ఓషన్‌శాట్-2 ఉపగ్రహం
ఓషన్ శాట్-2 ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్మించి ప్రయోగించింది.అంతకు ముందు ప్రయోగించిన ఓషన్‌శాట్ ఉపగ్రహం జీవితకాలం ముగిసినందున, ఆ ఉపగ్రహం ద్వారా వాడుకరులకు అందిస్తున్న సమాచారాన్ని మునుముందు నిరంతరాయంగా అందించుటకై, సమాచార సేకరణ కొనసాగించుటకై, దాని స్థానంలో ఓషన్ శాట్-2 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.
మిషన్ రకం | Oceanography |
---|---|
ఆపరేటర్ | ISRO |
COSPAR ID | 2009-051A |
SATCAT no. | 35931 |
మిషన్ వ్యవధి | 5 years planned |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | IRS[ఆధారం చూపాలి] |
లాంచ్ ద్రవ్యరాశి | 960 కిలోగ్రాములు (2,120 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 23 September 2009, 06:21 | UTC
రాకెట్ | PSLV C14 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP |
కాంట్రాక్టర్ | ISRO |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Sun-synchronous |
Perigee altitude | 728 కిలోమీటర్లు (452 మై.)[1] |
Apogee altitude | 731 కిలోమీటర్లు (454 మై.)[1] |
వాలు | 98.27 degrees[1] |
వ్యవధి | 99.25 minutes[1] |
ఎపోచ్ | 24 January 2015, 05:06:02 UTC[1] |
ఉపగ్రహ ప్రయోగ ప్రధానలక్ష్యం
మార్చుఉపగ్రహ ప్రయోగ లక్ష్యం ఉపరితల గాలుల, సముద్ర ఉపరితల strata అధ్యయనం చెయ్యడం,, క్లోరోఫిల్ గాఢత పరిశీలన వృక్షప్లవకాలు, వికసనం (phytoplankton blooms) ల పరిశీలన పర్యవేక్షణ/నియంత్రణ, వాతావరణంలోని ఏరోసోల్, గాలితుంపర (aerosols), సముద్రజలాలలో తేలియాడు పదార్థాల అద్యయనంచేయుట. ఓషన్ శాట్-2 ఉపగ్రహం ప్రధాన లక్ష్యాలలో ఒకటి సముద్రాలలోని చేపల ఆవాస ప్రాంతాలను గుర్తించడం. అలాగే ఓషన్ శాట్-2 ఇతర లక్ష్యాలు సముద్రస్థితిలోని మార్పులను ముందస్తుగాఅంచనా వెయ్యడం, శీతోష్ణస్థితిలోని మార్పులను అధ్యయనం చెయ్యడం, వాతావరణ స్థితి గతులను ముందుగా తెలిసికొనుట.
ఉపగ్రహంలో అమర్చిన ఉపకరణాలు(payloads)
మార్చుసముద్రాలకు, సముద్రతీర ప్రాంతాల వాతావరణానికి చెందిన సిస్టమాటిక్ డేటాను సేకరించడం ఓషన్ శాట్-2 ఉపగ్రహం ప్రధాన ధ్యేయం.ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ శ్రేణిలో సముద్ర పరిశోధనకై నిర్మించిన రెండవ ఉపగ్రహం ఓషన్ శాట్-2. ఓషన్ శాట్-2 ఉపగ్రహం 3 పరిశోధన ఉపకరణాల సముదాయాన్ని కల్గిఉన్నది.[2] [3] అవి.
ఓషన్ కలర్ మోనిటర్ (OCM)
మార్చుగతంలో ఈరకపు పరికరాన్ని ఓషన్ శాట్-1 ఉపగ్రహంలో కూడా అమర్చారు. ఇది 8బ్యాండుల బహుళ స్పెక్ట్రల్ కెమరా. సాధారణ దృశ్యస్థితిలో, ఐఆర్ స్పెక్ట్రల్ రేంజిలోనూ ఇది పనిచేస్తుంది. ఈ కెమెరా 360 మీటర్ల భూక్షేత్రదృశ్యపరిధితో, 1420 కిమీ swath తో వెనువెంటనే చిత్రీకరణచేస్తుంది. ఈ కెమెరాను +20 డిగ్రీల వరకు ట్రాక్ లో అటు ఇటు కదిలించవచ్చును.[2][3]
Ku బ్యాండ్ పెన్సిల్ భీమ్ స్కాట్టరోమీటరు(SCAT)
మార్చుదీనిని ఇస్రో సంస్థ రూపొందించింది. ఇది మైక్రోవేవ్ ఉపకరణం. అహమ్మదబాద్ లోని ఇస్రోకు చెందిన సంస్థ తయారు చేసింది. రేడార్ బ్యాక్ స్కాటర్ ను ఉపయోగించి సముద్ర ఉపరితల గాలులదిశను (wind vectors) ను అంచనా వేయవచ్చును. ఈ స్కాటర్‌మీటరు 1-మీటరు పారాబోలిక్ డిష్‌ఎంటేన్నా కలిగి, డ్యూయల్ ఫీడ్ అమరిక ద్వారా రెండు పెన్సిల్ కిరణాలను సృష్టిస్తుంది. వీటి ద్వారా 20.5 ఆర్ పి యం (నిమిషానికి భ్రమణాల సంఖ్య) తో మొత్తం swath ను కవర్ చేస్తుంది. Ku బ్యాండు పెన్సిల్ కిరణ స్కట్టరుమీటరు ఒక సచేతన మైక్రోవేవ్ రేడారు. ఇది 13.515 GHz తో పనిచేస్తుంది.[2][3]
రేడియో అక్సులేసన్ సౌండరు ఫర్ అట్మాస్ఫియర్(ROSA)
మార్చుఈ ఉపకరణాన్ని ఇటాలియన్ అంతరిక్ష ఏజన్సీ తయారు చేసింది.
ఉపగ్రహ ప్రయోగం
మార్చుఓషన్ శాట్-2 ఉపగ్రహాన్ని ఇస్రో తయారు చేసిన పిఎస్ఎల్‌వి-సీ14 అనే ఉపగ్రహప్రయోగ వాహకనౌక ద్వారా, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి 2013, సెప్టెంబరు 23 న ఉదయం 11.51 గంటలకు ప్రయోగించారు. ఉపగ్రహాన్ని నిర్దేశితకక్ష్యలో ప్రవేశపెట్టుటకు పట్టిన సమయం 1200 సెకన్లు. ఓషన్ శాట్-2 ఉపగ్రహంతో పాటు ఆరు యురోపియన్ నానో ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగ సమయంలో ఓషన్ శాట్-2 ఉపగ్రహం బరువు 960కిలోలు. మిగిలిన ఆరు నానో ఉపగ్రహాల మొత్తం బరువు 20 కిలోలు. అందులో 4 ఉపగ్రహాల బరువు, ఒక్కొకటి ఒక కిలో కాగా, మిలిన రెండు ఉపగ్రహాలు ఒక్కొక్క దాని బరువు 8 కిలోలు. ఓషన్ శాట్-2 ఉపగ్రహాన్ని 720 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో (sun-synchronous orbit (SSO) లో ప్రవేశపెట్టారు.[2]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "OCEANSAT 2 Satellite details 2009-051A NORAD 35931". N2YO. 24 January 2015. Retrieved 25 January 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 "OCEANSAT-2". nrsc.gov.in. Archived from the original on 2015-08-16. Retrieved 2015-10-13.
- ↑ 3.0 3.1 3.2 "Oceansat-2". isro.gov.in. Archived from the original on 2017-07-31. Retrieved 2015-10-13.