ఓబులాపురం (రెడ్డిగూడెం)
ఓబులాపురం, కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఓబులాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°49′50″N 80°41′08″E / 16.830576°N 80.685577°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | రెడ్డిగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521215 |
ఎస్.టి.డి కోడ్ | 08673. |
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చునాగసానిపాటి చెరువు
మార్చుఈ చెరువు లోతట్టు 66 ఎకరాలు ఉండగా, సాగు ఆయకట్టు 300 ఎకరాలు ఉంది. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,మే నెలలో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు తమ ట్రాక్టర్లతో, నల్లరేగడి మట్టి అయిన ఈ పూడిక మట్టిని తమ పొలాలకు, మామిడి తోటలకు, తరలించుకొని పోవుచున్నారు. అంతేగాక, ఈ మట్టిని తమ ఇళ్ళ స్థలాలు మెరక చేసుకొనుటకు గూడా తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.2016లో ఈ చెరువులో పూడికతీయుట వలన, ఇప్పుడు ఆ చెరువును సాగర్ జలాలతో నింపుట వలన, చెరువు, ఇప్పుడు, నీటితో జలకళ సంతరించుకున్నది.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం, నరుకుళ్ళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.