ఒరిస్సా జన కాంగ్రెస్

ఒరిస్సాలోని రాజకీయ పార్టీ

ఒరిస్సా జన కాంగ్రెస్ (ఒరిస్సా పీపుల్స్ కాంగ్రెస్) అనేది ఒరిస్సాలోని రాజకీయ పార్టీ. 1966లో హరే కృష్ణ మహతాబ్ (మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి) భారత జాతీయ కాంగ్రెస్‌ను విడిచిపెట్టినప్పుడు ఈ జన కాంగ్రెస్ ఏర్పడింది. 1967 ఎన్నికల తర్వాత జన కాంగ్రెస్ స్వతంత్ర పార్టీతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో పాల్గొంది. ఆ ప్రభుత్వం 1967 నుంచి 1969 వరకు కొనసాగింది. 1971, 1974 రాష్ట్రాల ఎన్నికలలో జన కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది, కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. 1977లో జన కాంగ్రెస్ జనతా పార్టీలో విలీనమైంది.[1]

ఒరిస్సా జన కాంగ్రెస్
నాయకుడుహరే కృష్ణ మహతాబ్
స్థాపన తేదీ1966; 58 సంవత్సరాల క్రితం (1966)
రద్దైన తేదీ1977; 47 సంవత్సరాల క్రితం (1977)
ECI Statusమాజీ పార్టీ

మూలాలు

మార్చు
  1. "Regional Political Parties and Coalition Government of Odisha - Ignited Minds Journals". ignited.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-07-21. Retrieved 2022-07-21.