ఒక నారి – వంద తుపాకులు
(ఒక నారి - వంద తుపాకులు నుండి దారిమార్పు చెందింది)
ఒక నారి – వంద తుపాకులు రవిచిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై వై.వి.రావు నిర్మించిన తెలుగు యాక్షన్ చిత్రం. ఈ చిత్రం నలుపు తెలుపులో తీసినప్పటికీ చివరి ఘట్టాలు రంగుల్లోను, సినిమాస్కోప్‌లోను ఉండడం ఒక ప్రత్యేక ఆకర్షణ.[1]
ఒక నారి – వంద తుపాకులు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.ఎస్.కుటుంబరావు |
---|---|
తారాగణం | రాజనాల కాళేశ్వరరావు, విజయలలిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | రవిచిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
సంక్షిప్త కథ
మార్చుఒక సంస్థానంలో పాలకులు ప్రజలను పీడించి పిప్పి చేస్తుంటారు. ప్రతిఘటించిన ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెట్టి చంపుతుంటారు. ఆ అరాచకాలలో భవానీ అనే యువతి తన తండ్రినీ, తమ్ముడినీ పోగొట్టుకుంటుంది. ప్రజలు భయపడి చెల్లాచెదురైపోతుంటే భవానీ రక్తం ఉడికిపోతుంది. ఆ సమయంలో ఆమె ప్రజాఉద్యమానికి నాయకత్వం వహించి పాలకుల పక్కలో బల్లెం అవుతుంది.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- విజయలలిత - భవాని, దుర్గాదాస్ కూతురు
- రాజనాల కాళేశ్వరరావు - దివాన్
- త్యాగరాజు- సర్దార్
- శివరామకృష్ణయ్య - కొత్వాల్ కోటిలింగం
- రాజబాబు - అవతారం
- ప్రభాకర్‌రెడ్డి
- రామకృష్ణ
- భీమరాజు
- జి.రత్నం
- శుభ
- విజయభాను
- మాస్టర్ రాము
- షావుకారు జానకి
- మోదుకూరి సత్యం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం : కె.వి.ఎస్.కుటుంబరావు
- కథ: వై.వసంతరావు
- మాటలు: వీటూరి
- పాటలు: దాశరథి, ఆరుద్ర, కొసరాజు, వీటూరి
- ఛాయాగ్రహణం: దేవరాజ్
- సంగీతం: సత్యం
- కళ: బి.చలం
- నిర్మాణం: వై.వి.రావు
- నృత్యాలు: హీరాలాల్
- కూర్పు: బాలు
పాటలు
మార్చు- అమ్మా నరసమ్మా పోలేవమ్మా మా పిల్లల రాజ్యంలో - ఎస్.పి.బాలు, వసంత - రచన: దాశరథి
- ఏరా సామిరంగా పోరా అమ్మదొంగ హాయ్ హాయ్ - పి.సుశీల బృందం - రచన: వీటూరి
- చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- మగసిరి చూస్తే హాయ్ భయమాయె సరసాలు హాయ్ - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
- ఆయ్ కంచి కామాచ్చమ్మా మధుర మీనాచ్చమ్మా - ఎస్.జానకి - రచన: వీటూరి
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (11 March 1973). "రూపవాణి - ఒక నారి వంద తుపాకులు". ఆంధ్రప్రభ దినపత్రిక. No. సంపుటి 38 సంచిక 66. Retrieved 19 March 2018.[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)