ఒడి (Lap or Loin) మనం కూర్చున్నప్పుడు ముడుకులకు పొత్తికడుపుకు మధ్యలోని భాగం. ఇది నిలబడి లేదా పడుకొని ఉన్నప్పుడు తెలియదు. చంటి పిల్లల్ని తల్లి ఒళ్లో లేదా ఒడిలో కూర్చుండబెట్టుకొని పాలిచ్చును. కొన్ని రకాల కంప్యూటర్లు ఒడిలో ఉంచుకొని ఉపయోగించడానికి అనువుగా తయారుచేస్తున్నారు. వీటిని "లాప్ టాప్ కంప్యూటర్లు" అంటారు. ఒడిలో కూర్చుని సంభోగించడం రతి క్రియ లో ఒక భంగిమ.

తల్లి ఒడిలో పాలుత్రాగుతున్న బిడ్డ
స్త్రీపురుషులలో ఒడి ప్రాంతాలు.
ఒక IBM Thinkpad R51 లాప్ టాప్ కంప్యూటర్

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో ఒడి కి సంబంధించిన వివిధ ప్రయోగాలున్నాయి.[1] ఒడి అనగా తొడ పైభాగము లేదా ఒడువు. ఆవుకు ఒడిజారినది నేడో రేపో దూడవేయును అంటారు. ఒడ్డాణము స్త్రీలు ఒడి భాగంలో ధరించే ఆభరణము. "ఒడికట్టు" అనగా ప్రయుత్నించు అని అర్ధం. ఉదా: వాడు పాపానికి ఒడికట్టెను. స్త్రీలు ధరించే మొలనూలును "ఒడిదారము" అని కూడా అంటారు. హిందువుల వివాహం సమయంలో వధువు ఒడిని ధరించిన వస్త్రంలో పోసిన బియ్యమును "ఒడిబ్రాలు" అంటారు.

సాహిత్యం

మార్చు

తెలుగు సినిమా పాటలలో "అత్త ఒడి పూవు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా నిదురపోమ్మా" అనే పాట బహుళ ప్రాచుర్యం పొందినది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఒడి&oldid=3877405" నుండి వెలికితీశారు