ఒద్దిరాజు రాఘవ రంగారావు
ఒద్దిరాజు రాఘవ రంగారావు (1894 - 1973) ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు.

జీవిత విశేషాలు సవరించు
ఈయన తల్లి రంగనాయకమ్మ, తండ్రి వేంకటరామారావు దంపతులకు 1894 లో జన్మించారు. ఈయన తెలంగాణా ప్రాంతంలో మొట్టమొదటి పత్రిక 'తెనుగు పత్రిక'ను 1922లో ప్రారంభించిన ఒద్దిరాజు సోదరులలో ఒకరు. పత్రిక ద్వారా జనసామాన్యంలో విజ్ఞానవ్యాప్తికి, దేశభక్తి పెంపొందించడానికి ఎంతో కృషి చేసారు. వీరిది మానుకోట తాలూకా ఇనుగుర్తి (ప్రస్తుతం వరంగల్ జిల్లా, కేసముద్రం మండలంలో ఉన్నది). 1894 ఏప్రిల్ 4వ తేదీన జన్మించారు. ఒద్దిరాజు సోదరులు విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి వందకు పైగా తెలుగు పుస్తకాలను ప్రచురించారు. వీటిలో విజ్ఞానశాస్త్రం, హస్తకలలు, ఛాయాగ్రహణం మొదలైన విషయాలకు సంబంధించిన గ్రంథాలున్నాయి. నైజాం ప్రాంతంలో తెలుగుభాషాభివృద్ధి ఈ సంఘం విశేషకృషిసల్పింది.[1]
ఇతని రచనలు సవరించు
- వీరావేశము
- వరాహముద్ర
- పంచకూళ కషాయం
- విషములు - తచ్చికిత్సలు
- సప్తపది
- ఉత్తర గురు పరంపర
- ఆర్త ప్రబంధం
- సప్తగాథ
- గురుపరంపరా ప్రభావం
- ముదలయిరం
- వణ్ణమా డంగల్
- మత్కుణోపాఖ్యానం
- తపతీ సంవరణోపాఖ్యానం
- లండన్ విద్యార్థి (కథ)
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Das, Sisir Kumar (1991). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. 528. ISBN 9788172017989. Retrieved 16 April 2015.