగ్ చేయడం, యువతులను మోహింపజేయడం, వారిని వెంబడించడం వంటివి ఉంటాయి. సువర్ణ ఒక మధ్యతరతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె విద్యాభ్యాసం కోసం గ్రామం నుండి పట్టణానికి వస్తుంది. రమేష్ సువర్ణను లక్ష్యంగా చేసుకుంటాడు. సువర్ణను ఆమె బావ ప్రసాద్ బాబు కూడా వివాహం చేసుకోవాలనుకుంటాడు. అతను సువర్ణను రమేష్ కారులో చూసినపుడు అసూయ పడతాడు. ఈ విషయంపై ఆమెను హెచ్చరిస్తాడు. కానీ సువర్ణ రమేష్ పై ఆకర్షితురాలవుతుంది. ఒకరోజు రమేష్ ఆమెను తప్పించుకుని తిరుగుతాడు. తరువాత రమేష్ ఒక ప్రమాదానికి గురయ్యాడని, ఇప్పుడు నడవలేకపోతున్నాడని, వీల్ చైర్లో గడుపుతున్నాడని సువర్ణకు తెలుస్తుంది. ఆమె రమేష్ బంధువును సహాయమడిగి అతని ఇంటిని తెలుసుకొని అతనికి నర్సుగా సేవలు చేస్తుంది.
ఇంతలో, రమేష్ తల్లి, మామయ్యలు రమేష్ కు తన మామ కుమార్తెతో వివాహం చేయాలని నిర్ణయిస్తారు. సువర్ణ రమేష్‌ను తన తప్పును, నిస్సహాయతను గ్రహించేలా చేస్తుంది. రమేష్ తన తప్పులను గ్రహించి సువర్ణను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె తండ్రితో మాట్లాడతాడు. తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా, సువర్ణ రమేష్ ను వివాహం చేసుకుంటుంది, కాని రమేష్ తన శక్తిని కోల్పోయాడని తెలుసుకుంటుంది. ఆమె డాక్టర్ సలహాను అనుసరించి ఆమె ఉద్దేశపూర్వకంగా రమేష్ అహాన్ని దెబ్బతీసి అతని ఇంటి నుండి వెళ్లిపోతుంది. బాధపడిన రమేష్ తన కాళ్ళ మీద నిలబడి తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బలవంతం చేస్తాడు. చివరికి రమేష్ తన కాళ్ళను తిరిగి పొందాడని తెలుసుకొని మారిన రమేష్ తో సంతోషంగా జీవిస్తుంది.
తారాగణం
మార్చునిర్మాణం
మార్చుఐ లవ్ యు అరుదైన చిత్రం, సాధారణంగా వీరోచిత పాత్రలకు పేరుగాంచిన చిరంజీవి వ్యతిరేక వ్యక్తిత్వం ఉన్న పాత్రను పోషించారు. [3] [4]
పాటలు
మార్చుసౌండ్ట్రాక్ను చెళ్లపిళ్ళ సత్యం స్వరపరిచాడు. [5] లెస్ రీడ్, జియోఫ్ స్టీఫెన్స్ రాసిన " దేర్ ఎ కైండ్ ఆఫ్ హుష్ " ఆధారంగా "ఓకా మాటుంది" పాట రూపొందించబడింది. [6]
1.ఎవరన్నారు ఎందుకంటారు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
2: ఒక మాటుంది కలవరంరేపి మనసులో , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
3.థిల్లానా, గానం.శిష్ట్లా జానకి
4.నాజూకు నాలో ఉంది చూడరా, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి
5.లబ్జనక లబ్జనక అబ్బ దాని షోకు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.నిన్నే కోరి ఉన్నదిరా, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి.
ఆదరణ
మార్చుఈ చిత్రం ద్వారా చిరంజీవి నటుడిగా గుర్తింపు పొందాడు. [7]
మూలాలు
మార్చు- ↑ https://chiloka.com/movie/i-love-you-1979
- ↑ https://indiancine.ma/TVH/info
- ↑ https://www.indiatoday.in/movies/celebrities/story/happy-birthday-chiranjeevi-turns-61-the-gentleman-indra-336612-2016-08-22
- ↑ https://www.hindustantimes.com/regional-movies/chiranjeevi-the-megastar-who-beat-big-b-as-the-highest-paid-actor/story-rIDYGZUtUgkNHYfnH2VDcM.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-16. Retrieved 2020-08-21.
- ↑ https://www.itwofs.com/telugu.html
- ↑ http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/index.html
. 8.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.